AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shukra Gochar: మకర రాశిలో శుక్రుడు.. ఆ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం..!

Venus Transit 2026: శనీశ్వరుడికి సంబంధించిన మకర, కుంభ రాశుల్లో సంచారం చేస్తున్నప్పుడు శుక్రుడు కొన్ని రాశుల వారికి తప్పకుండా లక్ష్మీ కటాక్షం కలిగిస్తాడు. ఈ నెల(జనవరి) 12 నుంచి ఫిబ్రవరి 6 వరకు మకర రాశిలో సంచారం చేయబోతున్న శుక్రుడి వల్ల మేషం, వృషభం, కన్య, తుల, మకరం, మీన రాశులకు ధన యోగాలు, రాజయోగాలు పట్టబోతున్నాయి. అనేక విధాలుగా ఆదాయం పెరగడంతో పాటు పదోన్నతులకు, అధికార యోగానికి అవకాశం ఉంది. మనసులోని కోరికలు చాలా వరకు నెరవేరడంతో పాటు ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి పూర్తిగా బయటపడే అవకాశం ఉంది.

TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jan 06, 2026 | 7:10 PM

Share
మేషం: ఈ రాశికి దశమ స్థానంలో శుక్ర సంచారం వల్ల ఉద్యోగంలో పదోన్నతి కలిగే అవకాశం ఉంది. పని భారం, పని ఒత్తిడి బాగా తగ్గుతాయి. మరింత మంచి ఉద్యోగంలోకి మారడానికి చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లతో సహా అనేక ఆఫర్లు అందుతాయి. సంపన్న కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురుతుంది. వృత్తి, వ్యాపారాలు బాగా బిజీగా సాగిపోతాయి. షేర్లు, స్పెక్యులేషన్లు బాగా లాభిస్తాయి. తీర్థ యాత్రలు, విహారయాత్రలు ఎక్కువగా చేయడం జరుగుతుంది.

1 / 6
వృషభం: రాశ్యధిపతి శుక్రుడు భాగ్యస్థానంలో ప్రవేశించడం వల్ల ఈ రాశివారికి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. రావలసిన సొమ్ము చేతికి అందుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీలు బాగా లాభిస్తాయి. ఉద్యోగంలో జీతభత్యాలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు లాభాల బాటపడతాయి. ఉద్యో గులు, నిరుద్యోగులకు విదేశీ అవకాశాలు లభిస్తాయి. సంపన్న కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురుతుంది. వృత్తి, ఉద్యోగాలరీత్యా విదేశాలకు వెళ్లడం జరుగుతుంది. సంతాన యోగం పడుతుంది.

2 / 6
కన్య: ఈ రాశికి ధన, భాగ్యాధిపతిగా అత్యంత శుభుడైన శుక్రుడు పంచమ స్థానంలో ప్రవేశించడం వల్ల లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. ఆకస్మిక ధన లాభానికి బాగా అవకాశం ఉంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీలు, లాటరీల వల్ల ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. సంతాన యోగం కలుగుతుంది. వృత్తి, వ్యాపారాలు నల్లేరు మీద బండిలా సాగిపోతాయి. పిత్రార్జితం లభిస్తుంది. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమవుతాయి. గృహ యోగం పడుతుంది.

3 / 6
తుల: రాశ్యధిపతి శుక్రుడు చతుర్థ స్థానంలోకి ప్రవేశిస్తున్నందువల్ల ఈ రాశివారికి ధన ధాన్య సమృద్ధి యోగంతో పాటు దిగ్బల రాజయోగం కూడా కలుగుతుంది. అనేక విధాలుగా సంపద వృద్ది చెందుతుంది. గృహ, వాహన యోగాలు కలిగే అవకాశం ఉంది. ఇంట్లో శుభ కార్యాలకు ప్లాన్ చేస్తారు. ఉన్నత కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురుతుంది. విదేశీయానానికి ఆటంకాలు తొలగిపోతాయి. ఉద్యోగంలో పదోన్నతి కలుగుతుంది. నిరుద్యోగులకు మంచి విదేశీ ఆఫర్లు అందుతాయి.

4 / 6
మకరం: ఈ రాశికి పంచమ, దశమాధిపతిగా అత్యంత శుభుడైన శుక్రుడు ఈ రాశిలో ప్రవేశించడం వల్ల రాజపూజ్యాలు, రాజ యోగాలు కలుగుతాయి. ఉద్యోగంలో అధికార యోగం పడుతుంది. మనసులోని కోరికలు చాలావరకు నెరవేరుతాయి. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో ప్రేమలో పడడానికి లేదా పెళ్లి నిశ్చయం కావడానికి అవకాశం ఉంది. సంతాన యోగ సూచనలున్నాయి. వృత్తి, ఉద్యోగాలరీత్యా ఇతర దేశాలకు ఎక్కువగా వెళ్లడం జరుగుతుంది. ఆరోగ్య లాభం కలుగుతుంది.

5 / 6
మీనం: ఈ రాశికి లాభ స్థానంలోకి శుక్రుడు ప్రవేశించడం వల్ల అనేక విధాలుగా ఆదాయం వృద్ది చెందే అవకాశం ఉంది. అదనపు ఆదాయ మార్గాలు రెట్టింపు ఫలితాలనిస్తాయి. ఉద్యోగంలో జీతభత్యాలు బాగా పెరగడంతో పాటు పదోన్నతి కలుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో రాబడి అంచనాలను మించుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లు బాగా లాభిస్తాయి. సంతాన యోగం కలుగుతుంది. నిరుద్యోగులకు మంచి అవకాశాలు లభిస్తాయి. మంచి కుటుంబంలో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది.

6 / 6