- Telugu News Photo Gallery Strange village in India: Village of bachelors carves out a road to welcome its first bride and dual citizenship village. Let us know about these strange stories
Strange village in India: ఆ ఊరి ప్రజలకు ద్వంద్వ పౌరసత్వం, 50 ఏళ్లుగా ఒక్క పెళ్లి కూడా జరగలేదు.. ఎందుకో తెలిస్తే షాక్!
మన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో వింత ఆచారాలు, సంప్రదాయాలను అవలంభిస్తుంటారు. 50 సంవత్సరాల తర్వాత తొలిసారి పెళ్లి వేడుకలు జరుపుకున్న గ్రామం, ద్వంద్వ పౌరసత్వం కలిగిన ఊర్లు.. ఇలా వింతైన పద్ధతులను పాటించే అలాంటి ప్రాంతాలకు సంబంధించిన సమాచారం మీకోసం..
Updated on: Sep 12, 2022 | 8:12 PM

మన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో వింత ఆచారాలు, సంప్రదాయాలను అవలంభిస్తుంటారు. 50 సంవత్సరాల తర్వాత తొలిసారి పెళ్లి వేడుకలు జరుపుకున్న గ్రామం, ద్వంద్వ పౌరసత్వం కలిగిన ఊర్లు.. ఇలా వింతైన పద్ధతులను పాటించే అలాంటి ప్రాంతాలకు సంబంధించిన సమాచారం మీకోసం..

నాగాలాండ్‌లోని లాంగ్వా గ్రామస్థులకు ద్వంద్వ పౌరసత్వం ఉంటుంది. ఈ గ్రామం సరిగ్గా ఇండియా - మయన్మార్ సరిహద్దులో ఉండటం వల్ల అక్కడ నివసించే వారిలో చాలా మందికి ద్వంద్వ పౌరసత్వం ఉంటుంది.

మహారాష్ట్రలోని శని శింగనాపూర్ గ్రామంలోని ఇళ్లకు తలుపు ఉండవు. దొంగతనం భయం లేకుండా ఇలా స్వేచ్ఛగా బతుకుతారు అక్కడి ప్రజలు.

బీహార్‌లోని బద్వా కాలా గ్రామం గత 50 ఏళ్లుగా ఒక్కరు కూడా వివాహం చేసుకోలేదు. ఈ గ్రామాన్ని 'విలేజ్ ఆఫ్ బ్యాచిలర్స్' అని కూడా అంటారు. నిజానికి ఈ గ్రామానికి చేరుకోవడానికి 10 కి.మీ మేర కొండ మార్గం ఉంటుంది. సరైన రోడ్డు మార్గంలేకపోవడం వల్ల ఈ ఊరి వాళ్లకు పిల్ల నిచ్చే ధైర్యంఎవ్వరూ చేయలేదు. ఐతే 2017లో కొండలను తొలిచి 6 కిలోమీటర్ల మేర రోడ్డు వేయడంతో తొలిసారి అజయ్ కుమార్ యాదవ్ అనే వ్యక్తి వివాహం చేసుకుని భార్యను కాపురానికి తీసుకొచ్చాడు.

కర్ణాటకలోని శివమొగ్గ జిల్లా మత్తూర్ గ్రామంలో దాదాపు అందరూ సంస్కృతం మాట్లాడతారు. ఈ దక్షిణ భారతదేశ రాష్ట్రంలో కన్నడ భాష ఎక్కువగా మాట్లాడుతారు. ఐతే మాతృభాషకు విరుద్ధంగా ఈ గ్రామంలో కొన్నేళ్లుగా సంస్కృత భాష అధికంగా వాడుకలో ఉంది.





























