Viral Video: స్నేహితులకు స్కిప్పింగ్ ఆడటంలో సహయం చేస్తోన్న కుక్కపిల్ల.. వీడియో వైరల్..
పిల్లలతో కుక్క పిల్లలు చేసే అల్లరి కూడా తెలిసిందే. చిన్నపిల్లలతో కలిసి ఎంతో సరదాగా ఆడుకుంటాయి. తాజాగా అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
సోషల్ మీడియాలో ప్రతిరోజూ ఎన్నో వీడియోలు వైరల్ అవుతున్నాయి. వీటిలో కొన్ని మన హృదయాలను హత్తుకుంటాయి. మరికొన్ని వీడియోలు మనల్ని చాలా భావోద్వేగానికి గురి చేస్తాయి. ఈ రోజుల్లో చాలా పెట్ వీడియోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. అందులో పెంపుడు కుక్కలు తమ యాజమానుల పట్ల చూపించే ప్రేమ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పిల్లలతో కుక్క పిల్లలు చేసే అల్లరి కూడా తెలిసిందే. చిన్నపిల్లలతో కలిసి ఎంతో సరదాగా ఆడుకుంటాయి. తాజాగా అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఆ వీడియోలో కొందరు పిల్లలు స్కిప్పింగ్ ఆడుకుంటున్నారు. వారితోపాటు ఓ కుక్క కూడా స్కిప్పింగ్ ఆడుతుంది. తాడును నోటితో పట్టుకుని వారికి స్కిప్పింగ్ ఆడటంలో సహయం చేస్తుంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇప్పటివరకు ఈ వీడియోకు 8 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. ఈ వీడియో చూసిన నెటిజన్స్ పలు రకాలుగా స్పందిస్తున్నారు.
View this post on Instagram
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.