AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పిల్ల పాములతోనే పెద్ద ముప్పా.. అధ్యయనంలో విస్తుపోయే విషయాలు..

పెద్ద పాము కంటే పిల్ల పాము కాటు వేస్తేనే ప్రాణాలకు ఎక్కువ ముప్పా? చిన్న పాముల్లో విషం ఎక్కువ ఉంటుందనే ప్రచారంలో నిజమెంత? దాదాపు 60 ఏళ్లుగా ప్రపంచవ్యాప్తంగా నమ్ముతున్న ఈ భయంకరమైన నమ్మకంపై శాస్త్రవేత్తలు బాంబు పేల్చారు. అసలు పిల్ల పాము కాటు వెనుక ఉన్న అసలు నిజాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

పిల్ల పాములతోనే పెద్ద ముప్పా.. అధ్యయనంలో విస్తుపోయే విషయాలు..
Are Baby Rattlesnakes More Dangerous
Krishna S
|

Updated on: Aug 16, 2026 | 7:10 PM

Share

పెద్ద పాముల కంటే పిల్ల పాములే చాలా ప్రమాదకరం.. అవి విషాన్ని నియంత్రించలేక కాటు వేసినప్పుడు మొత్తం విషాన్ని ఒకేసారి శరీరంలోకి ఎక్కిస్తాయి.. తరతరాలుగా ప్రచారంలో ఉన్న ఈ ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని తేలింది. సుమారు ఆరు దశాబ్దాలుగా ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న ఈ నమ్మకం కేవలం ఒక కట్టుకథ మాత్రమేనని కాలిఫోర్నియాలోని లోమా లిండా యూనివర్సిటీ పరిశోధకులు స్పష్టం చేశారు.

ఎలా మొదలైందీ ప్రచారం?

1967 ప్రాంతంలో మీడియా కథనాల ద్వారా పిల్ల రాటిల్‌స్నేక్‌లపై ఈ పుకార్లు మొదలయ్యాయి. 1970 నుంచి 1990ల మధ్య ఉత్తర అమెరికా అంతటా ఈ ప్రచారం విస్తృతంగా పాకింది. సరైన శాస్త్రీయ ఆధారాలు లేకుండా పోలీస్, ఫైర్ విభాగాల అధికారుల మాటలను ప్రసారం చేయడంతో ప్రజల్లో తప్పుడు అభిప్రాయం స్థిరపడిపోయింది. యూనివర్సిటీ ప్రొఫెసర్ విలియం హేస్ నిర్వహించిన సర్వే ప్రకారం.. నేటికీ 53శాతం మంది విద్యార్థులు, 73శాతం మంది అత్యవసర వైద్య సిబ్బంది ఈ అపోహనే నిజమని నమ్ముతున్నారు.

శాస్త్రవేత్తలు తేల్చిన వాస్తవాలు ఇవే

పెద్ద పాముల్లాగే పిల్ల పాములు కూడా తాము విడుదల చేసే విష పరిమాణాన్ని పూర్తిగా నియంత్రించగలవు. శరీర పరిమాణం, విష గ్రంథులు పెద్దవిగా ఉండటం వల్ల పెద్ద పాములు కాటు వేసినప్పుడే ఎక్కువ మోతాదులో విషం విడుదలవుతుంది. వీటి కాటుతోనే తీవ్రమైన లక్షణాలు, అత్యవసర చికిత్స అవసరం ఏర్పడుతుంది. పిల్ల పాములు కుట్టినప్పుడు రోగులు, వారి కుటుంబాలు అనవసర భయంతో వైద్యులపై ఒత్తిడి తెచ్చి మితిమీరిన చికిత్సలు చేయించుకుంటున్నారని అధ్యయనంలో వెల్లడైంది.

అనవసర భయంతో అంతరించిపోతున్న పాములు

ఈ తప్పుడు ప్రచారాల కారణంగా ట్రెక్కింగ్, అటవీ ప్రాంతాలకు వెళ్లేవారు భయంతో చిన్న పాములను కనిపిస్తే చంపేస్తున్నారు. పర్యావరణ సమతుల్యతలో కీలక పాత్ర పోషించే రాటిల్‌స్నేక్స్ సంఖ్య ఇప్పటికే భారీగా పడిపోయింది. భయం కంటే వాస్తవాలపై అవగాహన పెంచుకోవాలని, చిన్న పాములు కనిపించినంత మాత్రాన వాటిని చంపాల్సిన అవసరం లేదని పరిశోధకులు సూచిస్తున్నారు. ప్రకృతిలో ఎదురయ్యే ప్రమాదాల కంటే, మనసులో ఉండే నిరాధారమైన పుకార్లే ఎక్కువ నష్టాన్ని కలిగిస్తాయని ఈ అధ్యయనం గుర్తుచేస్తోంది.

Follow Us
పిల్ల పాములతోనే పెద్ద ముప్పా.. అధ్యయనంలో విస్తుపోయే విషయాలు..
పిల్ల పాములతోనే పెద్ద ముప్పా.. అధ్యయనంలో విస్తుపోయే విషయాలు..
అప్పుల నుంచి బయటపడే సీక్రెట్‌ మీకు తెలుసా..?
అప్పుల నుంచి బయటపడే సీక్రెట్‌ మీకు తెలుసా..?
పరువు పోయేలా ఉంది, ఆ ఇద్దరిని వెంటనే పీకేయండి
పరువు పోయేలా ఉంది, ఆ ఇద్దరిని వెంటనే పీకేయండి
తినడానికి తిండి లేక రియల్ ఎస్టేట్ ఏజెంట్‌గా మారిన క్రికెటర్!
తినడానికి తిండి లేక రియల్ ఎస్టేట్ ఏజెంట్‌గా మారిన క్రికెటర్!
బాప్ రే.. నిద్రలో ఉన్న వ్యక్తిపై పాకుతున్న నాగుపాము:వీడియో వైరల్
బాప్ రే.. నిద్రలో ఉన్న వ్యక్తిపై పాకుతున్న నాగుపాము:వీడియో వైరల్
తోటకూర వీళ్లకు యమడేంజర్ తింటే ఏం జరుగుతుందో తెలిస్తే..
తోటకూర వీళ్లకు యమడేంజర్ తింటే ఏం జరుగుతుందో తెలిస్తే..
హైదరాబాద్‌ వాసులకు అలర్ట్‌..సోమవారం ఈ ప్రాంతాల్లో నీటి సరఫరా బంద్
హైదరాబాద్‌ వాసులకు అలర్ట్‌..సోమవారం ఈ ప్రాంతాల్లో నీటి సరఫరా బంద్
అందుకే రైతులకు డబ్బులు ఇవ్వలేదు: బిగ్‌బాస్‌ విజేత పల్లవి ప్రశాంత్
అందుకే రైతులకు డబ్బులు ఇవ్వలేదు: బిగ్‌బాస్‌ విజేత పల్లవి ప్రశాంత్
దూసుకొస్తున్న గండం.. ఏపీలో సోమవారం వాతావరణం ఎలా ఉంటుంది..?
దూసుకొస్తున్న గండం.. ఏపీలో సోమవారం వాతావరణం ఎలా ఉంటుంది..?
ఛీ, ఇంత స్వార్థపరుడనుకోలే.. మనోడు కూడా మోసం చేస్తాడనుకోలే..
ఛీ, ఇంత స్వార్థపరుడనుకోలే.. మనోడు కూడా మోసం చేస్తాడనుకోలే..