చలికాలంలో పెరుగు తినకూడదనేది అపోహ మాత్రమే. సరైన జాగ్రత్తలు పాటిస్తే పెరుగు శీతాకాలంలో ఆరోగ్యకరమేనని నిపుణులు చెబుతున్నారు. పెరుగులోని ప్రోబయోటిక్స్ జీర్ణశక్తిని పెంపొందిస్తాయి, కండరాలు, ఎముకలకు బలాన్నిస్తాయి. అయితే, చల్లని పెరుగుకు బదులుగా గది ఉష్ణోగ్రతలో ఉన్న పెరుగును పగటిపూట తీసుకోవడం మంచిది.