AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: ఆస్పత్రిలో బాలుడు మృతి.. అంబులెన్స్ ఇవ్వని సిబ్బంది.. బైక్ మీద బాలుడి శవంతో తల్లిదండ్రులు ప్రయాణం

ఆసుపత్రి సిబ్బంది స్పందించకపోవంతో.. బాలుడు మృతదేహాన్ని తండ్రి ఒడిలో పెట్టుకుని ఇక్కడి నుండి అక్కడికి తిరుగుతూనే ఉన్నాడు. చివరికి కుటుంబసభ్యులు చిన్నారి మృత దేహాన్ని ఒడిలో పెట్టుకుని మోటార్‌సైకిల్‌పై తమ ఇంటికి తీసుకెళ్లారు.

Viral News: ఆస్పత్రిలో బాలుడు మృతి.. అంబులెన్స్ ఇవ్వని సిబ్బంది.. బైక్ మీద బాలుడి శవంతో తల్లిదండ్రులు ప్రయాణం
Viral News
Surya Kala
|

Updated on: Sep 09, 2022 | 8:40 PM

Share

Viral News: మరోసారి మానవత్వం సిగ్గుపడే ఘటన తెరపైకి వచ్చింది.. నిర్లక్ష్యానికి నిత్యం పతాక శీర్షికల్లో నిలిచే మధ్యప్రదేశ్‌లోని పన్నా జిల్లా ఆసుపత్రిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. అమంగ్నాజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజ్‌పూర్ గ్రామ నివాసి అయిన 5 ఏళ్ల బాలుడు సౌరభ్ చౌదరికి డబుల్ న్యుమోనియా సోకింది. దీంతో బాలుడు తండ్రి ఫులారే చౌదరి చికిత్స నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించాడు. అక్కడ చికిత్స పొందుతూ 5 ఏళ్ల బాలుడు మరణించాడు.  చిన్నారి మృతదేహాన్ని తమ స్వగ్రామం తీసుకెళ్లేందుకు కుటుంబ సభ్యులు అంబులెన్స్ ను ఇవ్వమని అధికారులు, ఉద్యోగుల చుట్టూ ప్రదక్షిణలు చేశారు. అయితే ఆసుపత్రి సిబ్బంది స్పందించకపోవంతో.. బాలుడు మృతదేహాన్ని తండ్రి ఒడిలో పెట్టుకుని ఇక్కడి నుండి అక్కడికి తిరుగుతూనే ఉన్నాడు. చివరికి కుటుంబసభ్యులు చిన్నారి మృత దేహాన్ని ఒడిలో పెట్టుకుని మోటార్‌సైకిల్‌పై తమ ఇంటికి తీసుకెళ్లారు.

అయితే జిల్లా ఆస్పత్రిలో ఇలా జరగడం ఇదే తొలిసారి కాదు. ఇంతకు ముందు కూడా ఇలాంటి ఉదంతాలు అనేకం తెరపైకి వచ్చాయి. ఇంత జరుగుతున్నా వ్యవస్థలో ఎలాంటి మెరుగుదల లేదని బాధితులు వాపోతున్నారు. మృతదేహాన్ని తరలించడానికి సౌకర్యాలు కల్పించాలని నర్సులకు, జిల్లా ఆసుపత్రి సిబ్బందికి పలుమార్లు విన్నవించుకున్నామని మృతుడి బంధువులు చెబుతున్నారు. తమకు చిన్నారి బాలుడి మృత దేహాన్ని మోటార్ సైకిల్ పై స్వగ్రామం తరలించడం తప్ప వేరే దారి దొరకలేదని బాధిత కుటుంబ సభ్యులు చెప్పారు. ఆస్పత్రి సిబ్బంది,  అధికారులు ఈ విషయంలో ఏమీ మాట్లాడకుండా ఉన్నారని పలువురు ఆరోపిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

వైద్యుల మూకుమ్మడి రాజీనామాతో ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు పన్నాలో వైద్యుల మూకుమ్మడి రాజీనామా కారణంగా ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. జిల్లా ఆస్పత్రిలో చికిత్స అందకపోవడంతో ఆరు గంటల్లో ఇద్దరు అమాయకులు సహా ముగ్గురు చనిపోయారు. మృతుడి బంధువుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. జిల్లా యంత్రాంగం మాత్రం ఈ వ్యవహారంలో తీవ్రతను అర్థం చేసుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వైద్యుల మూకుమ్మడి రాజీనామా పై ముందస్తు సమాచారం ఇచ్చినా చికిత్సకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేదు. చీఫ్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్, సివిల్ సర్జన్‌పై హరిజన చట్టం నమోదు చేసి సివిల్ సర్జన్‌ను కొట్టడం పట్ల వైద్యుల్లో ఆగ్రహం వ్యక్తం కావడం గమనార్హం. దీనికి నిరసనగా వైద్యులు మూకుమ్మడి రాజీనామాలు చేశారు. రాజీనామాతో జిల్లాలో వైద్య సదుపాయాలు స్తంభించాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..