Viral: పైకి చూస్తే స్వీట్ బాక్స్.. లోపల చూస్తే మైండ్ బ్లాంక్.. వీడియో వైరల్!
తొలుత ఆ బ్యాక్సుల్లో స్వీట్స్ ఉన్నాయని అనుకున్న అధికారులు.. వాటి బరువు కొంచెం తేడాగా ఉండటంతో స్కానింగ్..
కేటుగాళ్ల క్రియేటివిటీ పెరిగిపోతోంది. పోలీసులకు దొరక్కుండా అక్రమ రవాణాను యదేచ్చగా చేసేస్తున్నారు. అయితే పోలీసులు ఏమైనా తక్కువ.. ఎక్కడిక్కడే అక్రమార్కులను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంటూ ఇచ్చిపడేస్తున్నారు. తాజాగా ఓ ప్రయాణీకుడు అక్రమంగా తీసుకెళ్తున్న విదేశీ కరెన్సీని కస్టమ్స్ అధికారులు, పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆ కేటుగాడు డబ్బును ఎక్కడ పెట్టాడో చూస్తే మీరూ ఆశ్చర్యపోతారంతే.!
వివరాల్లోకి వెళ్తే.. ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ ప్రయాణీకుడు దగ్గర నుంచి సుమారు రూ. 54 లక్షలు విలువ చేసే సౌదీ కరెన్సీని కస్టమ్స్ అధికారులు, పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన తనిఖీల్లో పట్టుకున్నారు. సదరు ప్రయాణీకుడు ఆ డబ్బును స్వీట్ బాక్స్‌లో దాచిపెట్టాడు. అది కూడా బయటికి కనిపించకుండా ఉండేందుకు ప్యాకింగ్ బాక్స్ చుట్టూ ఉండే లేయర్స్ మధ్యలో ఈ నగదును పెట్టాడు. తొలుత ఆ బ్యాక్సుల్లో స్వీట్స్ ఉన్నాయని అనుకున్న అధికారులు.. వాటి బరువు కొంచెం తేడాగా ఉండటంతో స్కానింగ్ చేయగా.. అసలు విషయం బయటపడింది. డబ్బును ప్యాకింగ్ బాక్స్ చుట్టూ ఉన్న లేయర్స్‌లో అతడు దాచిపెట్టిన తీరు గమ్మత్తుగా ఉండటమే కాదు.. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
View this post on Instagram