Viral Video: పంజాబ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బెహ్రాం దగ్గర లారీ అదుపు కారు మీద బోల్తా పడడంతో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. ఫగ్వారా -చండీఘడ్ జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. 18 టైర్ల భారీ ఇసుక లారీ ఆకస్మాత్తుగా టర్న్ తీసుకొని బోల్తా పడింది. అదే సమయంలో స్పీడ్‌గా వస్తున్న రెండు కార్ల మీద ఆ లారీ బోల్తా పడడంతో ఈ ప్రమాదం జరిగింది.
కారులో ప్రయాణం చేస్తున్న దంపతులతో పాటు వాళ్ల కుమారుడు ఈ ప్రమాదంలో చనిపోయాడు. పోలీసులు లారీ డ్రైవర్ మనోజ్‌సింగ్‌ను అరెస్ట్ చేశారు. ఇంకో కారులో ఉన్న ప్రయాణికులు మాత్రం తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఈ ప్రమాదంలో మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి.