AP Weather Alert: ఏపీ వాసులకు అలెర్ట్.. బంగాళాఖాతంలో అల్పపీడనం.. 36 గంటల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం

వాయువ్య బంగాళాఖాతం దగ్గర లోని ఉత్తర ఆంధ్ర ప్రదేశ్ దక్షిణ ఒడిశా తీరం మీద ఉన్న అల్పపీడన ప్రాంతం వరకు ఉత్తర అంతర్భాగ కర్ణాటక, దక్షిణ తెలంగాణ మీదుగా వెళ్తుందని .. ఇది సగటు సముద్ర మట్టానికి సగటున 1.5 కి.మీ ఎత్తు వ్యాపించి ఉందని వెల్లడించింది. దీంతో ఆంధ్రప్రదేశ్ లో రానున్న మూడు రోజులకు వాతావరణ సూచనలు చేసింది వాతావరణ శాఖ.. 

AP Weather Alert: ఏపీ వాసులకు అలెర్ట్.. బంగాళాఖాతంలో అల్పపీడనం.. 36 గంటల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం
Andhra Rains
Follow us

|

Updated on: Sep 09, 2022 | 3:36 PM

AP Weather Alert: గురువారం పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా ఉన్న అల్పపీడన ప్రాంతం ఇప్పుడు పశ్చిమ మధ్య..  ఆనుకుని వాయువ్య బంగాళాఖాతం దగ్గర ఉన్న ఉత్తర ఆంధ్ర ప్రదేశ్, ఒడిశా తీరం మీద ఉంది . ఇది మధ్య ట్రోపోస్పిరిక్ స్థాయిల వరకు విస్తరించి ఉన్న ఉపరితల ఆవర్తనం తో అనుబంధంగా కొనసాగుతోంది. ఈ అల్పపీడనం రానున్న 36 గంటల్లో దక్షిణ ఒడిషా- ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరానికి దగ్గర ఉన్న వాయువ్య దిశగా ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీద మరింత బలపడే అవకాశం ఎక్కుగా ఉందని భారత వాతావరణ శాఖ పేర్కొంది. దీంతో సగటు సముద్ర మట్టం వద్ద ఉన్న రుతుపవన ద్రోణి ఇప్పుడు జైసల్మేర్, ఉదయపూర్, జల్గావ్, రామగుండం  అక్కడ నుండి తూర్పు ఆగ్నేయ దిశగా పశ్చిమ మధ్య నుంచి \ దానిని ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతం మీద ఉన్న అల్పపీడన ప్రాంతం గుండా వెళ్తుందని తెలిపింది. అంతేకాదు బంగాళాఖాతంలో ఏర్పడిన  ద్రోణి ఇప్పుడు దక్షిణ కొంకణ్ నుండి పశ్చిమ మధ్య,  ప్రక్కనే ఉన్న వాయువ్య బంగాళాఖాతం దగ్గర లోని ఉత్తర ఆంధ్ర ప్రదేశ్ దక్షిణ ఒడిశా తీరం మీద ఉన్న అల్పపీడన ప్రాంతం వరకు ఉత్తర అంతర్భాగ కర్ణాటక, దక్షిణ తెలంగాణ మీదుగా వెళ్తుందని .. ఇది సగటు సముద్ర మట్టానికి సగటున 1.5 కి.మీ ఎత్తు వ్యాపించి ఉందని వెల్లడించింది. దీంతో ఆంధ్రప్రదేశ్ లో రానున్న మూడు రోజులకు వాతావరణ సూచనలు చేసింది వాతావరణ శాఖ..

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం: ఈరోజు, రేపు, ఎల్లుండి(సెప్టెంబర్ 11వ తేదీ) కొన్ని ప్రాంతాల్లో తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశముంది. భారీ నుండి అతి భారీ వర్షాల తోపాటు అత్యంత భారీ వర్షాలు విశాఖపట్నం , తూర్పు గోదావరి జిల్లా లలో ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ నుండి అతి భారీ వర్షాలు శ్రీకాకుళం ,వి జియనగరం, పశ్చిమ గోదావరి జిల్లా లలో ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది.  ఈదురు గాలులు (గంటకు 30 -40 కి మీ వేగం తో)వీచే అవకాశం ఉంది.

దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్: ఈరోజు, రేపు, ఎల్లుండి(సెప్టెంబర్ 11వ తేదీ) తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు చాల చోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు కృష్ణా ,గుంటూరు జిల్లా లో ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది.

ఇవి కూడా చదవండి

రాయలసీమ : ఈరోజు, రేపు, ఎల్లుండి(సెప్టెంబర్ 11వ తేదీ) తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు చిత్తూరు జిల్లా లో ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles