Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: కోడి గూడే అతని నివాసం.. ప్రపంచానికి ఇతను ఉన్నా లేనట్టే.. ఇదేం విచిత్రమంటే..

ప్రతి వ్యక్తికి గుర్తింపు కోసం ఆధార్‌ కార్డు, ఓటర్ ఐడీ, రేషన్ కార్డు ఇలా ప్రతీది ఉంటున్నాయి. అంతేకాదు..ఎక్కడ ఏదీ కావాలన్న అరచేతిలోనే అందుబాటులో ఉంటాయి. కానీ, ఇక్కడో వ్యక్తికి మాత్రం ఏ ఆధారమూ లేదు.

Viral News: కోడి గూడే అతని నివాసం.. ప్రపంచానికి ఇతను ఉన్నా లేనట్టే.. ఇదేం విచిత్రమంటే..
Kerala Man
Follow us
Jyothi Gadda

|

Updated on: Sep 12, 2022 | 2:50 PM

Viral News: ఇది నిజంగానే హృదయవిదారక సంఘటన.. దేశం మొత్తం డిజిటల్‌ మయంగా మారిపోతుంది. ప్రతి వ్యక్తికి గుర్తింపు కోసం ఆధార్‌ కార్డు, ఓటర్ ఐడీ, రేషన్ కార్డు ఇలా ప్రతీది ఉంటున్నాయి. అంతేకాదు..ఎక్కడ ఏదీ కావాలన్న అరచేతిలోనే అందుబాటులో ఉంటాయి. కానీ, ఇక్కడో వ్యక్తికి మాత్రం ఏ ఆధారమూ లేదు. కూడూ, గూడూ కూడా లేక కోళ్ల గూడే అతనికి ఆవాసంగా మారింది. ఇలాంటి ఓ విషాదకర ఘటన కేరళలో వెలుగు చూసింది. పూర్తి వివరాల్లోకి వెళితే…

తన గుర్తింపును నిరూపించుకోవడానికి ఆధార్, ఓటర్ ఐడీ, రేషన్ కార్డు లేని 48 ఏళ్ల వ్యక్తి కోడిగుడ్ల కోసం ఏర్పాటు చేసిన తాత్కాలిక షెడ్డులో నివసిస్తున్నాడు. ఈ విషయం తెలిసిన స్థానిక తిరువళ్ల మున్సిపాలిటీ కార్యదర్శి ఒక్కసారిగా షాక్‌తో నోరెళ్లబెట్టాల్సి వచ్చింది. తిరువల్ల మున్సిపాలిటీలో అత్యంత పేదరికంలో ఉన్న 83 మంది వ్యక్తుల జాబితాలో తెంగుంపరంబు కాలనీకి చెందిన మధు పేరు కూడా ఉంది. మునిసిపాలిటీ కార్యదర్శి స్టాలిన్ నారాయణన్ తిరువోణం రోజు తన తాత్కాలిక షెడ్‌లో మధును కలుసుకున్నాడు..అతడి దీన స్థితిని చూసి వారంతా చలించిపోయారు. గతేడాది వరకు గుడిసెలో తన తల్లి, కొన్ని కోళ్లతో కలిసి జీవించేవాడు మధు. అయితే గతేడాది తల్లి చనిపోవడంతో ఇప్పుడతడు ఒంటరిగా ఉన్నాడు.

గతంలో మెకానిక్‌గా పనిచేసిన మధు మానసిక వ్యాధితో బాధపడుతున్నాడు. కుటుంబ సభ్యులు సమీపంలోనే ఉంటున్నప్పటికీ షెడ్డులో ఒంటరిగా ఉంటున్నాడు. తిరువోణం రోజున తనకు ఓనకోడి, ఓనసాధ్యను బహుమతిగా ఇస్తున్న సందర్శకుల సమూహంతో అతను కలవరపడ్డాడు. తరువాత, సెక్రటరీ వారి పర్యటన ఉద్దేశ్యం గురించి అతనికి తెలియజేసారు. అతనికి పునరావాసం కల్పించడానికి సహాయం చేస్తామని అధికారులు హామీ ఇచ్చారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి