Viral: పాము కాటు వేసిందని ఆస్పత్రికి యువకుడు.. అతని చేతిలో కనిపించింది చూసి అందరూ హడల్
అతడిని పాము కాటేసింది. వెంటనే దాన్ని చంపేశాడు. అయితే ఆ చనిపోయిన పామును తన కారు ఢిక్కీలో పెట్టుకుని ఆస్పత్రికి తీసుకురావడంతో అందరూ హడలిపోయారు.
Trending: ఉత్తరప్రదేశ్( Uttar Pradesh)లోని బహ్రైచ్ జిల్లా( Bahraich district)లో ఒక ప్రత్యేకమైన ఘటన వెలుగుచూసింది. థానా హార్దిలోని బహోరీపూర్ గ్రామానికి చెందిన మహేష్ వాజ్‌పేయి అనే యువకుడిని విషసర్పం కాటు వేసింది. అతడు నిద్రకు ఉపక్రమించిన సమయంలో ఈ ఘటన జరిగింది. కాలిపై మంటగా అనిపించడంతో.. ఆ యువకుడు టార్చ్ లైట్ వెలిగించి చూశాడు. విషపూరితమైన పామును చూసి కంగుతిన్నాడు. వెంటనే దాన్ని చంపేశాడు. అనంతరం ఆ చచ్చిన పామును తన కారు ఢిక్కీలో పెట్టుకుని చికిత్స నిమిత్తం జిల్లా ఆస్పత్రికి చేరుకున్నాడు. ఆస్పత్రి వద్ద ఆ యువకుడు కారు ఢిక్కిలో నుంచి పాము కళేబరాన్ని బయటకు తీయగానే ఒక్కసారిగా కలకలం రేగింది అతడి చేతిలో పాము కనిపించడంతో ఆసుపత్రిలోని ఎమర్జెన్సీ వార్డులో గందరగోళం నెలకొంది. వెంటనే డాక్టర్లు అతడికి చికిత్స అందించి.. అబ్జర్వేషన్‌లో ఉంచారు. ఏ పాము కాటు వేసిందో.. వైద్యులకు తెలియజేసేందుకు తాను ఆ పాము కళేబరాన్ని ఆస్పత్రికి తీసుకువచ్చినట్లు మహేశ్ తెలిపాడు. ఆ యువకుడి ధైర్యాన్ని కొందరు కొనియాడుతుండగా.. పామును చంపింనందుకు మరికొందరు విమర్శిస్తున్నారు. ఒకవేళ డాక్టర్ల నిజంగానే తెలియాలి అనుకుంటే.. ఫోటో తీసుకుని రావొచ్చు కదా అని ప్రశ్నిస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం