AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Navneet Rana: నిమజ్జనంలో గణేష్‌ విగ్రహాన్ని మురికి నీటిలో విసిరేసిన ఎంపీ నవనీత్, ఆమె భర్త.. నెట్టింట వైరలవుతున్న వీడియో

గణేష్‌ విగ్రహాన్ని భక్తి శ్రద్ధలతో నిమజ్జనం చేయకుండా నిర్లక్ష్యంగా చేయటంతో నెట్టింట తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

Navneet Rana: నిమజ్జనంలో గణేష్‌ విగ్రహాన్ని మురికి నీటిలో విసిరేసిన ఎంపీ నవనీత్, ఆమె భర్త.. నెట్టింట వైరలవుతున్న వీడియో
Navneet Rana
Jyothi Gadda
|

Updated on: Sep 12, 2022 | 7:38 AM

Share

Navneet Rana: మహారాష్ట్రలోని అమరావతికి చెందిన ఇండిపెండెంట్‌ ఎంపీ నవనీత్ రాణా, ఆమె భర్త రవి రాణా మరోసారి వివాదాస్పద వార్తల్లో నిలిచారు. నవనీత్ రాణా, ఆమె భర్త రవి రాణా గణేష్ నిమర్జనానికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఇందులో కొందరితో కలిసి గణేష్ విగ్రహాన్ని గౌరవంగా, భక్తితో నిమజ్జనం కాకుండా పై నీటిలోకి విసిరేస్తున్నారు. విగ్రహం విసిరిన నీరు కూడా మురికిగా, బురదగా కనిపిస్తోంది. ఈ వీడియో వైరల్ అయినప్పటి నుండి నవనీత్ రాణా మరోమారు సోషల్‌ మీడియాలో విపరీతంగా ట్రోల్ అవుతున్నారు. ఈ వీడియోపై పలువురు యూజర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు “హిందుత్వ కాంట్రాక్టర్ల పనితీరు ఇలాగే ఉంటుందంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరెవరైనా ఇలాంటి పని చేసి ఉంటే రానా దంపతులు, బీజేపీ పెద్ద ఇష్యూ చేసేవారని మండిపడుతున్నారు. వినాయకుడ్ని, హిందూ మతాన్ని అవమానించినందుకు వారిపై కేసు నమోదు చేయాలని చాలా మంది నెటిజన్లు డిమాండ్‌ చేశారు.

శివసేన ఉప నాయకురాలు సుష్మా అంధారే కూడా ఎంపీ నవనీత్ రాణాను టార్గెట్ చేశారు. మతం పేరుతో నవనీత్ రాణా ప్రారంభించిన హింసను అరికట్టాలని ఆమె అన్నారు. హిందుత్వం కోసం ఆమె నిరంతరం గందరగోళం సృష్టిస్తోంది. వినాయకుడి విగ్రహన్ని ఎలా నిమజ్జనం చేయాలో వారికి తెలియదా..? అని ప్రశ్నించారు.

ఇవి కూడా చదవండి

అయితే, గతంలో మహారాష్ట్రలో బీజేపీకి మద్దతుగా ఉన్న ఎంపీ నవనీత్‌ రాణా, ఆమె భర్త రవి రాణా కలిసి మాజీ సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే నివాసం వద్ద హనుమాన్‌ చాలీసా పఠనానికి పిలుపునివ్వడం వివాదస్పదమైంది. నాటి నుంచి ఈ దంపతులు తరచుగా హిందుత్వ ఎజెండాతో వార్తల్లో నిలిస్తున్నారు. తాజాగా గణేష్‌ విగ్రహాన్ని భక్తి శ్రద్ధలతో నిమజ్జనం చేయకుండా నిర్లక్ష్యంగా చేయటంతో నెట్టింట తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి