Dhanush’s 3 Movie: విడుదలై 10 ఏళ్లు అయిన మళ్లీ బాక్సాఫీస్‏ను షేక్ చేసింది.. తెలుగు రాష్ట్రాల్లో ధనుష్ క్రేజ్ మాములుగా లేదుగా..

ధనుష్ మాజీ భార్య ఐశ్యర్వ రజనీకాంత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఆయన తండ్రి ప్రొడ్యూసర్ కస్తూరి రాజా ప్రొడక్షన్ పై నిర్మించారు.

Dhanush’s 3 Movie: విడుదలై 10 ఏళ్లు అయిన మళ్లీ బాక్సాఫీస్‏ను షేక్ చేసింది.. తెలుగు రాష్ట్రాల్లో ధనుష్ క్రేజ్ మాములుగా లేదుగా..
3 Movie
Follow us
Rajitha Chanti

|

Updated on: Sep 09, 2022 | 3:20 PM

గత కొద్దిరోజులుగా దక్షిణాది చిత్రపరిశ్రమలో నయా ట్రెండ్ నడుస్తోంది. స్టార్ హీరోస్ పుట్టిన రోజు సందర్భంగా వారి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలను మరోసారి థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. ఇప్పటికే తెలుగులో పోకిరి, జల్సా, ఘరానా మొగుడు సినిమాలు విడుదలై రికార్డ్ స్థాయిలో వసూళ్లు రాబట్టిన సంగతి తెలిసిందే. విడుదలై ఏన్నాళ్లైన పలు సినిమాల క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. తాజాగా తమిళ్ స్టార్ హీరో ధనుష్ (Dhanush) తండ్రి కస్తూరు రాజా పుట్టిన రోజు సందర్భంగా మరోసారి థియేటర్లలో విడుదలైన 3 సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది.

ధనుష్ మాజీ భార్య ఐశ్యర్వ రజనీకాంత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఆయన తండ్రి ప్రొడ్యూసర్ కస్తూరి రాజా ప్రొడక్షన్ పై నిర్మించారు. ఈ సినిమా విడుదలకు ముందే భారీ హైప్ సృష్టించింది. తాజాగా విడుదలైన ఈ మూవీ మొదటి రోజే తెలుగు రాష్ట్రాల్లో మెజారిటీ థియేటర్లు హౌస్ ఫుల్ అయ్యాయి. అంతేకాకుండా రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ రాబట్టిందని ట్రెడ్ వర్గాలు చెబుతున్నాయి. మొదటి రోజు ఉదయం నుంచి 150కి పైగా హౌస్ ఫుల్ అయ్యాయి. తమిళ్ స్టార్ హీరో ధనుష్ సినిమా దాదాపు విడుదలైన 10 సంవత్సరాల తర్వాత మళ్లీ రిలీజ్ కాబోతుండడంతో తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. హౌస్ ఫుల్ షోలతో.. ప్రేక్షకులతో థియేటర్లు కిక్కిరిసిపోయాయి. ఈ సినిమాలో శ్రుతి హాసన్, శివ కార్తికేయన్ కీలకపాత్రలలో నటించారు. మొత్తానికి 3 సినిమా మొదటి రోజే ప్రభంజనం సృష్టించింది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.