AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Unemployment Rate in India: ఐదో ఎకానమీ దేశంగా దూసుకెళ్తున్న భారత్‌ను పట్టి పీడిస్తున్న ప్రధాన సమస్య అదే.. బీజేపీ హయాంలో మరింత దిగజారిన..

2014లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రికార్డు స్థాయిలో నిరుద్యోగ సమస్య పెరిగిపోయింది. తాము అధికారంలోకి వస్తే కోటి ఉద్యోగాలు కల్పిస్తామని 2014 ఎన్నికల్లో ప్రగడ్భాలు పలికి, అధికారంలోకి వచ్చాక ఆ ఊసే ఎత్తలేదు. ఇక 2019 సార్వత్రిక ఎన్నికల్లో తమ పార్టీకి ఓట్లు వేస్తే మరో అడుగు ముందుకేసి..

Unemployment Rate in India: ఐదో ఎకానమీ దేశంగా దూసుకెళ్తున్న భారత్‌ను పట్టి పీడిస్తున్న ప్రధాన సమస్య అదే.. బీజేపీ హయాంలో మరింత దిగజారిన..
Unemployment Rate
Srilakshmi C
|

Updated on: Sep 11, 2022 | 6:27 AM

Share

India slips down in UN Human Development Index: ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఎదుర్కొంటున్న ప్రధాన విమర్శల్లో కీలకమైనది నిరుద్యోగం. నిరుద్యోగ సమస్య అధికంగా ఉన్న హర్యానా, జమ్ము అండ్‌ కశ్మీర్‌ దేశాలు దేశ అభివృద్ధికి ప్రతిబంధకాలుగా మారాయి. 2014లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రికార్డు స్థాయిలో నిరుద్యోగ సమస్య పెరిగిపోయింది. తాము అధికారంలోకి వస్తే కోటి ఉద్యోగాలు కల్పిస్తామని 2014 ఎన్నికల్లో ప్రగడ్భాలు పలికి, అధికారంలోకి వచ్చాక ఆ ఊసే ఎత్తలేదు. ఇక 2019 సార్వత్రిక ఎన్నికల్లో తమ పార్టీకి ఓట్లు వేస్తే మరో అడుగు ముందుకేసి ఏకంగా 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. గురువారం (సెప్టెంబరు 8న) యునైటెడ్‌ నేషన్స్ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రాం (UNDP) విడుదల చేసిన తాజా మానవ అభివృద్ధి నివేదిక 2021-22 చూస్తే మన దేశంలో నిరుద్యోగ సమస్య ఏ స్థాయిలో ఉందో అవగతమవుతుంది. 2021-22లో 191 దేశాల్లో నిర్వహించిన సర్వేలో ప్రపంచదేశాల్లో ఐదో అతిపెద్ద అర్థిక దేశంగా ఎదుగుతున్న భారత్‌ ర్యాంక్‌ 132కు పడిపోయింది. ఇక మన దాయాది దేశాల్లో పరిస్థితి మరీ అద్వాన్నంగా ఉంది. నేపాల్‌ 143 ర్యాంక్‌, పాక్‌ 161 ర్యాంకుల్లో ఉన్నా.. ఇదేమీ ఓదార్పునిచ్చే విషయంకానేకాదు. మన పొరుగుదేశాల లిస్టులో ఉన్న భూటాన్‌, బంగ్లాదేశ్‌లు మాత్రం మనకంటే ఎంతో బెటర్‌గా ఉన్నాయి. వరుసగా 127 , 129 స్థానాల్లో భారత్‌ కన్నా పై ర్యాంకుల్లో నిలిచాయి.

