Kodali Nani: “వచ్చే ఎన్నికల్లో తండ్రీకొడుకులు ఇంటికే పరిమితం.. 3 రాజధానుల పక్కా”

ఎట్టి పరిస్థితుల్లో పరిపాలన రాజధాని వైజాగ్ తీసుకెళ్తాం..దీన్ని ఆపగలిగే శక్తి ఎవరికీ లేదని స్పష్టం చేశారు మాజీ మంత్రి కొడాలి నాని. మూడు రాజధానులు ఏర్పాటు వైసీపీ లక్ష్యం.. పాదయాత్ర పేరుతో విశాఖలో అల్లర్లు సృష్టించడానికి చంద్రబాబు వెళ్తున్నారని ఆరోపించారు నాని. 

Kodali Nani: వచ్చే ఎన్నికల్లో తండ్రీకొడుకులు ఇంటికే పరిమితం.. 3 రాజధానుల పక్కా
Kodali Nani On Chandrababu
Follow us
Surya Kala

|

Updated on: Sep 09, 2022 | 6:44 PM

Kodali Nani on Chandrababu : టీడీపీ అధినేత ప్రతిపక్ష నేత చంద్రబాబుపై మాజీ మంత్రి కొడాలి నాని సంచలన ఆరోపణలు చేశారు. బాబు  పిచ్చి పరాకాష్ట కు చేరిందని.. పగటి వేషగాడులా పిచ్చి వాగుడు వాగుతున్నాడంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు మళ్లీ అమరావతి పై ప్రజలను మోసం చేయాలని చూస్తున్నాడంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు. అమరావతి ని మహనగరాల లో మొదటి స్థానంలో ఎలా తీసుకెళ్తావని చంద్రబాబుకు ప్రశ్నించారు. రైతుల పొలాలు తీసుకుని వారిని మోసం చేసాడు.. ఐదు కోట్ల మందిని గాలికొదిలేసి అమరావతి లో పెడతారా?  అమరావతి నిర్మిస్తే ఏపీ ని మరో శ్రీలంక లా మారుస్తారా?  ప్రశ్నించారు కొడాలి నాని. రైతుల మొదటి పాదయాత్ర లో 100 కోట్ల చందాలు వసూలు చేసి చంద్రబాబు కు ఇచ్చారు.. మళ్లీ పాదయాత్ర ద్వారా రైతులను చందాలు వసూలుకు పంపిస్తున్నారంటూ ఎద్దేవా చేశారు.

ముంబై, చెన్నై లాంటి ప్రాంతాలతో 25 గ్రామాలను ఎప్పటికి అభివృద్ధి చేస్తావు. విశాఖలో 10వేల కోట్లు ఖర్చుపెడితే అభివృద్ధి జరుగుతుంది.. విశాఖ అభివృద్ధి ద్వారా రాష్ట్రానికి ఆదాయం సృష్టించవచ్చు.. ఎట్టి పరిస్థితుల్లో పరిపాలన రాజధాని వైజాగ్ తీసుకెళ్తాం..దీన్ని ఆపగలిగే శక్తి ఎవరికీ లేదని స్పష్టం చేశారు మాజీ మంత్రి కొడాలి నాని. మూడు రాజధానులు ఏర్పాటు వైసీపీ లక్ష్యం.. పాదయాత్ర పేరుతో విశాఖలో అల్లర్లు సృష్టించడానికి చంద్రబాబు వెళ్తున్నారని ఆరోపించారు నాని.

మూడు రాజధానులకు కృష్ణా జిల్లా ప్రజలు మద్దతు ఇస్తున్నారు.. లోకేష్ ఉచ్చులో పడవొద్దంటూ సలహా ఇచ్చారు. న్యాయ నిపుణులు సలహా తర్వాత అసెంబ్లీలో బిల్లు పెట్టడం పై నిర్ణయం తీసుకుంటామని ప్రజలకు తెలిపారు. ఈ అసెంబ్లీలో లేదా వచ్చే సమావేశాల్లో బిల్లు పెడతాం.. వచ్చే ఎన్నికల కంటే ముందే విశాఖ రాజధానిగా ఏర్పాటు చేస్తామన్నారు నాని. చంద్రబాబు, లోకేష్ లిద్దరూ కుప్పం, మంగళగిరి లో  ఓడిపోతారని నాని జోస్యం చెప్పారు. అంతేకాదు చంద్రబాబు అసెంబ్లీ కి వస్తే 20 రోజులు సమావేశాలు నిర్వహిస్తామని చెప్పారు కొడాలి నాని.

ఇవి కూడా చదవండి

Reporter: MPRao, TV9 Telugu

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

టేస్టీ అండ్ హెల్దీ కొబ్బరి పొడి.. బ్రేక్ ఫాస్ట్‌లోకి అదుర్స్!
టేస్టీ అండ్ హెల్దీ కొబ్బరి పొడి.. బ్రేక్ ఫాస్ట్‌లోకి అదుర్స్!
గురకతో ఇబ్బందిగా ఉందా..? తగ్గించుకునేందుకు చిట్కాలు!
గురకతో ఇబ్బందిగా ఉందా..? తగ్గించుకునేందుకు చిట్కాలు!
ఈజీగా అయిపోయే మీల్ మేకర్ మంచూరియా.. ఆరోగ్యం కూడా..
ఈజీగా అయిపోయే మీల్ మేకర్ మంచూరియా.. ఆరోగ్యం కూడా..
అన్నంతో రుచిగా మురుకులు.. కరకరలాడుతూ భలేగా ఉంటాయి..
అన్నంతో రుచిగా మురుకులు.. కరకరలాడుతూ భలేగా ఉంటాయి..
ఎల్‌ఐసీలో క్లెయిమ్‌ చేయని రూ.880 కోట్లు.. తెలుసుకోవడం ఎలా?
ఎల్‌ఐసీలో క్లెయిమ్‌ చేయని రూ.880 కోట్లు.. తెలుసుకోవడం ఎలా?
ఈ సారి చేపల వేపుడు ఇలా చేయండి.. ఆహా అదిరిపోతుంది..
ఈ సారి చేపల వేపుడు ఇలా చేయండి.. ఆహా అదిరిపోతుంది..
బాక్సింగ్ డే టెస్ట్‌కు ముందు కొత్త హెయిర్ కట్‌ అదరగొట్టిన విరాట్!
బాక్సింగ్ డే టెస్ట్‌కు ముందు కొత్త హెయిర్ కట్‌ అదరగొట్టిన విరాట్!
విజయ్ హజారే ట్రోఫీలో భారీ సెంచరీతో చెలరేగిన శ్రేయాస్ అయ్యర్
విజయ్ హజారే ట్రోఫీలో భారీ సెంచరీతో చెలరేగిన శ్రేయాస్ అయ్యర్
కువైట్‌లో భారత కార్మికులతో మమేకమైన ప్రధాని మోదీ!
కువైట్‌లో భారత కార్మికులతో మమేకమైన ప్రధాని మోదీ!
ఛాతిలో పేరుకుపోయిన కఫానికి ఇలా చెక్‌ పెట్టండి.. నేచురల్‌ టిప్స్‌
ఛాతిలో పేరుకుపోయిన కఫానికి ఇలా చెక్‌ పెట్టండి.. నేచురల్‌ టిప్స్‌