Viral News: చర్మ వ్యాధితో అమ్మ మృతి.. ఆఖరీ మజిలీకి ఎవరూ రాని పరిస్థితి.. ఆ కొడుకు ఏం చేశాడంటే..?
మార్గ మధ్యలో ఓ అమ్మవారి గుడిని దాటుతుండగా.. అక్కడి సీసీ కెమెరాలో ఈ హృదయ విదారక దృశ్యాలు నమోదయ్యాయి. ఇప్పుడు ఈ సంఘటన సోషల్ మీడియాలో చేరి మరింతగా వైరల్ అవుతుంది.

Viral News: చర్మ వ్యాధితో మృతిచెందిన తల్లికి అంత్యక్రియలు చేసేందుకు ఓ 45ఏళ్ల కొడుకు పడరాని పాట్లుపడ్డాడు. సాయం చేసే నాధులు లేకపోవటంతో తల్లి మృతదేహాన్ని వీల్‌ఛైర్‌లో తీసుకెళ్లి దహన సంస్కారాలు నిర్వహించాడు. మార్గ మధ్యలో ఓ అమ్మవారి గుడిని దాటుతుండగా.. అక్కడి సీసీ కెమెరాలో ఈ హృదయ విదారక దృశ్యాలు నమోదయ్యాయి. ఇప్పుడు ఈ సంఘటన సోషల్ మీడియాలో చేరి మరింతగా వైరల్ అవుతుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
తమిళనాడులోని తిరుచ్చిలో విషాద సంఘటన చోటు చేసుకుంది. తిరుచ్చి జిల్లా మనపరైలోని భారతీయర్ నగర్‌లో నివసిస్తున్నాడు పెరియస్వామి.. అతని భార్య రాజేశ్వరి. 74 రాజేశ్వరి నాలుగేళ్ల క్రితం నుండి చర్మవ్యాధితో బాధపడుతుంది. ఈ నేపథ్యంలో తన కుమారుడైన మురుగానందం ఇంటికి చేరుకుంది. అనారోగ్యం కారణాలతో గత గురువారం ఉదయం రాజేశ్వరి మృతి చెందింది. తల్లి మరణం, చర్మవ్యాధితో బాధపడుతున్న వృద్ధురాలికి అంత్యక్రియలు చేసేందుకు ఎవరూ రారని భావించిన ఆ కొడుకు తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. చనిపోయిన తల్లిని ఇంటి నుంచి వీల్ చైర్ పై కూర్చోబెట్టి సేవాలూరు ప్రాంతంలోని శ్మశానవాటికకు తరలించేందుకు ఏర్పాట్లు చేసుకున్నాడు. దాదాపు 4 కిలోమీటర్ల దూరం వీల్ ఛైర్‌ను తోసుకుంటూ వెళ్లాడు.





అయితే, స్థానికంగా ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్న మురుగానందం తన తల్లి మృతదేహాన్ని వీల్‌ఛైర్‌లో నాలుగు కిలోమీటర్ల దూరం మోసుకెళ్లగలిగాడు. కానీ, శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించడానికి కూడా డబ్బులు లేక ఇబ్బంది పడ్డాడు. మురుగానందం పరిస్థితి చూసిన అక్కడి సిబ్బంది ఉన్నతాధికారులకు తెలియజేశారు. దాంతో మున్సిపల్ కార్పొరేషన్, NGOలు సహాయం చేయడానికి ముందుకు వచ్చాయి. మునిసిపల్ శ్మశానవాటికలో అతని తల్లి మృతదేహానికి దహన సంస్కారాలు పూర్తి చేశారు.వీల్ ఛైర్‌లో తల్లి మృతదేహాన్ని తరలిస్తుండగా సీసీటీవీ ఫుటేజీ సోషల్ మీడియాలో సంచలనం రేపుతోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
