Smartphone: రాత్రి పడుకునేప్పుడు ఫోన్‌ పక్కన పెట్టుకుంటున్నారా.? ఈ సంఘటన మీ వెన్నులో వణుకు పుట్టిస్తుంది..

Smartphone: రాత్రి పడుకునే ముందు చివరిసారిగా, ఉదయం లేవగానే మొదట చూసే వస్తువు ఏదైనా ఉందా అంటే అది స్మార్ట్‌ఫోన్‌ అనే చెప్పాలి. అంతలా మనిషి జీవితంలో ఈ ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్‌ ఓ భాగమైపోయింది. రాత్రి నిద్రపోయే ముందు స్మార్ట్‌ఫోన్‌ను...

Smartphone: రాత్రి పడుకునేప్పుడు ఫోన్‌ పక్కన పెట్టుకుంటున్నారా.? ఈ సంఘటన మీ వెన్నులో వణుకు పుట్టిస్తుంది..
Representative Image
Follow us
Narender Vaitla

|

Updated on: Sep 12, 2022 | 8:58 AM

Smartphone: రాత్రి పడుకునే ముందు చివరిసారిగా, ఉదయం లేవగానే మొదట చూసే వస్తువు ఏదైనా ఉందా అంటే అది స్మార్ట్‌ఫోన్‌ అనే చెప్పాలి. అంతలా మనిషి జీవితంలో ఈ ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్‌ ఓ భాగమైపోయింది. రాత్రి నిద్రపోయే ముందు స్మార్ట్‌ఫోన్‌ను తలగడ కింద లేదా పక్కన పెట్టుకుని పడుకునే వారు మనలో చాలా మంది ఉంటారు. మీరు కూడా నిద్రించే ముందు స్మార్ట్‌ఫోన్‌ను పక్కన పెట్టుకుంటున్నారు కదూ.! అయితే తాజాగా ఢిల్లీలో జరిగిన ఓ సంఘటన గురించి తెలిస్తే మాత్రం ఇకపై జీవితంలో ఆ పని చేయరు.

ఇంతకీ విషయమేంటంటే.. ఢిల్లీకి చెందిన ఓ మహిళ రాత్రి నిద్రించే సమయంలో స్మార్ట్‌ఫోన్‌ను తల పక్కన పెట్టుకొని నిద్రపోయింది. అయితే అర్థరాత్రి ఆ ఫోన్‌ ఒక్కసారిగా పేలింది. దీంతో సదరు మహిళ నిద్రలోనే శాశ్వత నిద్రలోకి జారుకుంది. ఉదయం స్థానికులు వచ్చి చూడగా రక్తపు మడుగులో ప్రాణాలు కోల్పోయి విగతజీవిగా కనిపించింది. ఈ విషయాన్ని గమనించిన ఆ మహిళ అల్లుడు ఆమె ఫొటోతో పాటు, పేలిన స్మార్ట్‌ఫోన్‌ ఫొటోలను ట్విట్టర్‌ వేదికగా పోస్ట్‌ చేశాడు. దీంతో ప్రస్తుతం ఈ ట్వీట్‌ నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. ఈ ఫొటోలతో పాటు..’మా ఆంటీ నిన్న రాత్రి మరణించారు. ఆమె రెడ్‌మీ 6ఏ స్మార్ట్‌ఫోన్‌ను ఉపయోగిస్తున్నారు. రాత్రి నిద్రించే సమయంలో ఫోన్‌ను దిండు పక్కనే పెట్టుకొని పడుకుంది. మధ్య రాత్రిలో ఫోన్‌ పేలి మా అత్త చనిపోయింది. మాకు సాయం చేయాల్సిన బాధ్యత సదరు స్మార్ట్‌ఫోన్‌ సంస్థపై ఉంది’ అంటూ ట్వీట్ చేశాడు. దీంతో నెటిజన్లు సైతం సదరు మహిళ కుటుంబ సభ్యులకు అండగా నిలుస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఈ ట్వీట్ లోని ఫొటోలు మిమ్మల్ని కలిచి వేయవచ్చు..

చూశారుగా పొరపాటున కూడా ఇకపై స్మార్ట్‌ఫోన్‌ను పడుకునే ముందు పక్కన పెట్టుకోకండి. నిద్రకు ఉపక్రమించే ముందే ఫోన్‌ను వీలైనంత దూరంగా ఉంచడం ఉత్తమం. దీనివల్ల రేడియేషన్‌ సమస్యకు కూడా చెక్‌ పెట్టొచ్చు. కొందరు అలారం కోసం ఫోన్‌ను తల పక్కన పెట్టుకుంటారు. అయితే అలాంటి వారు స్మార్ట్‌ఫోన్‌ను బదులుగా అలారం వచ్చే క్లాక్‌లను ఉపయోగిస్తే బెటర్‌.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?
బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే
బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే
విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..
విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..
తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..
తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!
ఆనంద్‌ మహీంద్రాకు ఎంతమంది పిల్లలు.. వారు ఏం చేస్తుంటారో తెలుసా.?
ఆనంద్‌ మహీంద్రాకు ఎంతమంది పిల్లలు.. వారు ఏం చేస్తుంటారో తెలుసా.?
టీమిండియా క్రికెటర్ తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. కేసు ఏంటంటే?
టీమిండియా క్రికెటర్ తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. కేసు ఏంటంటే?