UPSC Recruitment 2022: యూపీఎస్సీలో ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారా? రేపటితో ముగుస్తున్న ఆన్‌లైన్ దరఖాస్తులు..
భారత ప్రభుత్వ విభాగానికి చెందిన యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) వివిధ కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 19 పోస్టులకు ఇంకా దరఖాస్తు చేసుకోవలేదా? ఆన్‌లైన్ దరఖాస్తులు రేపటితో ముగియనున్నాయి. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని..
UPSC Anthropologist Recruitment 2022: భారత ప్రభుత్వ విభాగానికి చెందిన యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) వివిధ కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 19 పోస్టులకు ఇంకా దరఖాస్తు చేసుకోవలేదా? ఆన్‌లైన్ దరఖాస్తులు రేపటితో ముగియనున్నాయి. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్ధులు సెప్టెంబర్ 15,2022వ తేదీ(రాత్రి 11 గంటల 59 నిముషాలు) ముగింపు సమయంలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో డిగ్రీ, డిప్లొమా, మాస్టర్స్ డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత విభాగంలో నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా అనుభవం తప్పనిసరిగా ఉండాలి. ఈ అర్హతలున్నవారు ఎవరైనా ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు సమయంలో జనరల్ అభ్యర్ధులు రూ.25లు దరఖాస్తు రుసుము చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ//పీడబ్ల్యూబీడీ/మహిళా అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. ఇతర వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చెక్ చేసుకోవచ్చు.
ఖాళీల వివరాలు..
- ఆంథ్రోపాలజిస్ట్ పోస్టులు: 1
- అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ పోస్టులు: 4
- సైంటిస్ట్ ‘బీ’ (Ballistics) పోస్టులు: 1
- సైంటిస్ట్ ‘బీ’ (ఫోరెన్సిక్ ఎలక్ట్రానిక్స్) పోస్టులు: 3
- సైంటిస్ట్ ‘బీ’ (ఫోరెన్సిక్ సైకాలజీ) పోస్టులు: 3
- రీహబిలిటేషన్ ఆఫీసర్ పోస్టులు: 4
- డిప్యూటీ డైరెక్టర్ జనరల్/రీజనల్ డైరెక్టర్ పోస్టులు: 3
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని కెరీర్ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.