AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Stray Dog Menace: వీధి కుక్కలు కరిస్తే బాధ్యత వారిదే.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..

పెంపుడు కుక్కలు ఎవరిపైనైనా దాడి చేస్తే.. వాటిని పెంచుకునే యజమాని దానికి బాధ్యత వహిస్తాడు. అదే వీధి శునకాలు దాడి చేస్తే దానికి ఎవరూ బాధ్యత వహించరు. అయితే కుక్కలు కరిస్తే ప్రభుత్వ ఆసుపత్రుల్లో..

Stray Dog Menace: వీధి కుక్కలు కరిస్తే బాధ్యత వారిదే.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..
Supreme court
Amarnadh Daneti
|

Updated on: Sep 10, 2022 | 5:44 PM

Share

Stray Dog Menace: పెంపుడు కుక్కలు ఎవరిపైనైనా దాడి చేస్తే.. వాటిని పెంచుకునే యజమాని దానికి బాధ్యత వహిస్తాడు. అదే వీధి శునకాలు దాడి చేస్తే దానికి ఎవరూ బాధ్యత వహించరు. అయితే కుక్కలు కరిస్తే ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా టీకాలు అందిస్తారు. సాధారణంగా వీధి కుక్కలు కరిస్తే పలానా వాళ్లు బాధ్యత అని ఏమి లేదు.వీధి కుక్కల బెదడ ఎక్కువైతే గ్రామాల్లో అయితే పంచాయతీ, పట్టణాలు, నగరాల్లో అయితే మున్సిపాల్టీ, కార్పోరేషన్ అధికారులు ఆకుక్కలను పట్టుకుని నిర్మానుష్య ప్రదేశంలో వదిలిపెడతారు. అయితే తాజా వీధి కుక్కలు ఎవరినైనా కరిచి గాయపరిస్తే వాటికి ఎవరు బాధ్యత వహించాలి అనేదానిపై  సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వీధి కుక్కలు ఎవరినైనా కరిస్తే ఇకపై వాటికి ఆహారం అందించే వారిదే బాధ్యత అని వ్యాఖ్యానించింది. కేరళలో ఇటీవలి కాలంలో కుక్కల దాడులు పెరిగిపోయిన అంశంపై విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. గత నాలుగు నెలల కాలంలో కేరళలో వీధి కుక్కల దాడుల కారణంగా ఏడుగురు మరణించగా, పదుల సంఖ్యలో గాయపడ్డారు. వీధి కుక్కల దాడులు పెరిగిపోతుండటంపై దాఖలైన వ్యాజ్యంపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ జేకే మహేశ్వరితో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.

వీధి కుక్కలు ఎవరినైనా కరిస్తే వారికి ఆహారం అందించే వారిదే బాధ్యతని, బాధితులకు జరిగే నష్టానికి కూడా బాధ్యత వహించాలని సూచించింది. బాధితులకు వ్యాక్సినేషన్ విషయంలో కూడా వారే బాధ్యత తీసుకోవాలని, వీధి కుక్కల్ని సంరక్షించే వారు వాటిని స్పెషల్‌గా మార్క్ చేయడమో లేదా నెంబర్లు వేయడమో చేయడం ద్వారా వాటి బాధ్యత తీసుకోవాలని ఆదేశాలు జారీచేసింది. వీధి కుక్కలు ఆహారం లేనప్పుడు లేదా ఏదైనా జబ్బు సోకినప్పుడు క్రూరంగా ప్రవర్తిస్తూ దాడులు చేస్తుంటాయి. ఇటీవలి కాలంలో అనేక కుక్కలు రేబిస్ బారిన పడుతున్నాయి. ఈనేపథ్యంలో అలాంటి కుక్కలను ప్రత్యేకంగా పరిరక్షించాలని కేరళ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సూచించింది. వీధి కుక్కల సంరక్షణ విషయంలో ప్రత్యేక చట్టం తీసుకురావాలని కూడా ప్రభుత్వానికి సూచించింది. వీధి కుక్కల్ని సంరక్షించడం ఎంత అవసరమో.. అమయాక ప్రజలు వాటి బారిన పడకుండా చూడటం కూడా అంతే అవసరమని అభిప్రాయపడింది. మరోవైపు.. వీధి కుక్కల సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని, మున్సిపల్, పంచాయతీల పరిధిలో ఉండే కుక్కలకు ఆహారం అందేలా చూస్తామని కేరళ ప్రభుత్వం కోర్టుకు తెలిపింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..