Hyderabad: బిగ్ ఛాలెంజ్ పూర్తైంది.. గణేశ్ నిమజ్జనోత్సవాల పర్యవేక్షణలో పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ గ్రాండ్ సక్సెస్
తెలంగాణ రాష్ట్రానికే తలమానికంగా.. రాష్ట్ర పోలీసుల గొప్పదనాన్ని చాటిచెప్పేలా.. హైదరాబాద్, బంజారాహిల్స్‌లో కొలువుదీరిన పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్.. తొలిసవాల్‌ను ఎదుర్కొంది. దేశంలోనే ఫేమస్ అయిన హైదరాబాద్ గణేశ్ ఉత్సవాల బందోబస్తు పర్యవేక్షణ రూపంలో.. బిగ్ ఛాలెంజ్‌ను ఫేస్ చేసింది.
తెలంగాణ భద్రతకు భరోసా. దేశంలో నెంబర్ వన్‌గా నిలిచిన రాష్ట్ర పోలీసులకు.. అదనపు అండ. అవును.. అత్యాధునిక హంగులతో రూపుదిద్దుకున్న తెలంగాణ పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ గురించే ఇదంతా. ఇంతకీ, ఇటీవల గ్రాండ్‌గా ఓపెనింగ్ సెరిమనీ జరుపుకొన్న ఈ పోలీస్ టవర్ నుంచి.. తొలిసారి గణేశ్‌నిమజ్జన పర్యవేక్షణ ఎలా సాగింది? అసలు అక్కణ్నుంచి సిస్టం ఆపరేటింగ్ ఎలా ఉంది? అసలు, కమాండ్ కంట్రోల్ సెంటర్ పనిచేస్తోంది? తెలుసుకుందాం రండి. తెలంగాణ రాష్ట్రానికే తలమానికంగా.. రాష్ట్ర పోలీసుల గొప్పదనాన్ని చాటిచెప్పేలా.. హైదరాబాద్, బంజారాహిల్స్‌లో కొలువుదీరిన పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్.. తొలిసవాల్‌ను ఎదుర్కొంది. దేశంలోనే ఫేమస్ అయిన హైదరాబాద్ గణేశ్ ఉత్సవాల బందోబస్తు పర్యవేక్షణ రూపంలో.. బిగ్ ఛాలెంజ్‌ను ఫేస్ చేసింది. పేరుకు తగ్గట్టే.. ధీటుగా పనిచేసి, సత్తాచాటింది. ఒక్క హైదరాబాద్‌లోనే కాదు.. రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న వినాయక నిమజ్జనాల తీరును పర్యవేక్షించింది.
పకడ్బందీగా బందోబస్తు ఏర్పాట్లు.. కమాండ్ కంట్రోల్… కమాండ్ కంట్రోల్… అనడమే తప్ప.. దాని పనితీరు ఎలా ఉంటుంది? ఎలా ఉంటుందనే విషయంలో జనాలకో క్లారిటీ లేదు. అయితే, భారీ ఉత్సవమైన నిమజ్జనాన్ని ఎలా మానిటరింగ్ చేసింది? ఎలాంటి విధానాన్ని అవలంభించింది? అనే విషయాన్ని సైబరాబాద్ సీపీ మాటల్లో వింటే… క్లారిటీ వస్తుంది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఒకేసారి 17వందల సీపీ ఫుటేజీలను పోలీసులు మానిటరింగ్ చేస్తున్నారంటేనే .. టెక్నాలజీ అర్థం చేసుకోవచ్చు. అబిడ్స్ సర్కిల్ టు ఖైరతాబాద్ బడా గణేశ్ దాకా.. సిటీలో ఈ మూల నుంచి ఆ మూల దాకా.. ప్రతీ ఇంచు సర్వైలెన్స్‌లోనే ఉందంటే .. మానిటరింగ్ ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు. హైదరాబాద్ గణేశ్ ఉత్సవాలంటే మామూలు విషయం కాదు.. వేలాది గణనాథులు, వెనకాలే లక్షల మంది భక్తులు… ఆ కోలాహలాన్ని, ఆ శోభాయాత్రలను వర్ణించడానికి మాటలెలా చాలవో.. భద్రత విషయంలో ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా.. విద్రోహ శక్తులు విరుచుకుపడే తీరు అంతే భయానకంగా ఉంటుంది. అందుకే, ఎంతో పకడ్బందీగా బందోబస్తు ఏర్పాట్లు చేస్తారు జంటనగరాల పోలీసులు.
