ED raids: మొబైల్‌ యాప్‌ స్కామ్‌లో పట్టుబడ్డ కోట్ల రూపాయలు.. వారికి సంబంధించి ఆరు చోట్ల ఈడీ సోదాలు..

మొబైల్ గేమింగ్ యాప్ వినియోగదారులను మోసం చేసిన నిందితుడు అమీర్ ఖాన్, ఇతరులపై ఫెడరల్ బ్యాంక్ అధికారులు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో వారిపై మనీలాండరింగ్ కేసు నమోదు చేశారు.

ED raids: మొబైల్‌ యాప్‌ స్కామ్‌లో పట్టుబడ్డ కోట్ల రూపాయలు.. వారికి సంబంధించి ఆరు చోట్ల ఈడీ సోదాలు..
Ed Raids
Follow us
Jyothi Gadda

|

Updated on: Sep 10, 2022 | 5:52 PM

ED raids: మొబైల్‌ యాప్‌కు సంబంధించిన మోసం కేసులో కోల్‌కతాలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) 0దాడులు చేసింది. నిందితుల నివాసాల్లో విస్తృత సోదాలు చేపట్టింది. పశ్చిమ బెంగాల్‌ రాజధాని కోల్‌కతాకు చెందిన వ్యాపార వేత్త అమీర్‌ఖాన్‌కు చెందిన ఆరు ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులకు దిగింది. అధికారుల దాడులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. బ్యాంకు అధికారులతో కలిసి ఈడీ బృందం, గార్డెన్ రీచ్ ప్రాంతంలోని వ్యాపారవేత్త అమీర్ ఖాన్ నివాసంలో సోదాలు చేపట్టింది. రూ.7 కోట్ల నగదుతోపాటు పలు ఆస్తులకు సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకుంది ఈడీ. సుదీర్ఘంగా తనిఖీలు జరుగుతున్నాయి. సీజ్‌ చేసిన నగదు లెక్కింపు కోసం క్యాష్‌ కౌంటింగ్‌ మిషన్లను రప్పించారు ఈడీ అధికారులు.

‘ఈ-నగ్గెట్స్’ అనే మొబైల్ గేమింగ్ యాప్‌ను తయారు చేసి అమీర్‌ఖాన్‌, అతని అనుచరులు భారీ మోసానికి పాల్పడ్డారు. చాలా మంది నుండి డబ్బులు వసూలు చేసినట్టుగా ఆరోపణలు వచ్చాయి. తొలుత వినియోగదారులకు రివార్డులు, కమీషన్‌ ఇచ్చారు. బ్యాలెన్స్‌ డబ్బులను వ్యాలెట్‌ ద్వారా తీసుకునే సౌకర్యం కల్పించారు. దీంతో నమ్మకంతో యూజర్లు భారీగా కమీషన్ల కోసం పెద్ద ఎత్తున డబ్బులతో ఆర్డర్లు కొనుగోలు చేశారు. ఇలా ప్రజల నుంచి కోట్లలో డబ్బులు జమ అయిన తర్వాత ఒక్కసారిగా డబ్బులు విత్‌ డ్రాను నిలిపివేశారు. సిస్టమ్‌, సర్వర్‌ అప్‌గ్రేడ్‌ పేరుతో ప్రొఫైల్స్‌తోపాటు డాటా అంతా తొలగించారు. దీంతో మోసపోయినట్లు గ్రహించిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కాగా, మొబైల్ గేమింగ్ యాప్ వినియోగదారులను మోసం చేసిన నిందితుడు అమీర్ ఖాన్, ఇతరులపై ఫెడరల్ బ్యాంక్ అధికారులు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) కింద ఈడీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. ఇందులో భాగంగా శనివారం ప్రధాన నిందితుడైన వ్యాపారవేత్త అమీర్‌ ఖాన్‌ నివాసాలపై దాడులు చేసి కోట్లలో డబ్బులు, ఇతర ఆస్తుల పత్రాలు స్వాధీనం చేసుకుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఒకప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు సుప్రీం కోర్టు లాయర్
ఒకప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు సుప్రీం కోర్టు లాయర్
టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్
టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్
ఆ ప్రాంతంలో కుప్పలు కుప్పలుగా పేరుకుపోయిన మంచు..
ఆ ప్రాంతంలో కుప్పలు కుప్పలుగా పేరుకుపోయిన మంచు..
8 ఏళ్లకే పెళ్లి.. విడాకులు.. ముగ్గురు పిల్లల తల్లి.. మరో పెళ్లి
8 ఏళ్లకే పెళ్లి.. విడాకులు.. ముగ్గురు పిల్లల తల్లి.. మరో పెళ్లి
వార్నీ.. పట్టపగలు ఇదేం పాడు పనిరా బాబు..! హైవే పై స్తంభమెక్కిన
వార్నీ.. పట్టపగలు ఇదేం పాడు పనిరా బాబు..! హైవే పై స్తంభమెక్కిన
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?