AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Coimbatore: ఓనం వేడుక‌ల్లో విషాదం… ముగ్గురు కాలేజీ విద్యార్థులను మింగేసిన మెట్లబావి.. అసలేమైందంటే..

ఈ ఘ‌ట‌న‌లో ముగ్గురు కాలేజీ విద్యార్థులు మృత్యువాతపడ్డారు. ఓనం వేడుక‌లు ముగించుకుని తిరిగి వ‌స్తుండ‌గా ఈ ప్ర‌మాదం జ‌రిగిన‌ట్టు స‌మాచారం.

Coimbatore: ఓనం వేడుక‌ల్లో విషాదం... ముగ్గురు కాలేజీ విద్యార్థులను మింగేసిన మెట్లబావి.. అసలేమైందంటే..
Onam Celebrations
Jyothi Gadda
|

Updated on: Sep 09, 2022 | 9:05 PM

Share

Coimbatore: త‌మిళ‌నాడు రాష్ట్రం కోయంబ‌త్తూరులో దారుణం జ‌రిగింది. ఓనం వేడుక‌లు ముగించుకుని తిరిగి వ‌స్తుండ‌గా కారు ప్ర‌మాదం జ‌రిగింది. అతివేగంతో అదుపుత‌ప్పి కారు బావిలో ప‌డిపోయింది. 70 అడుగుల లోతున్న బావిలో కారు బోల్తా కొట్టింది. ఈ ఘ‌ట‌న‌లో ముగ్గురు కాలేజీ విద్యార్థులు మృత్యువాతపడ్డారు. ఓనం వేడుక‌లు ముగించుకుని తిరిగి వ‌స్తుండ‌గా ఈ ప్ర‌మాదం జ‌రిగిన‌ట్టు స‌మాచారం. తొండాముత్తూర్‌లోని పొలాల ద‌గ్గ‌ర రోడ్డు ప‌క్క‌నే ఉన్న బావిలో కారు ప‌డిపోయింది. దీనికి సంబంధించిన మ‌రిన్ని వివ‌రాలు పరిశీలించగా..

సెప్టెంబరు 9, శుక్రవారం తెల్లవారుజామున కోయంబత్తూరు శివార్లలో ఈ కారు ప్రమాదం జరిగింది. ఓనం వేడుకలు కాలేజీ విద్యార్థుల పట్ల విషాదంగా మారాయి. ప్రమాదవశాత్తు వారు ప్రయాణిస్తు్న కారు లోతైన బావిలో ముగ్గురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. నలుగురు విద్యార్థుల బృందం ఓనం వేడుకలకు హాజరై తిరిగి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. గురువారం రోషన్ (18) అనే విద్యార్థి తన ముగ్గురు స్నేహితులైన ఆదర్శ్, రవి, నందనన్‌లతో కలిసి ఓనం వేడుకలు వెళ్లారు..నలుగురూ వేడుకలను కొనసాగించడానికి సిరువాణిలోని ఒక ప్రైవేట్ క్లబ్‌కు బయలుదేరారు. మరుసటి రోజు ఉదయం, రోషన్ ఇంటికి తిరిగి రావడానికి నలుగురూ క్లబ్ నుండి బయలుదేరారు. తొండముత్తూరు సమీపంలోని తెన్నమనల్లూరు వద్దకు రాగానే కారు నడుపుతున్న రోషన్‌ అదుపు తప్పి రోడ్డుపై నుంచి బావిలో పడిపోయినట్లు సమాచారం. అయితే, రోషన్ తప్పించుకోగలిగాడు. మిగిలిన ముగ్గురు యువకులు కారు నుండి తప్పించుకోలేక కారుతో పాటు బావిలో మునిగిపోయారని పోలీసులు తెలిపారు.

రోషన్ ర్యాష్ డ్రైవింగ్ కారణంగానే ఈ ఘోర ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో రోషన్‌ కూడా గాయాలైనట్టుగా చెప్పారు. అగ్నిమాపక, రెస్క్యూ సర్వీస్ సిబ్బంది బావిలోంచి కారును బయటకు తీశారు. వాహనం నుండి ఒక మృతదేహాన్ని తొలుత బయటకు తీశారు. ఇందుకోసం క్రేన్‌ను ఉపయోగించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఎర్రకోట వద్ద బాంబు పేలుడు ఘటనలో 40కిలోల పేలుడు పదార్థాన్ని వాడారు
ఎర్రకోట వద్ద బాంబు పేలుడు ఘటనలో 40కిలోల పేలుడు పదార్థాన్ని వాడారు
ఈ-సిగరెట్ ఇంత ప్రమాదకరమా? మహిళ తన కంటి చూపు కోల్పోయింది!
ఈ-సిగరెట్ ఇంత ప్రమాదకరమా? మహిళ తన కంటి చూపు కోల్పోయింది!
ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు షాక్.. డబ్బులు కట్
ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు షాక్.. డబ్బులు కట్
ఈ మూడు రోజులు జాగ్రత్త బాస్‌..! చెప్పేది అర్ధం చేసుకోండి
ఈ మూడు రోజులు జాగ్రత్త బాస్‌..! చెప్పేది అర్ధం చేసుకోండి
థైరాయిడ్‌ రోగులకు బిగ్ అలర్ట్.. శీతాకాలంలో వీటిని అస్సలు తినొద్దు
థైరాయిడ్‌ రోగులకు బిగ్ అలర్ట్.. శీతాకాలంలో వీటిని అస్సలు తినొద్దు
వైజాగ్ వెళ్లే టూరిస్ట్‌లకు బిగ్‌అలర్ట్.. ఇకపై మ్యూజియాలన్నీ
వైజాగ్ వెళ్లే టూరిస్ట్‌లకు బిగ్‌అలర్ట్.. ఇకపై మ్యూజియాలన్నీ
ఇదేదో చెక్కబెరడు అనుకుంటే పొరపాటే.. గుండె జబ్బులకు గొడ్డలిపెట్టు!
ఇదేదో చెక్కబెరడు అనుకుంటే పొరపాటే.. గుండె జబ్బులకు గొడ్డలిపెట్టు!
సంక్రాంతికి అరడజను సినిమాలు.. అందరికీ న్యాయం జరుగుతుందా
సంక్రాంతికి అరడజను సినిమాలు.. అందరికీ న్యాయం జరుగుతుందా
సౌత్ మార్కెట్ కోసం బాలీవుడ్ హీరోల స్ట్రాటజీ
సౌత్ మార్కెట్ కోసం బాలీవుడ్ హీరోల స్ట్రాటజీ
వాట్సప్‌లో మరో అద్భుత ఫీచర్.. కొత్త ఏడాది వేళ లాంచ్
వాట్సప్‌లో మరో అద్భుత ఫీచర్.. కొత్త ఏడాది వేళ లాంచ్