దేశాన్ని పాలిస్తున్న మోదీ ప్రభుత్వం 2014లో అధికారంలోకి వచ్చినప్పుడు నిరుద్యోగిత రేటు 5.44 శాతంగా ఉండగా.. 2015లో 5.44 శాతం వద్ద ఉన్నా తర్వాత నాలుగేళ్లపాటు ఇదే విధంగా నత్తనడకన కొనసాగింది. 2019లో కోవిడ్‌ కారణంగా ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. డిమాండ్‌-సప్లై గొలుసు దెబ్బతినడం, కార్మికుల వలస ఇతర కారణాల రిత్య 2020 నాటికి నిరుద్యోగ సమస్య 8 శాతానికి పెరిగింది. 2021లో 2.02 శాతం పుంజుకుని 5.98 శాతానికి క్షీణించింది. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో నిరుద్యోగిత రేటు ఏకంగా 12.6 శాతం నమోదైంది. సాధారణంగా నిరుద్యోగం రేటుతో పాటు లింగం, సామాజిక అసమానతలన కూడా దేశ అభివృద్ధికి ప్రతిబంధకాలుగా పరిగణిస్తాం. లింగ అసమానత సూచిలో 170 దేశాలతో పోల్చితే మన దేశం 122వ స్థానంలో ఉంది. తాజా మానవాభివీద్ధి సూచిక (UNDP)లో ఓదార్పు నిచ్చే విషయం ఇదొక్కటే.

ప్రపంచంలోని టాప్‌ 6 ఆర్థిక వ్యవస్థల్లోని నిరుద్యోగిత రేటును పరిశీలిస్తే.. టాప్‌ 1 దేశమైన అమెరికాలో నిరుద్యోగిత రేటు 3.7 శాతంగా ఉండగా, రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ ఉన్న చైనాలో 5.40 శాతం. మూడో స్థానంలో ఉన్న జపాన్‌ 2.60 శాతం, జర్మనీలో ఇది 1.90 శాతం, యూకేలో నిరుద్యోగిత రేటు 3.80 శాతం ఉన్నాయి. ప్రపంచంలోని ఏడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిఉన్న ఫ్రాన్స్‌లో నిరుద్యోగిత రేటు 7.40 శాతం, ఎనిమిదో ఆర్థిక వ్యవస్థ కలిగిన కెనడాలో 4.90 శాతం, తొమ్మిదవ ఆర్థిక వ్యవస్థ ఉన్న ఇటలీలో 8.1 శాతం, పదవ ఆర్థిక వ్యవస్థ ఉన్న బ్రెజిల్‌లో నిరుద్యోగిత రేటు 9.10 శాతంగా ఉంది. ఈ దేశాలతోపోల్చితే మనదేశ నిరుద్యోగ రేటు మరీ దారుణమైన స్థితిలో ఉన్నట్లు అనిపించదు. ఐతే వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా పేరుగాంచిన భారత్‌కు మాత్రం ఇది గొడ్డలి పెట్టు వంటిదే. 2029 నాటికి భారత్‌ మూడో అతిపెద్ద ఎకానమీ కలిగిన దేశంగా అవతరించవచ్చని అంచనా. ఐతే ఇది సాధ్యపడాలంటే మన దేశ నిరుద్యోగ ర్యాంక్‌ మెరుగుపడవల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ఇవి కూడా చదవండి

రాష్ట్రాల వారీగా చూస్తే.. అగ్రికల్చర్‌ స్టేట్‌గా పేరుగాంచిన హర్యానాలో నిరుద్యోగం రేటు అత్యధికంగా 37.3 శాతంగా ఉంది. దీని తర్వాత స్థానాల్లో జమ్మూ, కాశ్మీర్‌లో 32.8 శాతం, రాజస్థాన్‌లో 31.4 శాతంతో అత్యధిక నిరుద్యోగం ఉన్న రాష్ట్రాలుగా నిలిచాయి. అన్ని రంగాల్లో పురోగతి సాధించినప్పుడే భారత్‌ ముందుకు అడుగులు వేయగలదనేది జగమెరిగిన సత్యం. ఆ దిశగా ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటే మానవాభివృద్ధి సూచికలో మన ర్యాంక్‌ మెరుగుపడుతుంది.