వర్షంలో తడుస్తున్న పిల్లిపిల్లకు.. కుక్కపిల్ల సాయం..
సాటి జీవుల పట్ల దయతో ఉండటం కేవలం మనుషుల్లోనే కాదు పశుపక్ష్యాదుల్లోనూ కనిపిస్తోంది. జాతి వైరాన్ని మరిచి జంతువులు కలిసిమెలిసి జీవిస్తూ మానవులకే స్పూర్తిగా నిలుస్తున్నాయి. అందుకు ఉదాహరణే ఈ వీడియో. వర్షంలో తడుస్తూ వణుకుతున్న ఓ చిన్ని పిల్లిపిల్లను మరో చిన్ని కుక్క ఆదరించిన విధానం చూసి నెటిజన్లు ముగ్ధులైపోతున్నారు.
దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు తమదైనశైలిలో కామెంట్లు చేస్తున్నారు. వైరల్ అవుతున్న ఈ వీడియో ప్రకారం.. ఆ ప్రాంతంలో జోరుగా వర్షం పడుతోంది. ఆ వర్షంలో ఎక్కడినుంచి వచ్చిందో ఓ చిన్ని పిల్లిపిల్ల ఎటు వెళ్లాలో తెలియక వర్షంలో తడుస్తూ ఉండిపోయింది. అది గమనించిన ఓ కుక్క.. పిల్లి పిల్ల దగ్గరకు వెళ్లి తనతోపాటు తీసుకొచ్చింది. ఆ శునకం ముందు నడుస్తుంటే ఆ చిన్ని పిల్లిపిల్ల దానిని అనుసరించింది. రెండూ శునకం యజమాని ఇంటికి వచ్చాయి. అక్కడ ఓ మెట్టు అడ్డు వచ్చింది. ముందు శునకం ఆ మెట్టు ఎక్కి, అలాగే తననుకూడా ఎక్కమని తనదైన హావభావాలతో పిల్లిపిల్లకు చెప్పింది. పిల్లిపిల్ల కుక్కను అనుసరించి మెట్టు ఎక్కేసింది. కాస్త ముందుకు వెళ్లాక మరో మెట్టు వచ్చింది. మొదటి పద్ధతినే అనుసరించమని పిల్లివైపు చూసింది శునకం. కానీ ఈసారి ఆ చిట్టి పిల్లి మెట్టు ఎక్కలేకపోయింది. ఆ ప్రయత్నంలో వెనక్కి పడిపోయింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బీపీని కంట్రోల్‌లో పెట్టే ఫుడ్స్ ఇవే! వెంటనే తినడం మొదలుపెట్టండి
భార్య రీల్స్ సరదా.. పాపం భర్త ఉద్యోగానికి ఎసరు
పిడకల యుద్ధం..! ఎన్నో ఏళ్ల వింత ఆచారం..
ఒక టీ 65 వేలు, నీళ్ల బాటిల్ 50 వేలు.. ఆ రెస్టారెంట్ బిల్లుతో పట్టపగలే చుక్కలు