Viral News : ఈ నాన్న రియల్ హీరో.. కిడ్నాప్ అయిన కూతురి కోసం సినిమాను మించి చేశాడు..

పోలీసులు, పొరుగువారి సహాయంతో నిందితుడి ఇంటి అడ్రస్‌, ఫోన్‌ నంబర్‌ సంపాదించాడు. యువకుడి కుటుంబ సభ్యులకు ఫోన్‌ చేసి మాట్లాడాడు. వివరాలు ఆరా తీశాడు.  అక్కడి స్థానికులు, పోలీసుల సహాయంతో కుమార్తెను రక్షించుకున్నాడు.

Viral News : ఈ నాన్న రియల్ హీరో.. కిడ్నాప్ అయిన కూతురి కోసం సినిమాను మించి చేశాడు..
Police
Follow us

|

Updated on: Sep 10, 2022 | 9:43 PM

ప్రముఖ హాలీవుడ్ థ్రిల్లర్ మూవీ ‘టేక్’ చూశారా? అవును.. అయితే, ఆ సినిమాలో తన కుమార్తె కిడ్నాప్‌కు గురికావటంతో కలత చెందిన ఆ తండ్రి(నటుడు లియామ్ నీసన్ )ఆమెను ఇంటికి తీసుకురావడానికి ఎలా వెళ్లాడో మీరు గుర్తుకుతెచ్చుకోండి… ధైర్యం, తండ్రి ప్రేమకు నిదర్శనం ఈ కథాంశం..ఇదే కథలో మాదిరిగానే.. ముంబైలో ఓ నిజ సంఘటన జరిగింది. ముంబైలోని సబర్బన్ బాంద్రాలోని ఆమె ఇంటి దగ్గర నుండి కిడ్నాప్‌కుగురైంది. 24 ఏళ్ల షాహిద్ ఖాన్, బాంద్రాలోని గార్మెంట్స్ తయారీ కర్మాగారంలో పని చేస్తున్నాడు. ఈ నెల 4న అదే ప్రాంతానికి చెందిన 12 ఏళ్ల బాలికను కిడ్నాప్‌ చేశాడు.

మాయ మాటలు చెప్పి తన బాలికను తన వెంట తీసుకెళ్లిన ఆ యువకుడు ఆమెను కుర్లాకు తీసుకెళ్లాడు. అక్కడి నుంచి సూరత్‌ వెళ్లే బస్సు ఎక్కారు. అనంతరం రైలులో ఢిల్లీ చేరుకున్నారు. ఆ తర్వాత ఉత్తరప్రదేశ్‌ అలీఘడ్‌ సమీపంలోని ఐత్రోలి గ్రామానికి ఆ బాలికను అతడు తీసుకెళ్లాడు.

ఇదిలా ఉంటే, ఇంటి నుంచి బయటకు వెళ్లిన కుమార్తె తిరిగి రాకపోవడంతో ఆమె తల్లిదండ్రులు ఆందోళన చెందారు. బాలిక ఆచూకీ లేకపోవడంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, రోజు వారీ కూలీ అయిన తండ్రి, తన కుమార్తె ఆచూకీ కనిపెట్టేందుకు ‘టేకెన్’ మూవీ తరహాలో చాలా ప్రయత్నించాడు. చుట్టుపక్కల వారిని, తెలిసిన వారిని ఆరా తీశాడు. చివరకు తన కూతురు కిడ్నాప్‌ అయినట్టుగా గుర్తించాడు.. షాహిద్ ఖాన్ తన గ్రామానికి బాలికను తీసుకెళ్లినట్లు ఆమె తండ్రి తెలుసుకున్నాడు.

ఇవి కూడా చదవండి

పోలీసులు, పొరుగువారి సహాయంతో నిందితుడి ఇంటి అడ్రస్‌, ఫోన్‌ నంబర్‌ సంపాదించాడు. యువకుడి కుటుంబ సభ్యులకు ఫోన్‌ చేసి మాట్లాడాడు. వివరాలు ఆరా తీశాడు.  అక్కడి స్థానికులు, పోలీసుల సహాయంతో కుమార్తెను రక్షించుకున్నాడు. నిందితుడు ఆమెపై బస్సులో లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆరోపించి ఈ మేరకు కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశాడు. కిడ్నాప్‌ చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతనిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. బాధితుల వాంగ్మూలాన్ని నమోదు చేసిన తర్వాత మరిన్ని సెక్షన్లు జోడించబడతాయని నిర్మల్ నగర్ పోలీస్ స్టేషన్ అధికారి ఒకరు తెలిపారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Latest Articles