Lumpy Skin Disease: ఆ రాష్ట్రంలో హడలెత్తిస్తున్న లంపి చర్మ వ్యాధి.. 10 జిల్లాలోని పశువులకు వ్యాపించిన ఇన్ఫెక్షన్

రాష్ట్రంలోని 10 జిల్లాల్లో 2,171 పశువులు ఈ వ్యాధి బారిన పడ్డాయి. వీటిలో 1,717 జంతువుల ఆరోగ్యం మెరుగుపడింది. ఇప్పటివరకు 77, 534 జంతువులకు టీకాలు వేసినట్లు ఒక అధికారి తెలిపారు.

Lumpy Skin Disease: ఆ రాష్ట్రంలో హడలెత్తిస్తున్న లంపి చర్మ వ్యాధి.. 10 జిల్లాలోని పశువులకు వ్యాపించిన ఇన్ఫెక్షన్
Lumpy Skin Disease In Mp
Follow us
Surya Kala

|

Updated on: Sep 10, 2022 | 1:36 PM

Lumpy Skin Disease: పశువులకు సోకే లంపి చర్మ వ్యాధి మధ్య ప్రదేశ్ లో రోజు రోజుకీ వ్యాపిస్తోంది.  ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 10 జిల్లాల్లో 2,100 కంటే ఎక్కువ పశువులకు లంపి చర్మ వ్యాధి సోకినట్లు అధికారులు పేర్కొన్నారు. దీంతో రాష్ట్రంలోని ప్రభావిత ప్రాంతాల్లో గోవు, జంతువుల రవాణాను నిషేధించాలని అధికారులు పేర్కొన్నారు. లంపి చర్మ వ్యాధి .. అంటువ్యాధి వ్యాప్తి కారణంగా ఉత్పన్నమయ్యే పరిస్థితిని ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఇప్పటికే సమీక్షించారు. అధికారులతో అనేక విషయాలను చర్చించి.. ఇతర రాష్ట్రాల నుండి మధ్యప్రదేశ్ కు తీసుకువస్తున్న పశువులను నిషేధించాలని.. అదనపు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

వ్యాధి ప్రభావిత జిల్లాల పరిసర ప్రభావిత ప్రాంతాల్లో, జిల్లాల్లో పశువుల రవాణాను అధికారులు ఇప్పటికే నిషేధించారు. పశువులను ప్రభావితం చేసే ఈ అంటు వైరల్ వ్యాధి ప్రధాన లక్షణాలు జ్వరం, అవయవాలతో పాటు జననేంద్రియాల వాపు, కళ్లలో నీరు కారడం, రినైటిస్, లాలాజల స్రావాలు పెరగడం, చర్మంపై పొక్కులు రావడం అని అధికారులు చెప్పారు. ఈ వ్యాధి దోమలు, ఈగలు, పేలు వంటి కీటకాలు కుట్టడం ద్వారా వ్యాపిస్తుందని..  వ్యాధి సోకిన జంతువుతో మరొక జంతువుతో సన్నిహితంగా ఉంటే ఇది వ్యాపిస్తుందని పేర్కొన్నారు.

రత్లాం, ఉజ్జయిని, మందసౌర్, నీముచ్, బేతుల్, ఇండోర్, ఖాండ్వా జిల్లాల్లో ఈ వ్యాధి నిర్ధారణ అయినట్లు అధికారులు తెలిపారు. ధార్, బుర్హాన్‌పూర్, ఝబువాలోని జంతువులలో కూడా ఈ వ్యాధి లక్షణాలు నమోదయ్యాయని చెప్పారు.

ఇవి కూడా చదవండి

రాష్ట్రంలోని 10 జిల్లాల్లో 2,171 పశువులు ఈ వ్యాధి బారిన పడ్డాయి. వీటిలో 1,717 జంతువుల ఆరోగ్యం మెరుగుపడింది. ఇప్పటివరకు 77, 534 జంతువులకు టీకాలు వేసినట్లు ఒక అధికారి తెలిపారు.

రాజస్థాన్, గుజరాత్, పంజాబ్, హర్యానా, మహారాష్ట్ర, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్మూ-కాశ్మీర్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఢిల్లీలో ఈ వ్యాధి వ్యాప్తి చెందింది. వ్యాధి అంటువ్యాధి కనుక వ్యాధి వ్యాప్తి చెందకుండా నివారణ చర్యలు చేపట్టాలని.. గోశాలల సరైన పరిశుభ్రతతో పాటు వ్యాధి సోకిన జంతువుల నుండి ఆరోగ్యకరమైన జంతువులను వేరు చేయడం వంటి నివారణ చర్యలు తీసుకోవడం చాలా ముఖ్యం అని నిపుణులు తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?