AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Arvind Kejriwal: ఇద్దరి మధ్య పలు అంశాలపై చర్చ.. ఢిల్లీ LG వీకే సక్సేనాతో సీఎం కేజ్రీవాల్‌ భేటీ..

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌- ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ VK సక్సేనాతో భేటీ అయ్యారు. డిప్యూటీ CM సిసోడియా ఇంటిపై CBI దాడులు చేసిన తర్వాత లెఫ్టినెంట్‌ గవర్నర్‌తో కేజ్రీవాల్‌ సమావేశమవడం ఇదే తొలిసారి

Arvind Kejriwal: ఇద్దరి మధ్య పలు అంశాలపై చర్చ.. ఢిల్లీ LG వీకే సక్సేనాతో సీఎం కేజ్రీవాల్‌ భేటీ..
Arvind Kejriwal Delhi L G
Sanjay Kasula
|

Updated on: Sep 09, 2022 | 10:03 PM

Share

ఢిల్లీ LG వీకే సక్సేనాతో సమావేశమయ్యారు సీఎం కేజ్రీవాల్‌. ఆగస్ట్‌ 12 తర్వాత మొదటిసారిగా సమావేశమయ్యారు. లిక్కర్‌ కుంభకోణంలో డిప్యూటీ సీఎం మనీష్‌ సిసోడియా నివాసంలో సీబీఐ దాడులు చేసింది. ఆ తర్వాత ఫస్ట్‌ టైమ్‌ ఎల్జీతో భేటీ అయ్యారు కేజ్రీవాల్‌. ఇటీవల ఆప్‌, లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మధ్య పలు అంశాల్లో విభేదాలు తలెత్తాయి. ఢిల్లీ మద్యం పాలసీని కూడా తీవ్రంగా వ్యతిరేకించారు ఎల్జీ సక్సేనా. కేజ్రీవాల్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మద్యం పాలసీ నిబంధనలకు విరుద్ధంగా ఉందని ఆరోపణలొచ్చాయి. ఈ విషయంలో లెఫ్టినెంట్‌ గవర్నర్‌ జోక్యం చేసుకొని విచారణ జరపాలని సీబీఐకి సిఫార్స్‌ చేశారు.

2021-2022లో తీసుకొచ్చిన ఈ పాలసీ విషయంలో నిబంధనలు ఉల్లంఘించారని, విధానపరమైన లోపాలున్నాయని ఆరోపణలు రావడంతో ఎల్జీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు అధికారులు. ఐతే లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అవినీతికి పాల్పడ్డారని..ఆయన్ను పదవి నుంచి తొలగించాలంటూ ఆందోళనలు చేసింది ఆప్‌. ఎల్జీ సక్సేనాపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు.

దీంతో లెఫ్టినెంట్‌ గవర్నర్‌ సక్సేనా ఆప్‌ నేతలకు లీగల్‌ నోటీసులు పంపారు. ఆమ్ఆద్మీ పార్టీ, ఎల్జీ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో గవర్నర్‌తో కేజ్రీవాల్‌ భేటీ చర్చనీయాంశంగా మారింది. ఐతే ఇవాల్టి సమావేశంలో పలు అంశాలపై చర్చించామన్నారు కేజ్రీవాల్‌..ఢిల్లీలో చెత్తాచెదరం తొలగించడానికి తమ ప్రభుత్వం- కేంద్రం అధీనంలో పనిచేసే ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌కు సహకారం అందిస్తుందని గవర్నర్‌కు చెప్పినట్లు వివరించారు. ఇటీవల తాను ఢిల్లీలో లేకపోవడంతోనే..ఎల్జీని కలవలేకపోయానని తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం