Queen Elizabeth II: క్వీన్‌ ఎలిజబెత్‌-2 రోజూ ఏం తినేవారో తెలుసా? ఆమె ఆరోగ్య రహస్యం ఇదే..

బ్రిటన్‌ క్వీన్‌ ఎలిజబెత్‌-2 సంపూర్ణ జీవితం అనుభవించి 96 ఏళ్ల వయసులో సెప్టెంబర్‌ 8, 2022 (గురువారం) కన్నుమూశారు.క్వీన్ ఎలిజబెత్ 2 ఇంత కాలం ఆరోగ్యంగా జీవించడానికి ప్రధానకారణం ఆమె జీవనశైలి (simple lifestyle) అని అంటున్నారు నిపుణులు..

Queen Elizabeth II: క్వీన్‌ ఎలిజబెత్‌-2 రోజూ ఏం తినేవారో తెలుసా? ఆమె ఆరోగ్య రహస్యం ఇదే..
Queen Elizabeth Ii Lifestyl
Follow us
Srilakshmi C

| Edited By: Janardhan Veluru

Updated on: Sep 10, 2022 | 4:14 PM

Healthy Habits To Help You Live Longer: బ్రిటన్‌ క్వీన్‌ ఎలిజబెత్‌-2 సంపూర్ణ జీవితం అనుభవించి 96 ఏళ్ల వయసులో సెప్టెంబర్‌ 8, 2022 (గురువారం) కన్నుమూశారు. ఏప్రిల్‌ 21, 1926లో జన్మించిన ఎలిజబెత్‌ తండ్రి కింగ్ జార్జ్ -6 మరణం తర్వాత 25 ఏళ్ల వయసులో ఫిబ్రవరి 6, 1952వ సంవత్సరంలో బ్రిటన్‌ యువరాణిగా పట్టాభిషేకం పొందారు. 1947లో ప్రిన్స్‌ ఫిలిప్‌ మౌంట్‌ బాటెన్‌ను వివాహం చేసుకున్నారు. దాదాపు 70 ఏళ్లపాటు బ్రిటన్‌ దేశాన్ని ఏలిన ఎలిజబెత్‌ బ్రిటన్‌ రాజవంశీకుల చరిత్రలోనే అత్యధికకాలం జీవించిన పరిపాలకురాలిగా ఆమె రికార్డు సృష్టించారు. ప్రపంచంలోనే అత్యధిక కాలం పాలించిన రెండో వ్యక్తిగా ఆమె చరిత్ర సృష్టించారు. ఆమె పరిపాలన హయాంలో విన్‌స్టన్‌ చర్చిల్‌ నుంచి లిజ్‌ ట్రస్‌ వరకు దాదాపు 14 మంది ప్రధాన మంత్రులు పనిచేశారు. 94 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు (2020 డిసెంబర్‌లో) ఎలిజబెత్‌ను పరీక్షించిన న్యూయార్క్ పోస్ట్ బ్రిటీష్ రాయల్- ‘వయసు పెరగడం వల్ల ముఖంపై ఏర్పడ్డ ముడతలు తప్ప, మరెటువంటి ఇబ్బంది లేకుండా ఆమె ఆరోగ్యంగా ఉన్నట్లు’ నివేదించింది.

క్వీన్ ఎలిజబెత్ 2 ఇంత కాలం ఆరోగ్యంగా జీవించడానికి ప్రధానకారణం ఆమె జీవనశైలి (simple lifestyle). దీనితోపాటు ఎల్లప్పుడు చురుకుగా, ఉత్సాహంగా ఉంటే దీర్ఘాయువు సాధ్యమేనని అంటున్నారు ప్రముఖ సైకాలజిస్టు డా పుల్కిత్‌ శర్మ. బ్రిటిష్‌ కల్చర్‌ రీసెర్చర్‌ బ్రయాన్ కోజ్‌లోస్కీ రాసిన ‘లాంగ్‌ లివ్‌ ది క్వీన్‌! 23 రూల్స్‌ ఫర్‌ లివింగ్‌ ఫ్రం బ్రిటన్స్‌ లాంగెస్ట్‌ రైనింగ్‌ మోనార్క్‌’ అనే పుస్తకంలో క్వీన్ ఎలిజబెత్‌-2 రోజువారీ జీవన విధానం గురించి కూలంకషంగా చెప్పుకొచ్చారు. ఆమె తినే ఆహారం, వర్క్‌ షెడ్యూల్‌, ఖాళీ సమయాల్లో అలవాట్లు, కుటుంబ-వృతి సంబంధాలను నిర్వహించిన విధానాలను ఈ బుక్‌లో వివరించాడు.

సంతోషంగా ఉండటం అంటేనే ఎక్కువ కాలం జీవించడమని అర్థం..

ఇవి కూడా చదవండి

సాధారణంగా ఏవరైనా సంతోషంగా, ప్రశాంతంగా, చురుకైన జీవితాన్ని జీవిస్తుంటే అది ఆ వ్యక్తి రోగనిరోధక శక్తిని మరింత బలపరుస్తుంది. ఆనందం మనిషి మనస్సుపై సైకలాజికల్‌ ఎఫెక్ట్‌ (ప్రభావం) చూపుతుంది. ముఖ్యంగా మన శరీరంలో డోపమైన్ (ఇది ఒక రకమైన న్యూరోట్రాన్స్మిటర్) అనే హార్మోన్ శరీరక విధుల్లో, మానసిక ఆరోగ్యాన్ని నిర్వర్తించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇది అన్ని రకాల ఇన్ఫెక్షన్‌ల నుంచి కాపాడుతుంద’ని డాక్టర్ శర్మ సంతోషకర జీవితానికి ఆరోగ్యానికి మధ్య ఉన్న సంబంధాన్ని వివరించారు.

