ఒక టీ 65 వేలు, నీళ్ల బాటిల్ 50 వేలు.. ఆ రెస్టారెంట్ బిల్లుతో పట్టపగలే చుక్కలు
ఒక రెస్టారెంట్‌కి వెళ్లి భోజనం చేశాక లక్షల రూపాయల బిల్లు మీ చేతిలో పెడితే ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఒక్కసారి షాక్ అవడం ఖాయం. కానీ ఇలాంటి బిల్లులు ఆ రెస్టారెంట్‌లో ఎవ్రీ డే రోటీన్. ఆ రెస్టారెంట్‌లో లీటరున్నర నీళ్ల బాటిల్ కొనాలంటే అక్షరాల 50 వేలు చెల్లించాల్సిందే. తవా రోటీ ధర 30 వేలు, టీ ధర 65 వేలు.
ఆ రెస్టారెంట్‌కు కొత్తవారు ఎవరైనా వెళితే తొలుత గుడ్లు తేలేయడం ఖాయం. అయితే ఇక్కడో ట్విస్ట్ ఉంది. ఈ బిల్లు భారతీయ రెస్టారెంట్‌కు చెందినది కాదు. వియత్నాంలోని ఒక భారతీయ రెస్టారెంట్‌కు చెందినది. ధరలు భారతీయ రూపాయలలో కాకుండా వియత్నామీస్ కరెన్సీ ‘డాంగ్’లో చెల్లించాల్సి ఉంటుంది. ఒక వియత్నామీస్ డాంగ్ 0.0033 భారతీయ రూపాయలకు సమానం. అంటే మీరు ఒక రూపాయికి 300 డాంగ్‌లను పొందుతారు. ఏదైనా వియత్నామీస్ రెస్టారెంట్‌లో బిల్లు లక్షల ధరకు ఉండటానికి ఇదే కారణం. అందువల్ల, క్రింద చూపిన ‘తడ్కా ఇండియన్ రెస్టారెంట్ 2’ బిల్లు కేవలం ఇద్దరు వ్యక్తులకు 8,72,000 డాంగ్‌ల బిల్లు వేసింది. భారత రూపాయిలలో, దీని విలువ రూ. 3000. ఈ రెస్టారెంట్ వియత్నాంలోని హనోయ్ నగరంలో ఉంది. దాల్ తడ్కా ధర 1,15,000 డాంగ్, జీరా రైస్ ప్లేట్ ధర 77,000 డాంగ్. అయితే, దేశ కరెన్సీ మారకపు రేటు కారణంగా ఈ అధిక సంఖ్యా విలువలు సర్వసాధారణం. మరోవైపు, మార్చిలో డాలర్‌తో పోలిస్తే రూపాయి 2.5% బలమైన వృద్ధిని నమోదు చేసింది. శుక్రవారం, రూపాయి 32 పైసలు పెరిగింది. ఇటువంటి ధరలు చాలా మందికి ఆశ్చర్యకరంగా ఉన్నప్పటికీ, విదేశీ దేశాల కరెన్సీ ముఖ్యంగా వియత్నాం, ఇండోనేషియా వంటి దేశాల్లో భారత రూపాయి బలమేంటో తెలిసిపోతుంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:

వాటర్ కోసం ఫ్రిజ్ ఓపెన్ చేయగా.. లోపల సీన్ చూసి గుండె గుబేల్..

పామును బంధించేందుకు ప్రయత్నించిన స్నేక్ క్యాచర్‌కు ఝలక్..

వీర భక్తుడు అనుకునేరు.. అసలు విషయం వేరే..

ఊరందరికి స్నేహితుడిగా మారిన కొండముచ్చు.. వీడియో

జనావాసాల్లోకి సింహం.. కెన్యా పార్క్‌లో దారుణం.. వీడియో

గలీజుగా న్యూయార్క్ సబ్వే.? వీడియో

వాహనాలకు హారన్‌గా ఫ్లూట్, తబలా సంగీతం! వీడియో
