- Telugu News Photo Gallery Reheating food causes cancer: Do Not Reheat Potatoes, Eggs, Rice and Spinach, They Can Be Toxic
Reheat Food: మిగిలిపోయిన అన్నం మళ్లీ వేడి చేసుకుని తింటున్నారా? ఈ విషయం తెలిస్తే ఇక ఎప్పటికీ అలా చేయరు..
సాధారణంగా ఇంట్లో తయారు చేసుకునే లేదా బయటి ఆహారాలు వండిన వెంటనే లేదా కొంత సమయం తర్వాత తింటుంటాం. మిగిలిపోయిన ఆహారాన్ని ఫ్రిజ్‌లో దాచుకుని మళ్లీ వేడిచేసుకుని తినే అలవాటు మనలో చాలా మందికి ఉంది. ఐతే ఇలా ఒకసారి వండిన ఆహారాన్ని..
Updated on: Sep 10, 2022 | 11:01 AM

సాధారణంగా ఇంట్లో తయారు చేసుకునే లేదా బయటి ఆహారాలు వండిన వెంటనే లేదా కొంత సమయం తర్వాత తింటుంటాం. మిగిలిపోయిన ఆహారాన్ని ఫ్రిజ్‌లో దాచుకుని మళ్లీ వేడిచేసుకుని తినే అలవాటు మనలో చాలా మందికి ఉంది. ఐతే ఇలా ఒకసారి వండిన ఆహారాన్ని మళ్లీ వేడి చేసి తింటే ఆరోగ్యానికి హాని కలిగించే విషంగా తయారవుతాయని మీకు తెలుసా? ముఖ్యంగా కొన్ని ఆహార పదార్థాలను మళ్లీ వేడి చేయడం వల్ల విషపూరితం అవుతాయని ఆరోగ్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. అవేంటో తెలుసుకుందాం..

పోషకాలు అధికంగా ఉండే గుడ్లను, వాటితో చేసిన ఆహార పదార్ధాలను మళ్లీ వేడి చేసి తింటే, ఆరోగ్యానికి హానితలపెట్టే విషంగా మారతుంది. గుడ్డుతో చేసిన వంటకాలను మళ్లీ వేడి చేయడం వల్ల దాని రుచి మారుతుంది కూడా.

రోజూ మనం తినే అన్నం, మిగిలిపోతే మళ్లీ వేడిచేసుకుని తినడం ఇక మీదట మానుకోవాలి. ఎందుకంటే దానిని మళ్లీ వేడి చేయడం వల్ల శరీరంలో విషంలా పనిచేస్తుంది.

ఆకు కూరల్లో పాలకూర చాలా స్పెషల్. ఎందుకంటే పాలకూరలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. పాలకూర పనీర్‌తో తయారు చేసిన వంటకాలను చాలా మంది ఇష్టంగా తింటారు. ఐతే పాలకూర పనీర్‌ను మళ్లీ వేడి చేసి తింటే క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుందని పరిశోధనలో తేలింది.

మన దేశంలో ప్రతి ఇంట్లో కనిపించే కూరగాయల్లో ఆలు కూడా ఒకటి. బంగాళాదుంపలను ఒకసారి ఉడికించిన తర్వాత మళ్లీ వేడి చేయడం ఆరోగ్యానికి హానికరమని నిపుణులు చెబుతున్నారు. ఇలా వేడిచేయడం మూలంగా క్లోస్ట్రిడియం బోటులినమ్ చర్య జరుగుతుంది. ఈ చర్యకు లోనైన బంగాళా దుంపలను తింటే ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపుతుంది.





























