AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips:ఆరోగ్యానికి మంచిదని ఈ జ్యూస్ తెగ తాగేస్తున్నారా.. ఇవి తెలుసుకోకుంటే మాత్రం.. ప్రమాదంలో పడ్డట్లే..

ప్రజలు ట్రెండ్స్ లేదా అపోహలపై ఆధారపడి అనేక పద్ధతులను ప్రయత్నిస్తున్నారు. పచ్చి కూరగాయల రసాన్ని తాగే విధానం వీటిలో ఒకటి . మీరు కూరగాయలు తీసుకోవడం ద్వారా మిమ్మల్ని మీరు ఆరోగ్యంగా ఉంచుకోవాలనుకోవడం మంచి విషయమే..

Health Tips:ఆరోగ్యానికి మంచిదని ఈ జ్యూస్ తెగ తాగేస్తున్నారా.. ఇవి తెలుసుకోకుంటే మాత్రం.. ప్రమాదంలో పడ్డట్లే..
Green Vegetables Benefits
Venkata Chari
|

Updated on: Sep 10, 2022 | 3:52 PM

Share

ఈ డిజిటల్ యుగం లేదా సోషల్ మీడియా కాలంలో, ప్రజలు ఆరోగ్యంగా ఉండటానికి కొన్ని పద్ధతులను అనుసరిస్తుంటారు. ఆరోగ్యంగా ఉండాలంటే, సరైన దినచర్యను అనుసరించాలి. కానీ, దాని పేరుతో ఏది పడితే అది ప్రయత్నించడం కూడా సరైనది కాదు. ప్రజలు ట్రెండ్స్ లేదా అపోహలపై ఆధారపడి అనేక పద్ధతులను ప్రయత్నిస్తున్నారు. పచ్చి కూరగాయల రసాన్ని తాగే విధానం వీటిలో ఒకటి . మీరు కూరగాయలు తీసుకోవడం ద్వారా మిమ్మల్ని మీరు ఆరోగ్యంగా ఉంచుకోవాలనుకోవడం మంచి విషయమే, అయితే దీని కోసం సరైన సమాచారాన్ని తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యమే. కూరగాయలు అవసరమైన విటమిన్లు, ఖనిజాలను కలిగి ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. ఎముకలను బలంగా చేస్తాయి. వ్యాధుల నుంచి మనలను కాపాడతాయి.

పచ్చి కూరగాయ రసం తాగడం ఎంత వరకు సరైనది. ఎంత వరకు కాదనే విషయాలపై ఆయుర్వేదంలో చాలా విషయాలు పేర్కొన్నారు. ఆయుర్వేదం ప్రకారం, మీరు అలాంటి జ్యూస్ తాగడానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన సమాచారాన్ని ఇప్పుడు తెలుసుకుందాం..

వర్షాకాలంలో కూరగాయల రసం తాగడం ఎంతవరకు సురక్షితం..

ఇవి కూడా చదవండి

కూరగాయలు తీసుకోవడం చాలా ముఖ్యం. కానీ, పచ్చి కూరగాయల రసం తాగడం సురక్షితమేనా అనే దానిపై తరచుగా గందరగోళం ఉంటుంది. ఆయుర్వేదం ప్రకారం, వర్షాకాలంలో ఆకు కూరలపై క్రిములు స్థిరపడతాయని నిపుణులు చెబుతున్నారు. వాటిని ఉడకబెట్టకుండా తినడం వల్ల డయేరియా లేదా ఇతర ఆరోగ్య సంబంధిత వ్యాధులు వస్తాయి.

పచ్చి కూరగాయలు సులభంగా జీర్ణం కావు..

పచ్చివి జీర్ణం కావని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. అవును, వాటిని మసాలా దినుసులతో వండిన తర్వాత తింటే, అవి సులభంగా జీర్ణమవుతాయి. కొన్ని ముడి ఆహారాలు యాంటీ-న్యూట్రీషియన్స్ కలిగి ఉంటాయి. అవి ఆహార పదార్థాల పోషక శోషణను పూర్తిగా నిరోధిస్తాయి.

ఈ సమస్యలలో పచ్చి కూరగాయల రసాన్ని తీసుకోవద్దు..

ఆయుర్వేద నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఎవరికైనా వికారం, అలసట, తల తిరగడం, ఉబ్బరం, విరేచనాలు వంటి సమస్యలు ఉంటే, వారు పచ్చి కూరగాయల రసాలను తీసుకోకుండా ఉండాలి. ఆయుర్వేదం ప్రకారం మీరు ఎక్కువగా ఏదైనా తినాలని లేదా తాగాలని సిఫారసు చేయదు. ముఖ్యంగా ఆహార పదార్ధం పచ్చిగా ఉంటే, దానిని తక్కువ పరిమాణంలో మాత్రమే తినాలని సూచిస్తుంది.

ఈ పచ్చి కూరగాయల రసాన్ని మాత్రం తాగొద్దు..

పచ్చి బచ్చలికూర, క్యాబేజీ రసం తాగడం వల్ల మీ కిడ్నీలపై చెడు ప్రభావం పడుతుంది. వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల ఐరన్, కాల్షియం వంటి మూలకాలను నిరోధించవచ్చు.

మీరు క్యారెట్, దుంప, గోధుమ గడ్డి, అల్లం, పార్స్లీ వంటి వాటి రసాన్ని తాగవచ్చు. కానీ, ఎక్కువగా తాగితే మాత్రం ప్రమాదండి మారే ఛాన్స్ ఉంది.