Narendra Modi: దేశం ఎదుగుదలను చూసి గర్వపడుతున్నా.. ప్రధానమంత్రి నరేంద్రమోదీ కీలక వ్యాఖ్యలు..

ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు శాస్త్ర, సాంకేతిక రంగాల్లో పరిశోధనలను క్షేత్ర స్థాయికి తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు. అందరికీ అందుబాటులో గృహలు, వ్యవసాయం..

Narendra Modi: దేశం ఎదుగుదలను చూసి గర్వపడుతున్నా.. ప్రధానమంత్రి నరేంద్రమోదీ కీలక వ్యాఖ్యలు..
Pm Narendra Modi
Follow us
Amarnadh Daneti

|

Updated on: Sep 10, 2022 | 3:04 PM

Centre-State Science Conclave: దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తోందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు. అహ్మదాబాద్ లోని సైన్స్ సిటీలో రెండు రోజుల సెంటర్-స్టేట్ సైన్స్ క్లాన్ కేవ్ ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన శనివారం ప్రారంభించారు. ఈసందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ.. గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ లో భారత్ 46వ స్థానానికి ఎదిగిందని.. 2015లో 81వ స్థానంలో ఉండగా.. అతి తక్కువ కాలంలో 25 స్థానాలు ఎగబాకిందని గుర్తుచేశారు. అన్ని రంగాల్లో దేశం అభివృద్ధి చెందుతున్న తీరు చూసి ఎంతో గర్వపడుతున్నానన్నారు ప్రధానమంత్రి నరేంద్రమోది. దేశాన్ని ప్రపంచ శాస్త్ర, సాంకేతిక కేంద్రంగా నిర్మించేందుకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు కలిసిపనిచేయాలన్నారు. శాస్త్ర వేత్తలకు అవసరమైన అన్ని సహాయ సహకారాలను అందించాలని, రాష్ట్రాల్లో అవసరం మేరకు సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్‌స్టిట్యూట్‌లను నిర్మించడంలో రాష్ట్రాలు తమ వంతు కృషి చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోరారు. రాష్ట్రాల్లోని ఉన్నత విద్యాసంస్థల్లో ఇన్నోవేషన్ ల్యాబ్‌ల సంఖ్యను పెంచాలన్నారు. శాస్త్రీయ పరిశోధనలను ప్రోత్సహించడం ద్వారా స్థానిక సమస్యలకు సైన్స్ ఆధారిత పరిష్కారాలను కనుగొనాల్సిన అవసరం ఉందన్నారు. 2014 నుంచి సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో గణనీయంగా పెట్టుబడులు పెరిగాయన్నారు. అన్ని రంగాల్లో భారత్ ను పరిశోధన, ఆవిష్కరణల ప్రపంచ కేంద్రంగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ కృషిచేయాలన్నారు.

ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు శాస్త్ర, సాంకేతిక రంగాల్లో పరిశోధనలను క్షేత్ర స్థాయికి తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు. అందరికీ అందుబాటులో గృహలు, వ్యవసాయం, ఆర్థిక వృద్ధికి శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాన్ని విరివిగా ఉపయోగించాలన్నారు. జై జవాన్, జై కిషన్, జై విజ్ఞాన్, జై అనుసంధాన్ అనే నినాదంతో నేటి నయా భారత్ ముందుకు సాగుతుందన్నారు. నేడు భారత్ నాల్గవ పారిశ్రామిక విప్లవానికి నాయకత్వం వస్తోందన్నారు. మన శాస్త్రవేత్తల విజయాలను పండుగగా జరుపుకోవాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ సూచించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి