Viral News: వీడెక్కడి తింగరి దొంగరా నాయనా.. విలువైంది అనుకుని ఎందుకూ పనికిరాంది ఎత్తుకపాయె..
బ్యాంక్ సిబ్బంది ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగారు. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్‌తో బ్యాంకు బ్రాంచ్‌కు వెళ్లి ఆధారాలు సేకరించారు. సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించి దొంగను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు.
Viral News: హర్యానాలోని గురుగ్రామ్ జిల్లాలో ఒక ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఇంటర్‌నెట్ రూటర్‌తో ఓ దొంగ బ్యాంకు సేవలను పూర్తిగా దెబ్బతీశాడు. సీసీటీవీ కెమెరాల బ్యాంక్ డిజిటల్ వీడియో రికార్డర్‌గా భావించిన ఆ దొంగ రూటర్‌ని ఎత్తుకెళ్లాడు..ఎస్‌బీఐ నర్సింగ్‌పూర్ బ్రాంచ్‌లో మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ మేరకు బ్యాంకు అధికారులు తెలిపారు. మంగళవారం తెల్లవారుజామున 3.25 గంటల ప్రాంతంలో బ్యాంకును ఢీకొట్టిన దొంగ బ్యాంకులో నగదు కోసం వెతికినా ఫలితం లేకుండా పోయింది. దాంతో దొరికిన ఏదో వస్తువును పట్టుకుని ఊడాయించాడు. పూర్తి వివరాల్లోకి వెళితే..
నర్సింగ్‌పూర్ ఎస్‌బీఐ బ్యాంకు శాఖలోకి మంగళవారం తెల్లవారుజామున ఒక దొంగ చొరబడ్డాడు. బ్యాంకు లాకర్‌ను బద్ధలుకొట్టి డబ్బు, బంగారం చోరీకి ప్రయత్నించాడు. అయితే లాకర్ తెరుచుకోకపోవడంతో చోరీ ప్రయత్నాన్ని విరమించుకున్నాడు. ఆ బ్యాంకు శాఖలో సీసీటీవీ కెమెరాలున్నాయి. దీంతో తనను గుర్తించకుండా ఉండేందుకు డిజిటల్ రికార్డర్‌గా భావించి అక్కడే ఉన్న ఇంటర్నెట్ రూటర్‌ను ఎత్తుకెళ్లాడు. ఇక ఆ మర్నాడు యధావిధిగా డ్యూటీకి వచ్చిన సిబ్బంది, బ్యాంకులో దొంగలు పడ్డారని గుర్తించారు. లాకర్‌ను బద్ధలు కొట్టి తెరిచేందుకు ప్రయత్నించి విఫలమైనట్లు తెలుసుకున్నారు. బ్యాంకుకు చెందిన కొన్ని తాళాలతోపాటు రూటర్‌ను ఎత్తుకెళ్లినట్లు గ్రహించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
బ్యాంక్ సిబ్బంది ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగారు. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్‌తో బ్యాంకు బ్రాంచ్‌కు వెళ్లి ఆధారాలు సేకరించారు. సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించి దొంగను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి