Andhra Pradesh: ముందు వాటిపై దృష్టి పెట్టండి.. ప్రాజెక్టు పనుల్లో అలసత్వం జరకూడదు.. సీఎం జగన్ సూచన

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో సాగు నీటి ప్రాజెక్టులపై సీఎం జగన్మోహన్ రెడ్డి సంబంధిత శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. 10 ప్రాజెక్టుల కోసం రూ. 25,497.28 కోట్లు ఖర్చుచేస్తున్నట్లు వెల్లడించారు. న్యూ డెవలప్‌మెంట్‌...

Andhra Pradesh: ముందు వాటిపై దృష్టి పెట్టండి.. ప్రాజెక్టు పనుల్లో అలసత్వం జరకూడదు.. సీఎం జగన్ సూచన
Cm Jagan
Follow us
Ganesh Mudavath

|

Updated on: Sep 09, 2022 | 9:30 PM

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో సాగు నీటి ప్రాజెక్టులపై సీఎం జగన్మోహన్ రెడ్డి సంబంధిత శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. 10 ప్రాజెక్టుల కోసం రూ. 25,497.28 కోట్లు ఖర్చుచేస్తున్నట్లు వెల్లడించారు. న్యూ డెవలప్‌మెంట్‌ బ్యాంకు, జపాన్‌ ఇంటర్నేషనల్‌ కోపరేషన్‌ ఏజెన్సీ, ఏషియన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంక్‌, కేఎఫ్‌బీ, ప్రపంచ బ్యాంకుల సహాయంతో ప్రాజెక్టులను నిర్మిస్తున్నట్లు వివరించారు. పనుల్లో అలసత్వం లేకుండా చూసుకోవాలని, గడువు లోగా పూర్తయ్యేలా చూడాలని ముఖ్యమంత్రి (CM Jagan) ఆదేశించారు. కరవు ప్రాంతాల్లో చెరువులను కాల్వల ద్వారా అనుసంధానం చేయాలని సీఎం సూచించారు. నియోజకవర్గాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని చెరువుల పరిస్థితిపై అధ్యయనం చేయాలని చెప్పారు. అవసరమైన చోట చెరువులు లేకపోతే కొత్తగా తవ్వించాలని సూచించారు. ఈ చెరువులన్నింటినీ గ్రావిటీ ద్వారా నీరు ప్రవహించేలా కాల్వలతో లింక్ చేయాలన్నారు. ఫలితంగా భూగర్భ జలాలు పెరుగడంతో పాటు, పర్యావరణ సమతుల్యత దెబ్బ తినకుండా ఉంటుందని చెప్పారు. ఈ పరిస్థితులతో వ్యవసాయం లాభసాటిగా మారుతుందని, ఉపాధి, ఆదాయాలు స్థిరంగా ఉంటాయని చెప్పారు.

పనులు పూర్తి చేయకుండా వదిలేసిన బ్రిడ్జిలు, ఆర్వోబీలు, ఫ్లైఓవర్లు ముందుగా పూర్తి చేయాలి. రామాయపట్నం, మచిలీపట్నం, భావనపాడుల్లో పోర్టులు నిర్మిస్తున్నాం. వీటి పరిసర ప్రాంతాలు త్వరగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. దీనివల్ల పోర్టు ఆధారంగా పెద్దఎత్తున అభివృద్ధి జరుగుతుందని.. ఈ దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం జగన్‌ ఆదేశించారు. బ్యాంకుల రుణాలతో చేపట్టిన ఈ ప్రాజెక్టుల పనుల్లో జాప్యం జరగకూడదు. చెరువుల్లోకి గ్రావిటీ ద్వారా నీరు ప్రవహించేలా కాలువలతో అనుసంధానం చేయాలి. తద్వారా భూగర్భ జలాలు పెరుగుతాయి.

    – సీఎం జగన్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..