AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AAP: నిన్న లిక్కర్ స్కాం.. నేడు డీటీఎస్ బస్సుల స్కాం.. ఆప్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న వరస ఆరోపణలు

దేశ రాజధాని ఢిల్లీలో (Delhi) అధికార ఆప్‌, లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మధ్య వ్యవహారం మరింత ముదిరింది. లిక్కర్‌ స్కామ్‌ కొలిక్కి రాకముందే డీటీసీ బస్సుల కొనుగోళ్లపై సీబీఐ దర్యాప్తునకు లెఫ్టినెంట్‌ గవర్నర్‌..

AAP: నిన్న లిక్కర్ స్కాం.. నేడు డీటీఎస్ బస్సుల స్కాం.. ఆప్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న వరస ఆరోపణలు
Arvind Kejriwal
Ganesh Mudavath
|

Updated on: Sep 12, 2022 | 6:40 AM

Share

దేశ రాజధాని ఢిల్లీలో (Delhi) అధికార ఆప్‌, లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మధ్య వ్యవహారం మరింత ముదిరింది. లిక్కర్‌ స్కామ్‌ కొలిక్కి రాకముందే డీటీసీ బస్సుల కొనుగోళ్లపై సీబీఐ దర్యాప్తునకు లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వీకే సక్సేనా ఆదేశించడం సంచలనంగా మారింది. ఢిల్లీ ట్రాన్స్‌పోర్ట్‌ కార్పొరేషన్‌ కొనుగోలు చేసిన లో ఫ్లోర్‌ బస్సు ల వ్యవహారంలో అవినీతి జరిగిందంటూ ఆరోపణలు వచ్చాయి. దీనిపై సీబీఐ విచారణ జరిపేందుకు లెఫ్టినెంట్ గవర్నర్ ఆమోదం తెలిపారు. దీన్ని బీజేపీ స్వాగతించగా ఆప్‌ ఖండించింది. సీఎం కేజ్రీవాల్‌ అవినీతికి మారుపేరుగా నిలిచారని బీజేపీ నేత గౌరవ్‌ భాటియా విమర్శించారు. ఇప్పటికే మనీలాండరింగ్‌ కేసుతో పాటు లిక్కర్‌ స్కాంలో సీబీఐ (CBI) దర్యాప్తు జరుగుతోందని చెప్పారు. తాజాగా బస్సుల స్కాం వెలుగులోకి వచ్చిందని మండిపడ్డారు. అయితే డీటీసీ బస్సుల కొనుగోళ్లలో ఎలాంటి స్కాం జరగలేదని ఆప్‌ వెల్లడించింది. అసలు లోఫ్లోర్‌ బస్సుల కొనుగోళ్ల టెండర్లను రద్దు చేసినప్పుడు స్కాం జరిగేందుకు ఎలా అవకాశం ఉంటుందని ఆ పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు. తనపై వచ్చిన అవినీతి ఆరోపణలను కప్పిపుచ్చుకోవడానికే లెఫ్టినెంట్ గవర్నర్‌ ఆప్‌ ప్రభుత్వంపై విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు.

కాగా 2019 జులై లో వెయ్యి లోఫ్లోర్‌ బస్సుల కొనుగోలు, 2020లో వాటి వార్షిక నిర్వహణకు సంబంధించిన బిడ్ల వ్యవహారాల్లో అవకతవకలు జరిగాయని ఎల్‌జీకి ఫిర్యాదు వచ్చింది. బస్సుల కొనుగోలు ప్రక్రియను పర్యవేక్షించేందుకు ఢిల్లీ రవాణాశాఖ మంత్రిని ఛైర్మన్ గా కమిటీ నియమించారు. ఇప్పటికే మద్యం పాలసీలో స్కాం కు పాల్పడ్డారన్న ఆరోపణలతో సతమతమవుతున్న ఆప్ కు ఈ కొత్త స్కాం మరింత తలనొప్పిగా మారింది. వీటిపై ఇప్పటికే సీబీఐ దర్యాప్తు ప్రారంభించాయి. దీంతో రెండింటినీ కలిపి దర్యాప్తు చేయాలని ఎల్జీ సక్సేనా సూచించినట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం

Follow Us
చేతబడి చేస్తున్నాడనే అనుమానం.. చివరకు ఎంత దారుణం జరిగిందో తెలుసా?
చేతబడి చేస్తున్నాడనే అనుమానం.. చివరకు ఎంత దారుణం జరిగిందో తెలుసా?
టాలీవుడ్‌లో దుమ్మురేపుతున్న ముద్దుగుమ్మ..
టాలీవుడ్‌లో దుమ్మురేపుతున్న ముద్దుగుమ్మ..
ఖారా మిక్చర్‌లో వేయించిన బల్లి... అది తిన్నవారి పరిస్థితి మరీ?
ఖారా మిక్చర్‌లో వేయించిన బల్లి... అది తిన్నవారి పరిస్థితి మరీ?
బట్టతలతో కనిపించిన కాకి...అపశకునమా? లేక ప్రకృతిలో జరిగే సహజ వింత?
బట్టతలతో కనిపించిన కాకి...అపశకునమా? లేక ప్రకృతిలో జరిగే సహజ వింత?
తత్కాల్ టికెట్స్‌ లభించడం లేదా? ఇలా చేయండి.. వెంటనే బుక్‌ అవుతాయి
తత్కాల్ టికెట్స్‌ లభించడం లేదా? ఇలా చేయండి.. వెంటనే బుక్‌ అవుతాయి
గుడ్‌న్యూస్‌.. ఆ పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.3 తగ్గింపు..
గుడ్‌న్యూస్‌.. ఆ పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.3 తగ్గింపు..
మైదానంలోకి దిగకముందే చర్చల్లో వైభవ్
మైదానంలోకి దిగకముందే చర్చల్లో వైభవ్
ఎప్పుడూ వాడే టిష్యూ పేపర్ తెలుపు రంగులోనే ఎందుకు ఉంటుందో తెలుసా?
ఎప్పుడూ వాడే టిష్యూ పేపర్ తెలుపు రంగులోనే ఎందుకు ఉంటుందో తెలుసా?
ఓఆర్‌ఆర్‌పై కాల్పుల కలకలం.. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అరెస్ట్
ఓఆర్‌ఆర్‌పై కాల్పుల కలకలం.. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అరెస్ట్
రోజూ 10 నిమిషాల యోగాతో మీ జీవితాన్ని మార్చుకోండి..ఆరోగ్య ప్రయోజనం
రోజూ 10 నిమిషాల యోగాతో మీ జీవితాన్ని మార్చుకోండి..ఆరోగ్య ప్రయోజనం