Andhra Pradesh: సీపీఎస్ పై మరోసారి స్పందించిన మంత్రి బొత్స.. తొందరపడి హామీ ఇచ్చామంటూనే కీలక ప్రకటన

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో సీపీఎస్ రగడ రోజురోజుకు కీలక మలుపులు తిరుగుతోంది. నిన్నటి వరకు ఉద్యోగుల కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ రద్దు సాధ్యం కాదని తేల్చిన మంత్రి బొత్స..నేడు అదే విషయంపై స్పందించాడు...

Andhra Pradesh: సీపీఎస్ పై మరోసారి స్పందించిన మంత్రి బొత్స.. తొందరపడి హామీ ఇచ్చామంటూనే కీలక ప్రకటన
Botsa Satyanarayana
Follow us

|

Updated on: Sep 10, 2022 | 3:10 PM

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో సీపీఎస్ రగడ రోజురోజుకు కీలక మలుపులు తిరుగుతోంది. నిన్నటి వరకు ఉద్యోగుల కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ రద్దు సాధ్యం కాదని తేల్చిన మంత్రి బొత్స..నేడు అదే విషయంపై స్పందించాడు. ఎన్నికల ముందు వైసీపీ ఇచ్చిన 100 హామీల్లో సీపీఎస్ ఒకటని చెప్పారు. ఈ హామీని నెరవేర్చేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. నిర్ణయాన్ని రెండు నెలల్లో వెల్లడిస్తామన్నారు. అంతే కాకుండా ఉద్యోగుల క్రమబద్ధీకరణను ఈ ఏడాది చివరి నాటికి పరిష్కరిస్తామని స్పష్టం చేశారు. కాగా.. ఉద్యోగ సంఘాల నాయకులతో జరిపిన చర్చల్లో సీపీఎస్‌ (CPS) రద్దుపై తాము తొందరపడి హామీ ఇచ్చామని మంత్రి బొత్స అన్నారు. జీపీఎస్ (GPS) పై ఉద్యోగులతో చర్చించామని, రిటైర్ అయ్యాక గ్యారంటీగా కనీసం రూ.10,000 పెన్షన్ ఉండేలా చూస్తామని ఉద్యోగులకు హామీ ఇచ్చినట్లు వివరించారు. పెన్షనర్ చనిపోతే భార్య లేదా భర్తకు పెన్షన్ ఇస్తామన్నారు. ఉద్యోగులతో మరోసారి చర్చలు జరిపి, జీపీఎస్ ఫైనల్ అయ్యాక. చట్ట బద్ధత కల్పిస్తామని స్ఫష్టం చేశారు.

మరోవైపు.. శ్రీకాకుళం జడ్పీ సమావేశ మందిరంలో జరిగిన రివ్యూ మీటింగ్ లో అధికారులపై మంత్రి బొత్స సత్య నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. వేదికపై మంత్రులు, స్పీకర్, కలెక్టర్‌ ఉండగా వారు వెళ్లిపోవడాన్ని తప్పు బట్టారు. ఇలా చేయడం క్రమశిక్షణా రాహిత్యమని మండిపడ్డారు. చర్చ ముగిశాక మంత్రి బొత్స సమావేశ ప్రాధాన్యం వివరించారు. ఆ సమయంలో అధికారులు బయటకు వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో ఆయన కూర్చోవాలని చెప్పారు. అప్పటికే కొందరు వెళ్లిపోవడం గమనార్హం. దీంతో ఆయన అసహనానికి గురై అధికారుల తీరును తప్పుబట్టారు. ఇది సరైన పద్ధతి కాదని, పద్ధతి మార్చుకోవాలని సూచించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి..