Queen Elizabeth-II: ఎలిజబెత్-2 కు పెళ్లికి నిజాం నవాబు ఇచ్చిన గిఫ్ట్‌ ఇదే.. ఫోటో షేర్‌ చేసిన రాజకుటుంబం

70 ఏళ్లపాటు బ్రిటన్‌ (Britan) రాణిగా కొనసాగిన క్వీన్ ఎలిజబెత్-2 (Queen Elizabeth-II) నిన్న (గురువారం) కన్ను మూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె స్కాట్లాండ్‌లోని బాల్మోరల్ క్యాజిల్‌లో తుది శ్వాస విడిచారు. బ్రిటన్..

Queen Elizabeth-II: ఎలిజబెత్-2 కు పెళ్లికి నిజాం నవాబు ఇచ్చిన గిఫ్ట్‌ ఇదే.. ఫోటో షేర్‌ చేసిన రాజకుటుంబం
Queen Elizabeth Ii
Follow us
Ganesh Mudavath

|

Updated on: Sep 09, 2022 | 4:53 PM

70 ఏళ్లపాటు బ్రిటన్‌ (Britan) రాణిగా కొనసాగిన క్వీన్ ఎలిజబెత్-2 (Queen Elizabeth-II) నిన్న (గురువారం) కన్ను మూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె స్కాట్లాండ్‌లోని బాల్మోరల్ క్యాజిల్‌లో తుది శ్వాస విడిచారు. బ్రిటన్ చరిత్రలో సుదీర్ఘ కాలం మహారాణిగా కొనసాగిన వ్యక్తిగా రికార్డు సృష్టించిన క్వీన్ ఎలిజబెత్‌-2కు భారత్‌తో మంచి అనుబంధం ఉంది. క్వీన్ ఎలిజబెత్‌-II మూడుసార్లు భారత్‌లో పర్యటించారు. 1961, 1983, 1997 సంవత్సరాల్లో ఆమె ఇండియాకు వచ్చారు. ఈ పర్యటనల్లో భాగంగా క్వీన్ ఎలిజబెత్ ఢిల్లీ, ఆగ్రా, చెన్నై, ముంబై నగరాల్లో పర్యటించారు. ప్రేమకు చిహ్నమైన తాజ్‌మహల్ అందాలను వీక్షించి ముగ్ధులయ్యారు. 1947లో క్వీన్ ఎలిజబెత్‌-II వివాహం జరిగింది. ఈ సమయంలో నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ (Mir Usman Ali Khan) ఖరీదైన వజ్రాలు పొదిగిన ప్లాటినం హారాన్ని వివాహ కానుకగా ఆమెకు బహూకరించారు. అప్పటికే ప్రపంచంలోకెల్లా సంపన్నుడిగా గుర్తింపు పొందిన నిజాం నవాబు తన స్థాయికి తగ్గట్టుగా ఖరీదైన కానుక ఇవ్వాలని భావించారు. ఇందుకోసం లండన్‌కు చెందిన ప్రఖ్యాత ఆభరణాల తయారీ సంస్థ కార్టియర్‌ ప్రతినిధులను క్వీన్ ఎలిజబెత్ వద్దకు నిజాం నవాబ్ పంపించారు. రాణి ఎలిజబెత్ స్వయంగా వివాహ కానుకను సెలక్ట్ చేసుకోవాలని, దానికి అనుగుణంగా ఆభరణాన్ని తయారు చేయాలంటూ సూచించారట. దాంతో ఆమె తనకెంతగానో నచ్చిన ప్లాటినం నక్లెస్‌ను ఎంపిక చేసుకున్నారని రాయల్ ఫ్యామిలీ స్వయంగా వెల్లడించింది.

Queen Elizabeth Ii

Queen Elizabeth Ii

నిజాం నవాబ్ కానుకగా ఇచ్చిన నెక్లెస్‌లో దాదాపు 300 వజ్రాలు పొదిగి ఉండటం విశేషం. 70 ఏళ్ల తన పాలనలో బ్రిటన్ రాణి ఎలిజబెత్ – 2 ఎన్నో విలువైన కానుకలు అందుకున్నారు. వాటన్నింటిలోకి నిజాం నవాబు ఇచ్చింది ప్రత్యేకమైనది అని చెప్పుకోవాలి. రాయల్ జ్యూయలరీ దగ్గరున్న ఆభరణాల్లో ఇదే అత్యంత ఖరీదైనదిగా భావిస్తారు. దీని విలువ 66 మిలియన్ పౌండ్లకుపైగా ఉంటుందని అంచనా. ఎంతో ఇష్టంగా తీసుకున్న ఈ నెక్లెస్‌ను క్వీన్ ఎలిజబెత్ తరచుగా ధరించేవారు. ఈ వజ్రాల నెక్లెస్ ను ధరించిన ఫొటోను ఈ ఏడాది జులై 21న బ్రిటన్ రాజ కుటుంబం అధికారిక ఇన్ స్టా గ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి