కోనసీమ జిల్లా ఇరుసుమండలో కొనసాగుతున్న బ్లో అవుట్ మంటలను అదుపులోకి తెచ్చేందుకు ఓఎన్జీసీ సిబ్బంది, ఏపీ ప్రభుత్వ అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. సోమవారం నుండి మంటల తీవ్రత తగ్గినప్పటికీ, పూర్తి నియంత్రణకు ఫైర్ ఫైటింగ్ కొనసాగుతోంది. ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక బృందం కూడా మంటలు ఆర్పే ప్రయత్నాల్లో నిమగ్నమై ఉంది.