AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nupur Sharma: నుపుర్ శర్మకు సుప్రీం కోర్టులో ఊరట.. ఆ పిటిషన్ ను విచారించలేమన్న దేశ అత్యున్నత న్యాయస్థానం

మహమ్మద్ ప్రవక్తపై షాకింగ్ కామెంట్స్ చేసి, బీజేపీ (BJP) నుంచి సస్పెండ్ అయిన పార్టీ లీడర్ నూపుర్‌ శర్మకు సుప్రీం కోర్టులో మళ్లీ ఊరట లభించింది. ఆమెను అరెస్ట్‌ చేసేందుకు ఆదేశాలు ఇవ్వాలంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీం..

Nupur Sharma: నుపుర్ శర్మకు సుప్రీం కోర్టులో ఊరట.. ఆ పిటిషన్ ను విచారించలేమన్న దేశ అత్యున్నత న్యాయస్థానం
Nupur Sharma
Ganesh Mudavath
|

Updated on: Sep 09, 2022 | 8:13 PM

Share

మహమ్మద్ ప్రవక్తపై షాకింగ్ కామెంట్స్ చేసి, బీజేపీ (BJP) నుంచి సస్పెండ్ అయిన పార్టీ లీడర్ నూపుర్‌ శర్మకు సుప్రీం కోర్టులో మళ్లీ ఊరట లభించింది. ఆమెను అరెస్ట్‌ చేసేందుకు ఆదేశాలు ఇవ్వాలంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీం కోర్టు విచారణకు నిరాకరించింది. ఈ వ్యాజ్యాన్ని స్వీకరించలేమంటూ ఇంటెస్టింగ్ కామెంట్స్ చేసింది. ప్రవక్తపై వ్యాఖ్యలతో ఆమె ముస్లిం వర్గాల మనోభావాలను దెబ్బ తీశారని పిటిషన్ లో పేర్కొన్నారు. ఆమెపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని పట్టుబట్టారు. అందుకు గానూ అధికారులను ఆదేశించాలని వ్యాజ్యంలో జత చేశారు. ఈ వ్యాజ్యాన్ని విచారించాలంటూ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టును ఆశ్రయించారు. అయితే ఈ పిటిషన్‌ను పరిశీలించిన సుప్రీం విచారణకు (Supreme Court) స్వీకరించే క్రమంలో ఆదేశాలు జారీ చేసేప్పుడు న్యాయస్థానాలు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని, కాబట్టి ఈ పిటిషన్‌ను వెనక్కి తీసుకోవడమే మంచిదనే అభిప్రాయం వ్యక్తం చేసింది. దీంతో పిటిషనర్‌ పిల్ ను వెనక్కు తీసుకున్నారు. నుపూర్‌ శర్మపై సుప్రీంకోర్టు గతంలో తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉదయ్‌పూర్‌ ఘటనకు నుపూర్‌ వ్యాఖ్యలే కారణమని అభిప్రాయపడింది. మీడియా ద్వారా దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఆదేశించింది. ఆమె లాయర్‌ అని చెప్పుకోవడం సిగ్గుచేటని సుప్రీంకోర్టు ఘాటుగా స్పందించింది.

కాగా.. గతంలో చేపట్టిన విచారణలో బీజేపీ బహిష్కృత నేత నూపుర్‌ శర్మకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. నూపుర్‌ శర్మపై 8 రాష్ట్రాల్లో 9 కేసులు నమోదయ్యాయి. తన అరెస్ట్‌ను ఆపాలంటూ నుపుర్‌ శర్మ సుప్రీం కోర్టులో వ్యాజ్యం వేశారు. తనపై నమోదైన అన్ని కేసులనూ ఢిల్లీకి బదిలీ చేయాలని ఆమె కోరారు. ఈ పిటిషన్‌పై జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ పార్ధీవాలా బెంచ్‌ విచారణ జరిపింది. రు. ఆమెపై నమోదైన పలు కేసుల్లో ఎలాంటి తక్షణ చర్యలు తీసుకోవద్దంటూ సర్వోన్నత న్యాయస్థానం ఈ సందర్భంగా పేర్కొంది. ఈ కేసులో విచారమకు తమ ముందు హాజరు కావాలని కోల్‌కతా పోలీసులు లుకౌట్‌ నోటీసులు ఇచ్చారు. అయితే తనకు ప్రాణహాని ఉందని, విచారణకు రాలేనని ఆమె చెప్పారు.

ఓ టీవీ ఛానల్‌లో డిబేట్ సందర్భంగా నుపూర్‌ శర్మ చేసిన కామెంట్స్ దేశంలోనే కాకుండా అంతర్జాతీయంగా తీవ్ర వివాదానికి కారణమైంది. ఆమె వ్యాఖ్యలను బీజేపీ తీవ్రంగా పరిగణించింది. పార్టీ నుంచి ఆమెను సస్పెండ్‌ చేసింది. ఈ వ్యాఖ్యలపై దేశంలో పలు చోట్ల హింసాత్మక ఘటనలు సైతం జరిగాయి. ఈ కేసుపై జులై 1వ తేదీన విచారించిన సుప్రీంకోర్టు నుపుర్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆమె నోటి దురుసు దేశాన్ని మంటల్లోకి నెట్టిందని, ప్రస్తుతం వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న దురదృష్టకర సంఘటనలకు ఆమే బాధ్యురాలంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ పరిస్థితుల్లో ఆమె పై చర్యలు తీసుకోవాలంటూ సుప్రీంలో దాఖలైన పిటిషన్ ను విచారించేందుకు ధర్మాసనం నిరాకరించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం