AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: లవ్ కు ఏజ్ తో పనేంటి గురూ.. ఆమెకు 31.. అతనికి 67.. రీల్ సీన్ కాదండోయ్ రియల్ సీనే..

ప్రేమ (Love).. పలికేందుకు, రాసేందుకు రెండు అక్షరాలే. కానీ ఇది సృష్టించే హంగామా అంతా ఇంతా కాదు. ఎలా మొదలవుతుందో, ఎక్కడి నుంచి పుడుతుందో తెలియని ప్రేమ రెండు జీవితాలను ఒక్కటి చేస్తుంది. ఖండాంతరాల అవతల ఉన్నా,..

Viral: లవ్ కు ఏజ్ తో పనేంటి గురూ.. ఆమెకు 31.. అతనికి 67.. రీల్ సీన్ కాదండోయ్ రియల్ సీనే..
love
Ganesh Mudavath
|

Updated on: Sep 10, 2022 | 9:29 PM

Share

ప్రేమ (Love).. పలికేందుకు, రాసేందుకు రెండు అక్షరాలే. కానీ ఇది సృష్టించే హంగామా అంతా ఇంతా కాదు. ఎలా మొదలవుతుందో, ఎక్కడి నుంచి పుడుతుందో తెలియని ప్రేమ రెండు జీవితాలను ఒక్కటి చేస్తుంది. ఖండాంతరాల అవతల ఉన్నా, పక్కనే ఉన్న అలజడి సృష్టిస్తుంది. కావాల్సింది సాధించుకునేంత వరకు తన విశ్వరూపాన్ని చూపిస్తుంది. అంతే కాకుండా అంతు చిక్కని అనుబంధాన్ని ఇద్దరి మధ్య కలిగిస్తుంది. ఒకరినొకరు విడిచి ఉండలేనంతగా మనసులను పెనవేస్తుంది. ప్రేమ కుల, మత, ప్రాంత బేధాలు చూడదు. కొన్ని సందర్భాల్లో వయసు తేడాను పట్టించుకోదు. వయసు పెద్దదైనా, చిన్నదైనా ప్రేమ చిగురిస్తుంది. తాజాగా అమెరికాలో (America) ఇలాంటి ఘటనే జరిగింది. 31 ఏళ్ల వయసున్న మహిళ 67 ఏళ్ల వ్యక్తితో ప్రేమలో పడింది. అంతే కాకుండా త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించింది ఈ జంట.. అమెరికాలోని అట్లాంటా ప్రాంతానికి చెందిన డామియా అనే మహిళ 31 ఏళ్ల వయసులో 67 ఏళ్ల వ్యక్తితో ప్రేమలో పడింది. అతనినే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. ఒంటరి జీవితాన్ని భరించలేకపోతున్నానని, తనతో డేటింగ్ చేసేందుకు ముందుకు రావాలని ఆమె ఫేస్ బుక్ లో ఓ పోస్ట్ పెట్టింది. తనకు ఆర్థిక సహాయం చేసేందుకు, జీవితంలో స్థిరంగా సురక్షితంగా ఉండేందుకు 50 ఏళ్లు పై బడిన పురుషుడు కావాలని స్టోరీలో వివరించింది.

ఈ కథనాన్ని చూసిన జేమ్స్ పార్కర్ తన 67 ఏళ్ల వయసులో ఆమెతో డేటింగ్ చేసేందుకు సిద్ధమయ్యాడు. అంతే కాకుండా ఆమె కోసం ఏకంగా రూ.37 లక్షలు విలువైన కారును కొనుగోలు చేశాడు. వారి మధ్య ఏర్పడిన పరిచయం సాన్నిహిత్యంగా మారింది. ఈ జంట 2017 నవంబర్ లో డేటింగ్ ప్రారంభించారు. పార్కర్ తనకు సహాయం చేశాడని, ఎక్కువ సమయం గడపడం వల్ల ఇద్దరికీ ఒకరిపై మరొకరికి మంచి అభిప్రాయాలు ఏర్పడ్డాయని డామియా చెప్పింది. ఒకరిని విడిచి మరొకరు ఉండలేనంతగా పెరిగిందని తెలిపింది. దీంతో తాము ఈ సంవత్సరం లాస్ వెగాస్‌లో వివాహం చేసుకోవాలని ప్లాన్ చేసుకున్నట్లు వివరించింది.

Late Age Love

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి