SCR: రైల్వే ప్రయాణీకులకు అలర్ట్.. ఆ నగరాలకు వెళ్లే రైళ్లు రద్దు.. పూర్తి వివరాలివే..

రైల్వే ప్రయాణీకులకు దక్షిణ మధ్య రైల్వే కీలక అలర్ట్ జారీ చేసింది. వివిధ పనుల కారణంగా పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. కాకినాడ, విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, రేపల్లె, తెనాలి, గూడూరు, మధిర నగరాల..

SCR: రైల్వే ప్రయాణీకులకు అలర్ట్.. ఆ నగరాలకు వెళ్లే రైళ్లు రద్దు.. పూర్తి వివరాలివే..
Trains
Follow us
Ganesh Mudavath

|

Updated on: Sep 09, 2022 | 4:25 PM

రైల్వే ప్రయాణీకులకు దక్షిణ మధ్య రైల్వే కీలక అలర్ట్ జారీ చేసింది. వివిధ పనుల కారణంగా పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. కాకినాడ, విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, రేపల్లె, తెనాలి, గూడూరు, మధిర నగరాల మధ్య నడిచే రైళ్లను రద్దు చేసింది. ఈ నెల 10, 11, 12 తేదీల్లో ఈ విధానం అమలులో ఉంటుందని తెలిపింది. ఈ మార్పును ప్రయాణీకులు గమనించాలని, ప్రత్యమ్నాయ మార్గాలు చూసుకోవాలని సూచించింది. విజయవాడ – గూడూరు మధ్య నడిచే 07500, గూడూరు – విజయవాడ మధ్య రాకపోకలు సాగించే 07458, సికింద్రాబాద్ – మధిర 17202, మధిర – సికింద్రాబాద్ 17201 రైళ్లను 11, 12 తేదీల్లో రద్దు చేశారు. ప్రయాణీకులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది.

కాకినాడ పోర్ట్ – విశాఖపట్నం మధ్య నడిచే 17267 రైలు 10, 11 తేదీల్లో.., విశాఖపట్నం – కాకినాడ పోర్ట్ మధ్య రాకపోకలు సాగించే 17268 రైలు 10, 11 తేదీల్లో.., 17258 కాకినాడ పోర్ట్ – విజయవాడ రైలు 10, 11 తేదీల్లో, విజయవాడ – కాకినాడ పోర్ట్ 17257 రైలు కూడా 10, 11 తేదీల్లో రద్దైంది. 07628 విజయవాడ – గుంటూరు రైలు, గుంటూరు – రేపల్లె 07786 రైలు, రేపల్లె – తెనాలి 07873, తెనాలి – గుంటూరు 07282, గుంటూరు – విజయవాడ 07864, విజయవాడ – గుంటూరు 07464, గుంటూరు – విజయవాడ 07465 రైళ్లు కూడా 10, 11 తేదీల్లో రద్దయ్యాయి.

Trains Cancellation

Trains Cancellation

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి