ఏదు దశాబ్దాలుగా దేశాన్ని పాలించిన బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్-2 సెప్టెంబర్ 8 న తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఈ వార్త ఆ దేశ ప్రజలనే కాదు ప్రపంచవ్యాప్తంగా ప్రజలను తీవ్ర భావోద్వేగానికి గురి చేసింది. రాణి ఎలిజబెత్ మరణ వార్తను..
ఏదు దశాబ్దాలుగా దేశాన్ని పాలించిన బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్-2 సెప్టెంబర్ 8 న తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఈ వార్త ఆ దేశ ప్రజలనే కాదు ప్రపంచవ్యాప్తంగా ప్రజలను తీవ్ర భావోద్వేగానికి గురి చేసింది. రాణి ఎలిజబెత్ మరణ వార్తను బ్రిటీష్ ఎయిర్‌వేస్ పైలట్ మిడ్‌ఫ్లైట్‌లో ప్రకటించారు. ఈ వార్త విని క్యాబిన్ సిబ్బంది కన్నీళ్లు పెట్టుకున్నారు. విమానం లండన్‌లో ల్యాండయ్యేందుకు 40 నిమిషాల ముందు పైలట్ (Pilot) ఈ విషయాన్ని అనౌన్స్ చేశారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో (Social Media) వైరల్ గా మారింది. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ క్లిప్ లో పైలట్ క్వీన్ ఎలిజబెత్-2 మరణవార్తను ప్రయాణికులకు చెప్పడాన్ని వినవచ్చు. క్వీన్ ఎలిజబెత్ మరణవార్త విని ఓ ఎయిర్ హోస్టెస్ దిగ్భ్రాంతి చెందింది. ఆమె కన్నీరుమున్నీరుగా విలపించింది. ఈ దృశ్యాలు వీడియోలో స్పష్టంగా కనిపించాయి. ఈ వీడియోను బీఏ ఫ్లైట్ 178 లో న్యూయార్క్‌లోని జేఎఫ్‌కే విమానాశ్రయం నుంచి లండన్‌లోని హీత్రూ విమానాశ్రయానికి ప్రయాణిస్తున్నప్పుడు చిత్రీకరించాడు.
కాగా.. బ్రిటన్ రాణి ఎలిజబెత్ II గురువారం మరణించారు. ఆమె కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. స్కాట్లాండ్‌లోని బాల్మోరల్ కాజిల్‌లో ఉన్న ఆమె అక్కడే ఆరోగ్య కారణాలతో చనిపోయారు. ఆమె ఎక్కువ కాలం 70 సంవత్సరాల పాటు బ్రిటన్ రాణిగా పనిచేశారు. ఎలిజబెత్ II మరణం పట్ల భారత ప్రధాని మోడీ సంతాపం వ్యక్తం చేశారు. ఎలిజబెత్ II మన కాలంలో గొప్ప పాలకురాలిగా గుర్తుండిపోతుందని కొనియాడారు. ఆమె కుటుంబంతో పాటు, బ్రిటన్ ప్రజలు శోక సమయంలో ఉన్నారని ట్వీట్ చేశారు.
మరిన్ని అంతర్జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి