బిగ్ అలెర్ట్.. ఏపీ ఇంటర్ ఫలితాలు.. ఈసారి వాట్సాప్‌కే !
ఏపీలో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల ఫలితాలను విడుదల చేసేందుకు విద్యాశాఖ సన్నద్దమవుతోంది. ఏప్రిల్ 12 నుంచి 15 మధ్య విడుదల చేసేందుకు విద్యాశాఖ అధికారులు సిద్ధమవుతున్నారు. పరీక్ష ఫలితాల ప్రక్రియను వేగవంతం చేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఏప్రిల్ 6 నాటికి మూల్యాంకన ప్రక్రియ పూర్తవుతుందని అంచనా వేస్తున్నారు.
ఆ తర్వాత కంప్యూటరీకరణ జరగాల్సి ఉంటుంది. దీని కోసం సుమారు ఐదు లేదా ఆరు రోజులు పడుతుందని అధికారులు చెబుతున్నారు. ఈసారి ఫలితాలను కొత్త విధానంలో విడుదల చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే ఆన్లైన్ విధానంలో ఫలితాలను ప్రకటించడం సాధారణంగా జరుగుతోంది. అయితే, ఈసారి మరింత సులభతరం చేసేందుకు వాట్సాప్ ద్వారా ఫలితాలను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం ప్రతి విద్యార్థి మార్కులను పీడీఎఫ్ (PDF) రూపంలో తయారు చేసి, వాట్సాప్ ద్వారా పంపనున్నారు. ఈ పీడీఎఫ్ డాక్యుమెంట్లు షార్ట్ మెమోలుగా ఉపయోగపడతాయి. గతంలో ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచిన తర్వాత షార్ట్ మెమోలను వేరుగా విడుదల చేసేవారు. కానీ, ఈసారి ఫలితాల ప్రకటనే వాట్సాప్ ద్వారా జరుగుతుండటంతో, విద్యార్థులకు తక్షణ ఫలితాలు అందే విధంగా ప్రతిదీ పీడీఎఫ్ రూపంలో అందించనున్నారు. ఈ కొత్త విధానం విద్యార్థులకు, తల్లిదండ్రులకు మరింత సౌకర్యంగా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఓర్నీ.. మనుషులు కూడా ఇంత బుద్ధిగా తినరుగా
ఎండ మండిపోతోందని కూల్‌డ్రింక్స్ తెగ తాగేస్తున్నారా.. జాగ్రత్త!
వర్షంలో తడుస్తున్న పిల్లిపిల్లకు.. కుక్కపిల్ల సాయం..
బీపీని కంట్రోల్‌లో పెట్టే ఫుడ్స్ ఇవే! వెంటనే తినడం మొదలుపెట్టండి
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