ఖైరతాబాద్ గణేశుడి చుట్టూ.. ఈసారి పోలీసు పహారా ప్రత్యేకం. కారణం, తెలంగాణ పొలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్. ఆ స్పెషాలిటీకి తగ్గట్టే.. దారి పొడవునా గణేశ్ శోభాయాత్రలపైనా, ట్యాంక్ బండ్‌మీదున్న ప్రతీ క్రేన్ పైనా… కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచే డేగ కన్ను వేసుంచారు. గుంపుగుంపులుగా తిరిగే జనాల్లో… అనుమానాస్పద వ్యక్తుల్ని ఏరేసే బాధ్యతల్ని అక్కణ్నుంచే నిర్వర్తించారు. సిటీ పరిధిలోని అన్ని పీఎస్‌ల సీసీ ఫుటేజీలు అనుసంధానం.. వీటన్నింటినీ మానిటర్ చేసే వ్యవస్థ.. కమాండ్ కంట్రోల్‌లో జంటనగరాల్లో గణేశ్ ఉత్సవాలు ఒకెత్తయితే.. ఖైరతాబాద్ భారీ గణనాథుడు మరో ఎత్తు. అందుకే, ఆ భారీ వినాయకుడి ప్రతిష్టాపన మొదలు నిమజ్జనం వరకు .. ఆ పరిసరాల చుట్టే స్పెషల్ ఫోకస్ ఉంటుంది. ఈసారి కమాండ్ కంట్రోల్ నుంచి మరింత నజర్ పెంచారు పోలీసులు. పెద్ద గణేషుడి చుట్టే పదిహేను నుంచి 20 కెమెరాలు పెట్టి మానిటరింగ్ చేశారు.
ప్రతి కదలికను పసిగట్టేలా.. భారీ జన సమూహం మధ్య.. ప్రతీ మనిషి కదలికను, ప్రతీ వాహనం మూవ్‌మెంట్‌నూ గుర్తించడం మామూలు విషయం కాదు. కానీ, కమాండ్ కంట్రోల్‌లో ఉన్న ప్రత్యేక వ్యవస్థ వల్ల.. వాహనాల నంబర్లతో సహా పసిగట్టే వీలుంది. కమాండ్ కంట్రోల్ సెంటర్ అనేది ఎన్నింతల బలమో చెప్పలేం.. కానీ, తెలంగాణ పోలీసులకు అదనపు బలాన్ని ఇచ్చిందన్నది మాత్రం వాస్తవం. తెలంగాణ పోలీసు బాస్ , డీజీపీ మహేందర్ రెడ్డి అభిప్రాయమైతే అదే. మొత్తానికి, తెలంగాణ పొలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ అంటే ఇదీ, అనేలా నిమజ్జనోత్సవంలో భద్రతా ఏర్పాట్లను మానిటరింగ్ చేసి చూపించారు రాష్ట్ర పోలీసులు. భద్రతా వ్యవస్థలో టెక్నాలజీ వినియోగాన్ని పెంచుకోవడం ఎంత అవసరమో చాటిచెప్పారు. ఈ ఫార్ములాతో తాము సాధిస్తున్న విజయాల్ని తెలంగాణ పోలీసులు మరోసారి దేశానికి తెలియజెప్పారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..