AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కొడుకును మరిచిపోలేక అనారోగ్యంతో.. ICUలో స్టార్ డైరెక్టర్

కొడుకును మరిచిపోలేక అనారోగ్యంతో.. ICUలో స్టార్ డైరెక్టర్

Phani CH
|

Updated on: Jan 06, 2026 | 7:56 PM

Share

లెజెండరీ డైరెక్టర్ భారతీరాజా ఆరోగ్యంపై వస్తున్న పుకార్లను కుటుంబసభ్యులు, ఆసుపత్రి వైద్యులు ఖండించారు. భారతీరాజా ఆరోగ్యం నిలకడగా ఉందని, ఐసీయూలో చికిత్స పొందుతున్నప్పటికీ, ఆయన పరిస్థితి విషమంగా లేదని స్పష్టం చేశారు. తప్పుడు వార్తలను నమ్మవద్దని కోరారు. ఆయన కోలుకుంటున్నారని వైద్యులు తెలిపారు.

ఉన్న ఒక్కగానొన్న కొడుకు.. తన కళ్ల ముందే విగతజీవిగా కనిపిస్తే ఏ తండ్రీ తట్టుకోలేడు కదా..! కోలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ భారతీరాజా కూడా తన కొడుకు మరణాన్ని తీసుకోలేక పోయాడు. ఉన్నట్టుండి హార్ట్ అటాక్‌తో.. తన కొడుకు మనోహర్ రాజా తిరిగిరాని లోకాలకు వెళ్లడాన్ని తట్టుకోలేక.. ఆయన అంతిమ యాత్రలో వెక్కి వెక్కి ఏడ్చాడు. ఈ ఘటన సరిగ్గా మార్చి 23, 2025లో జరిగింది. ఇక ఆ తర్వాత ఆ ఇంట్లో ఉండలేక కొన్ని నెలలకు తన కూతురి దగ్గరకు, మలేషియాకు వెళ్లాడు. అయితే కొన్ని సినిమా కమిట్మెంట్స్ కారణంగా మళ్లీ చెన్నై వచ్చిన ఈయన అనారోగ్యాన్ని గురై ఆసుపత్రిలో చేరాడు. అప్పటి నుంచి ఈయనపై విపరీత వార్తలు వైరల్ అవుతున్నాయి. భారతీ రాజా ఆరోగ్యం ఉన్నట్టుండి విషమంగా మారిందని.. బ్రతకడం కష్టమనేలా రూమర్స్ తిరుగుతున్నాయి. దీంతో ఆయన కుంటుంబ సభ్యులు రియాక్టయ్యారు. ఓ ప్రకటన రిలీజ్ చేశారు. భారతీ రాజా ప్రస్తుత క్షేమంగా ఉన్నారని ఆయన కుటుంబ సభ్యులు ఒక ప్రకటన విడుదల చేశారు. ఆయన ఆరోగ్యం గురించి వైరల్ అవుతున్న వార్తలన్నీ అబద్దం అంటూ చెప్పారు. ఆ వార్తలను ఎవరూ నమ్మవద్దని కూడా రిక్వెస్ట్ చేశారు. భారతీ రాజా ఆరోగ్యం పై చెన్నై MGM హాస్పిటల్ వైద్యులు కూడా కుటుంబ సభ్యులతో పాటు ఓ నోట్ రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఆయనకు ఐసీయూలోనే చికిత్స అందిస్తున్నామని రివీల్ చేశారు. అయితే భారతీ రాజా ఆరోగ్యం నిలకడగానే ఉందని నోట్ లో రాసుకొచ్చారు. వైద్య నిపుణుల బృందం పర్యవేక్షణలో ఆయన చికిత్స పొందుతున్నారని పేర్కొన్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఏపీలో భారీగా సంక్రాంతి సెలవులు.. మొత్తం ఎన్ని రోజులంటే

Telangana: తెలంగాణలో మళ్లీ పెరగనున్న చలి తీవ్రత

గ్రామాల్లో ఇసుక లారీల దూకుడు ఆగమవుతున్న పల్లె జనం

బస్సు డ్రైవర్‌గా మదురో ప్రస్తానం.. పుట్టపర్తి సాయిబాబాకు వీరభక్తుడు

బాక్స్‌లో పెట్టిన బిడ్డను ఎత్తుకొని పారిపోయిన తల్లి.. కారణం ఇదే