Queen Elizabeth 2: ఆకాశంలో మేఘంలా అవతరించిన క్వీన్ ఎలిజబెత్.. యూకేను మొత్తం ఆవహించింది.. ఆ చిత్రం చూడాల్సిందే..
వైరల్ అవుతున్న ఈ ఫోటోపై లీన్నే వివరిస్తూ..తన కుమార్తె లేసీ తొలుత ఈ మేఘ సందేశాన్ని చూసినట్టుగా చెప్పింది. తన కళ్లను తానే నమ్మలేక తన కూతురు “ఓ మై గాడ్” అంటూ పెద్ద పెద్దగా కేకలు వేసింది. అప్పడు తాము..
Queen Elizabeth 2: బ్రిటన్ రాణి ఎలిజబెత్ 2 (96) తుదిశ్వాస విడిచారు. వృద్ధాప్యం, తీవ్ర అనారోగ్యానికి గురై రాణి ఎలిజబెత్ 2 కన్నుమూసినట్లు వైద్యులు నిర్ధారించారు. గత ఏడాది అక్టోబర్ నుంచే ఆరోగ్య సమస్యలు వేధిస్తున్నాయి. నడవడం, నిలబడడం కూడా ఇబ్బందిగా మారింది. దీంతో అప్పటినుంచి స్కాట్లాండ్‌లోని బాల్మోరల్ క్యాజిల్‌లోనే ఆమె ఉంటున్నారు. చివరికి అనారోగ్యంతోనే కన్నుమూశారు. ఈ విషయాన్ని బకింగ్‌హమ్ ప్యాలెస్ వెల్లడించింది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు, సహా యావత్ ఇంగ్లాండ్ శోకసంద్రంలో మునిగిపోయింది. అయితే, క్వీన్ మరణవార్త ప్రకటించిన కొన్ని గంటల తర్వాత ఇంగ్లాండ్‌లో ఒక అద్భుతం జరిగింది. అక్కడ ఆకాశంలో క్వీన్ ఎలిజబెత్ II రాణిని పోలిన మేఘం ఏర్పడింది. ఆ ఫోటోను ఒక బ్రిటిష్ మహిళ షేర్ చేశారు. ఇంగ్లండ్‌లోని వెస్ట్ మిడ్‌లాండ్స్‌లోని టెల్‌ఫోర్డ్‌లో నివసిస్తున్న లీన్నే బెథెల్, రాణి ముఖాన్ని పోలి ఉన్న మేఘం ఫోటోను ఫేస్‌బుక్‌లో షేర్ చేయటంతో ఇప్పుడది నెట్టింట హల్‌చల్ చేస్తోంది.
వైరల్ అవుతున్న ఈ ఫోటోపై లీన్నే వివరిస్తూ..తన కుమార్తె లేసీ తొలుత ఈ మేఘ సందేశాన్ని చూసినట్టుగా చెప్పింది. తన కళ్లను తానే నమ్మలేక తన కూతురు “ఓ మై గాడ్” అంటూ పెద్ద పెద్దగా కేకలు వేసింది. అప్పడు తాము డ్రైవింగ్‌లో ఉన్నామని, తన 11 ఏళ్ల కుమార్తె అరుస్తూ చెప్పిన మాటలతో వారంతా ఆకాశం వైపు చూడగా, అద్భుత దృశ్యం వారి కంటపడిందని చెప్పారు. ఆకాశంలో ఏర్పాటైన ఆ మేఘం..అచ్చం క్వీన్ ఎలిజబెత్ రాణిని పోలి ఉందని వారు గ్రహించారు. రాణి మరణం తర్వాత జరిగిన ఆసక్తికరమైన విషయం ఇదొక్కటే కాదు..రాణి ఇక లేరని రాజకుటుంబం ధృవీకరించిన తర్వాత బకింగ్‌హామ్ ప్యాలెస్‌పై డబుల్ రెయిన్‌బో కూడా కనిపించింది.
ఈ చిత్రం గురువారం సాయంత్రం షేర్ చేసిన కొద్ది గంటల్లోనే వైరల్‌గా మారింది. వార్త రాసే సమయానికి పోస్ట్ 20,000 కంటే ఎక్కువ లైక్‌లు, రి ట్వీట్లు, కామెంట్లు 9600 పొందింది.33,000 కంటే ఎక్కువ షేర్‌లను రికార్డ్ చేసింది. గురువారం సాయంత్రం GMT 6.30 గంటలకు స్కాట్లాండ్‌లోని బల్మోరల్ కాజిల్‌లో రాణి “శాంతియుతంగా” మరణించినట్లు రాజకుటుంబం ధృవీకరించింది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి