AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anand Mahindra: బెంగళూరు రోడ్లపై బుల్డొజర్ల ప్రయాణం.. వరద విలయంతో ఉద్యోగుల ఇక్కట్లు.. ఆనంద్‌ మహీంద్ర షేర్‌ చేసిన వీడియో

పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ఈ వీడియోను ట్విట్టర్‌లో షేర్‌ చేశారు. బెంగళూరులోని బెల్లందూర్‌లో బుల్‌డోజర్‌ ముందు భాగంలో ఉన్న వ్యక్తులు మునిగిపోయిన వంతెనను దాటుతున్నట్లు వీడియోలో కనిపించింది.

Anand Mahindra: బెంగళూరు రోడ్లపై బుల్డొజర్ల ప్రయాణం.. వరద విలయంతో ఉద్యోగుల ఇక్కట్లు.. ఆనంద్‌ మహీంద్ర షేర్‌ చేసిన వీడియో
Anand Mahindra
Jyothi Gadda
|

Updated on: Sep 10, 2022 | 6:57 PM

Share

Bengaluru floods: ఆదివారం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు బెంగళూరు రోడ్లన్నీ నదులుగా మారాయి. మరికొన్ని రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రస్తుత పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందని నగరవాసులు భయాందోళనకు గురవుతున్నారు. బెంగళూరు ప్రజలు గతంలో ఎన్నాడూ ఎదుర్కొని విపత్కర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. నదులపై పారుతున్న వరదల్లోంచి బుల్‌డోజర్‌పై కూర్చుని జనాలు వీధుల్లో తిరుగుతున్న దృశ్యాలు నెట్టింట హల్‌చల్‌ చేస్తున్నాయి. సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్న ఈ వీడియోను ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్‌ మహింద్రా రీట్విట్‌ చేశారు. అదేంటో ఇప్పుడు చూద్దాం…

పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ఈ వీడియోను ట్విట్టర్‌లో షేర్‌ చేశారు. బెంగళూరులోని బెల్లందూర్‌లో బుల్‌డోజర్‌ ముందు భాగంలో ఉన్న వ్యక్తులు మునిగిపోయిన వంతెనను దాటుతున్నట్లు వీడియోలో కనిపించింది. స్థానికులు ఉపయోగించిన సృజనాత్మకతకు మహీంద్రా అంతులేని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

చక్కగా ఉద్యోగస్తుల వేషధారణలో ఉన్నారు ఆ ప్రయాణికులు..పైగా వారు బ్యాగ్‌లు వెంటపట్టుకుని ఉన్నారు. నీట్‌గా రెడి వెళ్తున్న జనాలు.. వీడియోలో కనిపించడం చూస్తుంటే వారు మెగా ఐటీ హబ్‌లోని ఏదో ఒక కార్యాలయంలో పని చేసేందుకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. బుల్‌డోజర్ నెమ్మదిగా నీళ్లలో వెళుతున్నప్పుడు వారిలో ఒకరు బెంగళూరు రోడ్లపై ప్రవహిస్తున్న వరద దృశ్యాలను తమ సెల్‌ఫోన్లతో వీడియో తీస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారింది.

వీడియోను పంచుకుంటూ.. ట్విట్టర్ వినియోగదారు బెంగళూరును అందుకే ఇన్నోవేషన్ హబ్‌ అని పిలుస్తారు..అంటూ క్యాప్షన్‌ ఇచ్చారు. ఇక ఇదే వీడియోను రీట్వీట్ చేస్తూ, ఆనంద్‌ మహీంద్రా ఇలా అన్నారు.. ఎక్కడ సంకల్పం ఉంటుందో అక్కడ ఏదో ఒక మార్గం ఉంటుంది. అంటూ ఈ వీడియోకి క్యాప్షన్‌ ఇచ్చారు. మొత్తానికి ఐటీ హబ్‌గా పిలువబడే బెంగళూరు పట్టణం ఇప్పుడు వరద విలయంతో విలవిలలాడుతోంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే అనేక వీడియోలో వైరల్‌ అవుతున్నాయి.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి