Hyderabad Metro: రికార్డులు బ్రేక్ చేసిన మెట్రో.. నిన్న ఒక్క రోజే 4 లక్షల ప్రయాణాలు.. ఆ స్టేషన్ లోనే అత్యధికం..

హైదరాబాద్ మెట్రోలో నిన్న (శుక్రవారం) రికార్డు స్థాయిలో ప్రజలు ప్రయాణించారు. ఒక్క రోజే 4 లక్షల మంది జర్నీ చేసినట్లు మెట్రో రైల్‌ అధికారులు తెలిపారు. గణేశ్ నిమజ్జనాల సందర్భంగా మెట్రో రైలు వేళలు పొడిగించిన విషయం...

Hyderabad Metro: రికార్డులు బ్రేక్ చేసిన మెట్రో.. నిన్న ఒక్క రోజే 4 లక్షల ప్రయాణాలు.. ఆ స్టేషన్ లోనే అత్యధికం..
Hyderabad Metro
Follow us
Ganesh Mudavath

|

Updated on: Sep 10, 2022 | 6:28 PM

హైదరాబాద్ మెట్రోలో నిన్న (శుక్రవారం) రికార్డు స్థాయిలో ప్రజలు ప్రయాణించారు. ఒక్క రోజే 4 లక్షల మంది జర్నీ చేసినట్లు మెట్రో రైల్‌ అధికారులు తెలిపారు. గణేశ్ నిమజ్జనాల సందర్భంగా మెట్రో రైలు వేళలు పొడిగించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రయాణాలు సాగించిన వారి సంఖ్య కూడా పెరిగిందని అధికారులు వెల్లడించారు. మియాపూర్- ఎల్బీనగర్ కారిడార్‌లో 2.46 లక్షలు, నాగోల్-రాయదుర్గం రూట్ లో 1.49 లక్షలు, జేబీఎస్-ఎంజీబీఎస్ మార్గంలో 22 వేలు మంది ప్రయాణించారు. ఖైరతాబాద్ (Khairatabad) మెట్రో స్టేషన్‌లో అత్యధికంగా 22వేల మంది రైలెక్కగా 40 వేల మంది రైలు దిగారు. కాగా.. శుక్రవారం హైదరాబాద్ వ్యాప్తంగా గణేశ్ నిమజ్జన ఉత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ క్రమంలో చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. దీంతో రాకపోకలకు అంతరాయం కలగకుండా హైదరాబాద్ మెట్రో కీలక నిర్ణయం తీసుకుంది. శుక్రవారం(సెప్టెంబర్ 9) హైదరాబాద్ (Hyderabad) మెట్రో రైళ్ల సమయం పొడిగించింది. ఉదయం 6 గంటల నుంచి అర్థరాత్రి 2 గంటల వరకు మెట్రో సేవలు అందించాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో మెట్రోలో ప్రయాణాలు భారీగా పెరిగాయి.

హైద‌రాబాద్‌ మెట్రో రైల్‌కు రోజురోజుకు డిమాండ్ పెరుగుతోంది. మెట్రో రైలులో ప్రయాణాలు చేస్తున్న వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. మెట్రో రైలులో ప్రతి గంటకు ఐదు నుంచి ఆరు వేల మంది ప్రయాణాలు చేస్తున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. మెయిన్ స్టేషన్లు, ఇంటర్ చేంజ్ స్టేషన్లలో రద్దీ విపరీతంగా ఉంటోంది. కాలు కూడా పెట్టే చోటు దొరకడం లేదంటే అతిశయోక్తి కాదు. ఉదయం సాయంత్రం వేళల్లో విపరీతమైన రద్దీ ఉంటుంది. మెట్రో ప్రయాణం చేసే వారిలో సగానికి పైగా స్టేషన్లలో టికెట్లు తీసుకుంటుంటే మ‌రి కొంద‌రు మాత్రం యూపీఐ పేమెంట్స్, స్మార్ట్ కార్డును ఉపయోగిస్తున్నారు.

మరోవైపు.. మెట్రో ప్రయాణికుల కోసం ప్రత్యేక ఆఫర్లనూ తీసుకువచ్చిన విషయం తెలిసిందే. రూ.59 కే రోజంతా ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణించే వెసులుబాటు కల్పించింది. వీకెండ్ లు, సెలవు రోజుల్లో మాత్రమే ఈ ఆఫర్ ఉంటుందని కండీషన్ పెట్టింది. దీంతో ప్రయాణీకుల సంఖ్య విపరీతంగా పెరిగింది. అంతే కాకుండా ట్రాఫిక్ ఇబ్బందులు, త్వరగా గమ్యస్థానాలకు చేర్చే సౌలభ్యం కారణంగా మెట్రో రైలుకు రోజురోజుకు ఆదరణ పెరుగుతోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..
ఆ మూడు జట్లకు బాక్సింగ్ డే టెస్టు కీలకం..
ఆ మూడు జట్లకు బాక్సింగ్ డే టెస్టు కీలకం..
శీతాకాలంలో తాటి బెల్లం తింటే ఇన్ని లాభాలా.. డోంట్ మిస్!
శీతాకాలంలో తాటి బెల్లం తింటే ఇన్ని లాభాలా.. డోంట్ మిస్!
భూమ్మీద నూకలు మిగిలున్నాయ్ అంటే ఇదేనేమో.. ఇక్కడ జరిగింది చూస్తే..
భూమ్మీద నూకలు మిగిలున్నాయ్ అంటే ఇదేనేమో.. ఇక్కడ జరిగింది చూస్తే..
తుఫాన్ ఇన్నింగ్స్‌తో దుమ్ము దులుపుతున్న లేడి కోహ్లీ
తుఫాన్ ఇన్నింగ్స్‌తో దుమ్ము దులుపుతున్న లేడి కోహ్లీ
గుడ్‌న్యూస్‌..త్వరలో వాయిస్‌, SMSలతో కూడిన రీఛార్జ్‌ వోచర్లు-TRAI
గుడ్‌న్యూస్‌..త్వరలో వాయిస్‌, SMSలతో కూడిన రీఛార్జ్‌ వోచర్లు-TRAI
ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలే.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..
ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలే.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..