IPL 2025 Playoff Scenario: ప్లే ఆఫ్స్‌కు దూరంగా 3 జట్లు.. 2వ వారంలోనే చేతులెత్తేశారుగా.. లిస్ట్‌లో డేంజరస్ టీం
3 Teams Playoff Chances in Danger in IPL 2025: ఐపీఎల్ 2025లో రెండు వారాలు పూర్తయ్యాయి. ముఖ్యంగా కొన్ని జట్ల పరిస్థితి మాత్రం ధీనంగా తయారైంది. ఇందులో ముఖ్యంగా గత ఐపీఎల్ ఛాంపియన్ టీంలు మూడు ఉండడం గమనార్హం.

3 Teams Playoff Chances in Danger: ఐపీఎల్ 2025 లో ఇప్పటివరకు రెండు వారాలు గడిచాయి. ఈ రెండు వారాల్లో చాలా గొప్ప మ్యాచ్‌లు ఫ్యాన్స్ చూశారు. కొన్ని జట్లు బాగా ఆడగా, కొన్ని జట్లు మాత్రం నిరాశపరిచాయి. ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటాన్స్ వంటి జట్లు ఇప్పటివరకు అద్భుతమైన ప్రదర్శన కనబరిచాయి. ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోని ఏకైక జట్టు ఢిల్లీ క్యాపిటల్స్. ఈ కారణంగా ఆ జట్టు ప్లేఆఫ్స్‌కు చేరుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే, కొన్ని జట్ల మార్గం ఇప్పుడు కష్టంగా అనిపిస్తోంది. ఇందులో లీగ్ చరిత్రలో అత్యంత విజయవంతమైన జట్టు కూడా ఉంది.
ఐపీఎల్ 2025 తర్వాత ప్లేఆఫ్స్‌కు దూరమయ్యే ప్రమాదంలో ఉన్న మూడు జట్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
3. ముంబై ఇండియన్స్..
టోర్నమెంట్‌లో ముంబై ఇండియన్స్ ప్రదర్శన ఇప్పటివరకు చెప్పుకోదగిన విధంగా లేదు. 4 మ్యాచ్‌లు ఆడిం ఒక మ్యాచ్‌లో మాత్రమే గెలిచింది. ముంబై ఇండియన్స్ రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఇప్పుడు ముంబై జట్టు పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో ఉంది. ముంబై ఇండియన్స్ మరికొన్ని మ్యాచ్‌ల్లో ఓడిపోతే ప్లేఆఫ్స్ నుంచి నిష్క్రమించే ప్రమాదం ఉంది.
2. చెన్నై సూపర్ కింగ్స్..
ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ప్లేఆఫ్స్‌కు వెళ్లే మార్గం చాలా కష్టంగా మారింది. ముంబై ఇండియన్స్ లాగే ఇప్పటివరకు ఒకే ఒక మ్యాచ్‌లో గెలిచింది. మూడు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. చెన్నై సూపర్ కింగ్స్ ప్రస్తుతం కేవలం 2 పాయింట్లతో పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో ఉంది. చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లు లేదా బ్యాట్స్‌మెన్స్ అంతగా రాణించడం లేదు. దీని కారణంగా చెన్నై పరిస్థితి చాలా దారుణంగా ఉంది.
1.సన్‌రైజర్స్ హైదరాబాద్..
గత సీజన్‌లో ఫైనలిస్ట్ జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేఆఫ్స్ నుంచి నిష్క్రమించే ప్రమాదాన్ని ఎదుర్కొంటోంది. సన్‌రైజర్స్ తొలి మ్యాచ్‌లోనే 286 పరుగులు చేసి సీజన్‌ను ఘనంగా ప్రారంభించింది. అయితే, అప్పటి నుంచి జట్టు బ్యాటింగ్ నిరంతరం విఫలమవుతూనే ఉంది. హైదరాబాద్ జట్టు వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో ఓడి పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉంది.
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..