12 March 2025
Pic credit-Pexel
TV9 Telugu
లండన్ నివాసి అయిన 22 ఏళ్ల లారా తన కన్యత్వాన్ని ఆన్‌లైన్ వేలం ద్వారా అమ్మాలని నిర్ణయించుకుంది. ఈ వేలంలో హాలీవుడ్ స్టార్ ఆమె కన్యత్వాన్ని ఏకంగా రూ. 18 కోట్లకు కొనుగోలు చేశాడు.
లారా తన నిర్ణయాన్ని సమర్థించుకుంటుంది. తన నిర్ణయంలో తప్పు లేదని.. ఇది సాధారణమేనని చెబుతుంది. చాలా మంది అమ్మాయిలు ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నారని.. వారికి ఈ విధంగా ఆర్థిక సహాయం లభిస్తే, అందులో తప్పేముందని ప్రశ్నిస్తోంది.
నివేదికల ప్రకారం కన్యత్వాన్ని వేలం వేసే ఈ మొత్తం ప్రక్రియ చాలా గోప్యంగా సాగింది. ఎలాంటి వివాదం తలెత్తకుండా ఉండటానికి వేలంలో పాల్గొన్న వ్యక్తులకు సంబంధించిన సమాచారాన్ని గోప్యంగా ఉంచారు.
ఈ విషయంపై సమాజంలో చర్చ మొదలైంది. కొంతమంది దీనిని మహిళా సాధికారత అని అంటే చాలా మంది దీనిని నైతికంగా తప్పు అని అంటున్నారు. ఇది మహిళల గౌరవానికి విరుద్ధమని చాలా సంస్థలు చెబుతున్నాయి.
తన కన్యత్వాన్ని అమ్ముకున్న తర్వాత, లారా ఇప్పుడు తన భవిష్యత్తును భద్రంచూసే షుగర్ డాడీ కోసం చూస్తున్నానని చెప్పింది. తనకు ఆర్థిక స్థిరత్వాన్ని ఇవ్వగల వ్యక్తితో కలిసి జీవించాలనుకుంటున్నానని ఆమె చెప్పింది.
చట్టబద్ధంగా సాగే ఇలాంటి వేలంపాటలను అనేక దేశాలలో వ్యభిచారంగా వ్యవహరిస్తారు. అయితే లండన్‌లో ఈ విషయంపై స్పష్టమైన నియమాలు లేవు. అయితే ఈ విషయంపై ప్రభుత్వం నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు
ఈ విషయంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కొంతమంది ఆ అమ్మాయి నిర్ణయాన్ని శరీర స్వయంప్రతిపత్తి అని పిలుస్తూ మద్దతు ఇస్తున్నారు.. చాలా మంది దీనిని మహిళల శ్రేయస్సు కంటే దోపిడీగా భావిస్తున్నారు.