AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వంటగదిలో ఈ తప్పులు చేస్తున్నారా.. అయితే మీకు పైసల కష్టాలు తప్పవు.. వెంటనే ఇలా చేస్తే..

హిందూ ధర్మశాస్త్రం ప్రకారం.. ఇల్లు కేవలం నివాసం మాత్రమే కాదు.. అది శక్తి నిలయం. ముఖ్యంగా ఇంట్లోని వంటగది అత్యంత పవిత్రమైన ప్రాంతం. కుటుంబ సభ్యుల ఆరోగ్యం, ఐశ్వర్యం, శ్రేయస్సుకు మూలమైన అన్నపూర్ణేశ్వరి దేవి కొలువయ్యే స్థానం ఇది. అయితే మనం తెలియకుండా చేసే కొన్ని చిన్న తప్పులు వంటగదిలో వాస్తు దోషాలను కలిగించి, తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు, కుటుంబ కలహాలకు దారితీస్తాయని వాస్తు నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Krishna S
|

Updated on: Jan 06, 2026 | 6:03 PM

Share
మురికి పాత్రలు: చాలామంది రాత్రి పూట భోజనం చేసిన తర్వాత పాత్రలను కడగకుండా సింక్‌లోనే వదిలేసి, ఉదయాన్నే శుభ్రం చేస్తుంటారు. వాస్తు ప్రకారం ఇది అత్యంత ప్రమాదకరం. రాత్రంతా ఉండే మురికి పాత్రలు ప్రతికూల శక్తిని పెంచుతాయి. ఇది లక్ష్మీదేవి రాకను అడ్డుకోవడమే కాకుండా, ఇంట్లో అనవసర ఖర్చులను పెంచుతుందని వాస్తు శాస్త్రం చెబుతోంది.

1 / 5
అగ్ని - నీరు: వంటగదిలో స్టవ్, సింక్ లేదా వాటర్ ట్యాప్ ఒకదానికొకటి చాలా దగ్గరగా లేదా ఒకే వరుసలో ఉండకూడదు. అగ్ని, నీరు విరుద్ధ అంశాలు కావడం వల్ల ఇవి దగ్గరగా ఉంటే దంపతుల మధ్య గొడవలు, అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.

2 / 5
మందులు-విరిగిన పాత్రలు: వంటగదిని కేవలం ఆహారానికి మాత్రమే పరిమితం చేయాలి. వంటగదిలో మెడికల్ కిట్‌లు లేదా మందులు ఉంచడం అశుభం. ఇది ఇంట్లోని వారు తరచూ అనారోగ్యం పాలయ్యేలా చేస్తుంది. పగిలిన పాత్రలు ఆర్థిక నష్టానికి, పేదరికానికి సంకేతం. వాటిని వెంటనే తొలగించాలి. స్టవ్ పైన లేదా వంటగదిలో అద్దం, దేవతల ఫోటోలు ఉంచడం వాస్తు విరుద్ధం.

3 / 5
శుభప్రదమైన దిశలు: వంట చేసేటప్పుడు ఎల్లప్పుడూ తూర్పు వైపు ముఖం ఉంచడం శ్రేయస్కరం. దక్షిణం వైపు తిరిగి వంట చేయడం వల్ల ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. వాస్తు ప్రకారం వంటగది ఆగ్నేయ మూలలో ఉండటం అత్యంత శుభప్రదం.  వంటగదిలోకి చెప్పులు ధరించి రావడం వల్ల ఆహార స్వచ్ఛత దెబ్బతింటుంది.

4 / 5
వంటగదిని ఎల్లప్పుడూ శుభ్రంగా, గాలి వెలుతురు వచ్చేలా ఉంచుకోవాలి. ప్రతిరోజూ సాయంత్రం వంటగదిలో ఒక చిన్న దీపం లేదా వెలుగు ఉండేలా చూసుకోవడం వల్ల ఇంట్లో సిరిసంపదలు వృద్ధి చెందుతాయని వాస్తు పండితులు సూచిస్తున్నారు.

5 / 5