రాణి ఎలిజబెత్‌ ఆరోగ్యంలో నేను గమనించిన మరో విషయం ఏమిటంటే.. ఆమెకు నేర్చుకోవడం పట్ల మక్కువ. “ఆమె ఎప్పుడూ కొత్త విషయాలను నేర్చుకోవడానికి ఆసక్తి కనబరుస్తారు. ప్రపంచవ్యాప్తంగా చోటుచేసుకునే కొత్త విషయాలను తెలుసుకోవాడానికి అమితాశక్తి కలిగి ఉంటారు. ఈ విధమైన ఉత్సుకత ఒక వ్యక్తికి జీవించాలనే కోరికను ప్రేరేపిస్తుంది. అల్జీమర్స్ వంటి న్యూరో-డిజెనరేటివ్ డిజార్డర్స్ భారీన పడకుండా మెదడును చురుగ్గా ఉంచుతుంది. కొత్త విషయాలు తెలుసకుని, నేర్చుకుంటూ ఉండే వృద్ధుల్లో పాజిటివ్‌ ఆటిట్యూడ్ అధికంగా ఉంటుంది. ఇలాంటి వారు ఎక్కువకాలం జీవించే అవకాశం ఉన్నట్లు పరిశోధనలు కూడా నిరూపించాయి. ఇవన్నీ క్వీన్‌ ఎలిజబెత్‌ 2 జీవన విధానంలో ఉండటం వల్ల ఆమె సుదీర్ఘకాలం ఆరోగ్యంగా జీవించడానికి సాధ్యపడింది.

ఆరోగ్యజీవన విధానంలో ఆహారం ముఖ్యమైనది..

మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత (1914-1918) రాణి ఎలిజబెత్‌ జన్మించింది. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో టీనేజ్‌లో ఉన్న ఎలిజబెత్‌ అందరిలాగే సాధారణ భోజనం చేశారు. ఫరీదాబాద్‌లోని అకార్డ్ సూపర్‌స్పెషాలిటీ హాస్పిటల్‌ సీనియర్ కన్సల్టెంట్‌, హెడ్ అయిన డాక్టర్ జయంత ఠాకూరియా మాట్లాడుతూ.. ఇంట్లో వండిన ఆహారం తినేవారిలో జీర్ణవ్యవస్థ ఆరోగ్యకరంగా ఉంటుంది. అంటే.. ఇంటి భోజనం చేసేవారు వ్యాధుల భారీన తక్కువగా పడుతుంటారు. శరీరం ఆరోగ్యంగా ఉండేవారు ఎక్కువ కాలం జీవిస్తారు. విదేశాల్లో నివసించే వారిలో చాలా మంది చేపలు, చికెన్, టర్కీ కోడి మాంసం వంటి ఆహారాలను తింటుంటారు. ఆలివ్ ఆయిల్‌తో వండిన ఆహారాన్ని తింటారు. అలాగే సలాడ్స్‌, పండ్లు వారి భోజనాల్లో ప్రధాన భాగంగా ఉంటాయి. వీటన్నింటి కంటే ముఖ్యంగా వారు ఉప్పు చాలా తక్కువ (సోడియం) పరిమాణంలో తీసుకుంటారు. ఉప్పు, ప్రాసెస్డ్ ఫుడ్స్ తినడం వల్ల శరీరం విషపూరితం అవుతుంది. అందుకే ఇంట్లో వండిన ఆహారాన్ని తినాలి. కడుపులోని పేగులకు హానితలపెట్టే జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండాలి. జీవితంలో ఏ దశలోనున్న వారైనా ఈ చిన్న మార్పులు చేసుకుంటే వారి జీవితకాలం పొడిగించడం అసాధ్యం కానేకాదు. అలాగే శారీరక వ్యాయామం కూడా అంతే ముఖ్యం. కండలు పెంచేంత చేయనవసరం లేదు.

కేవలం వారానికి ఐదు రోజులు వాకింగ్, స్విమ్మింగ్, స్ట్రెచింగ్ వ్యాయామాలు వంటి సాధారణ నియమాలు పాటిస్తే చాలు. రాజ కుటుంబీకులు భోజనంతో పాటు ఒక గ్లాసు వైన్‌ కూడా తాగుతారు. క్వీన్ ఎలిజబెత్‌ ఉదయం ఒక జిన్ కాక్‌టెయిల్‌ను తీసుకుంటారు. ఆ తర్వాత భోజనంతోపాటు గ్లాస్‌ వైన్ లేదా షాంపైన్, సాయంత్రం మరో గ్లాసు షాంపైన్, డ్రై మార్టినీ సేవిస్తారు. నిజానికి, రోజూ ఒక గ్లాస్‌ వైన్ తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది. 3-4 గ్లాసులు తాగితే మాత్రం ఆరోగ్యానికి తీవ్ర హాని తలపెడుతుంది. అదే విధంగా స్మోకింగ్‌ కూడా చేయకూడదు. ఈ రెండు అలవాట్లులేనివారు సుదీర్ఘకాలం ఆరోగ్యంగా జీవిస్తారని డాక్టర్ జయంత ఠాకూరియా తెలిపారు.

ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?