AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2025: ఎన్ని మ్యాచులు పోయిన భయపడని కాటేరమ్మ కొడుకులు.. అస్సల్ తగ్గేదే లే అంటోన్న హెడ్ కోచ్!

IPL 2025లో SRH వరుసగా నాలుగు మ్యాచుల్లో పరాజయాన్ని చవిచూసినా, కోచ్ డానియల్ వెటోరి జట్టు ఆటశైలిలో మార్పులు ఉండవని స్పష్టం చేశారు. బలహీనతలే కాకుండా, పరిస్థితులను అర్థం చేసుకొని గేమ్ ప్లాన్‌ను అమలు చేయడం అవసరమని చెప్పారు. కెప్టెన్ కమిన్స్‌తో కలిసి, ఈ ఒత్తిడిని అధిగమిస్తామని నమ్మకంగా చెప్పారు. జట్టులో సానుకూలత కొనసాగుతోందని చెప్పారు, ఇది అభిమానులకు ఊరట కలిగిస్తోంది.

IPL 2025: ఎన్ని మ్యాచులు పోయిన భయపడని కాటేరమ్మ కొడుకులు.. అస్సల్ తగ్గేదే లే అంటోన్న హెడ్ కోచ్!
Srh Batting Line Up
Narsimha
| Edited By: |

Updated on: Apr 08, 2025 | 4:43 PM

Share

ఐపీఎల్ 2025 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) వరుసగా నాలుగు పరాజయాలను ఎదుర్కొన్నప్పటికీ, జట్టు హెడ్ కోచ్ డానియల్ వెటోరి దూకుడైన బ్యాటింగ్‌ శైలిపై మాత్రం ఎలాంటి మార్పులు చేయబోమని తేల్చి చెప్పారు. వరుస ఓటములతో జట్టు స్పూర్తి తగ్గిపోతుందా అన్న అనుమానాలను కొట్టిపారేస్తూ, త్వరలోనే తిరిగి ఫామ్‌ పుంజుకుంటామన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఆదివారం ఉప్పల్ మైదానంలో గుజరాత్ టైటాన్స్ (GT)తో జరిగిన మ్యాచ్‌లో SRH ఏడువికెట్ల తేడాతో ఓడిపోవడంతో జట్టు తీవ్ర నిరాశలో మునిగింది.

ఈ మ్యాచ్‌తో కలిపి SRH సీజన్‌లో ఇది నాలుగో పరాజయం కావడం గమనార్హం. గతంలో రాజస్థాన్ రాయల్స్‌పై 286 పరుగుల భారీ స్కోరు చేసి విజయభేరి మోగించిన SRH, ఆ తర్వాత వరుసగా లక్నో సూపర్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓటమిని చవిచూసింది. బ్యాటింగ్‌లో ఒత్తిడి తట్టుకోలేకపోవడం, బౌలింగ్‌లో ఆత్మవిశ్వాసం లేకపోవడం కారణంగా జట్టు దారుణంగా తడబడుతోందని విశ్లేషకులు చెబుతున్నారు.

కానీ ఈ స్థితిలో కూడా SRH కోచ్ డానియల్ వెటోరి ధైర్యంగా స్పందిస్తూ, తమ ఆట శైలిలో ఎలాంటి మార్పు ఉండబోదని చెప్పారు. “మా బ్యాటింగ్ అప్రోచ్‌ను మార్చాల్సిన అవసరం లేదు. కానీ పిచ్ పరిస్థితులను సరైన రీతిలో అర్థం చేసుకోవాలి. ప్రత్యర్థి బౌలర్లను గౌరవించి, వారి వ్యూహాలకు సరిపడే ప్రణాళికలు రూపొందించాలి,” అని వెటోరి మీడియాతో మాట్లాడుతూ తెలిపారు. టాప్-3 బ్యాటర్ల కోసం ప్లాన్‌లు చేసినా, వాటిని అమలు చేయడంలో వారు విఫలమయ్యారని కూడా వ్యాఖ్యానించారు.

అలాగే, కెప్టెన్ ప్యాట్ కమిన్స్ లేదా తానే అయినా ఈ వరుస పరాజయాల వల్ల భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. “మా కెరీర్‌లో ఎప్పుడూ భయపడలేదు. ఇప్పుడూ భయపడబోము. అయినప్పటికీ వరుసగా నాలుగు మ్యాచ్‌లు ఓడిపోవడం తప్పు అని మేము అంగీకరిస్తున్నాం. ఈ ఓటములు మా లక్ష్యాలకు దెబ్బతీయవచ్చు,” అని చెప్పారు.

గతేడాది SRH రన్నరప్‌గా నిలిచిన తర్వాత, ఈ సీజన్‌లో భారీ అంచనాలతో బరిలోకి దిగింది. మొదటి మ్యాచ్‌లో శక్తివంతంగా ఆడి అభిమానుల్లో విశ్వాసం నింపిన జట్టు, వరుస పరాజయాలతో ఇప్పుడు ఒత్తిడిలో పడింది. కానీ వెటోరి మాత్రం తిరిగి గెలుపు బాట పట్టే విశ్వాసాన్ని చూపిస్తూ, జట్టులో సానుకూల వైఖరిని నిలుపుతున్నారు. ఇది SRH అభిమానులకు కొంత ఊరట కలిగించే అంశం.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..